అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ సెంటర్ పై ఇరాన్ దాడి

Publish Date:Apr 2, 2026

Advertisement

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. బహ్రెయిన్‌లోని అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ సెంటర్‌పై ఇరాన్ దాడి చేసింది. ముందుగా చెప్పి మరీ చేసిన దాడిగా దీనిని అభివర్ణించవచ్చు. ఎందుకంటే..అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా తాము పశ్చిమాసియాలో దిగ్గజ కంపెనీలపై దాడులకు తెగబడతామని ఇరాన్ హెచ్చరించిన 24 గంటల వ్యవధిలో ఈ దాడి జరిగింది. రాయిటర్స్ కథనం మేరకు  దాడి తరువాత అమెజాన్ కంపెనీ ప్రాంగణంలో మంటలు చెలరేగాయి.

అయితే  వాటిని వెంటనే అదుపులోనికి తీసుకువచ్చారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా పశ్చిమాసియాలో అమెజాన్, యాపిల్, టెస్లా వంటి అమెరికన్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ హెచ్చరించిన  మరుసటి రోజే ఈ దాడి జరగడం గమనార్హం.  ఈ ఘటనపై అమెజాన్   అధికారికంగా స్పందించలేదు.

 అయితే  ఈ ప్రాంతంలో డ్రోన్ కార్యకలాపాల కారణంగా తమ అమెజాన్ వెబ్ సర్వీసెస్ కు అంతరాయం కలిగిందని కంపెనీ అంగీకరించింది. వాణిజ్యపరమైన డేటా సెంటర్‌పై ఒక దేశం నేరుగా భౌతిక దాడికి పాల్పడటం ఇదే మొదటిసారి. 
 

By
en-us Political News

  
హైదరాబాద్ నగరంలో కల్తీ దందాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
రాజధాని ప్రాంతమైన అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు మూడు ప్రతిష్ఠాత్మక సంస్థలకు ఈ ఎస్ఐపీబీ సమావేశంలో మంజూరు చేయడం ఈ అయ్యాయి. ఈ అనుమతులతో అమరావతి కేవలం పరిపాలనా కేంద్రంగానే కాకుండా టెక్నాలజీ హబ్‌గా కూడా ఎదుగుతుంది.
హైదరాబాద్ బేగంపేటలో ఉన్న 145 సంవత్సరాల ప్రాచీన వారసత్వ కట్టడం చిరాన్ ఫోర్ట్ క్లబ్ చుట్టూ వివాదం రాజుకుంది.
తాడేపల్లిలోని ఆమె నివాసంతో పాటు విజయవాడ, గుంటూరు జిల్లాల్లోని ఇతర అనుమానిత ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాలలో ఏసీబీ అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆమె పేరిట ఉన్న స్థిరాస్తులు, బ్యాంకు ఖాతాలు, బంగారు ఆభరణాలకు సంబంధించిన రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ చిక్కుల్లో పడ్డాడు.
తీవ్ర ఆర్థిక సంక్షోభం, అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో ఏర్పడిన ఇంధన కొరత నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీలో సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే పూర్తి సామర్ధ్యాన్ని వినియోగించుకునేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఆధునికి సాంకేతిక యుద్దాల్లో కీలక పాత్ర పోషించ ఆత్మాహుతి డ్రోన్లు భారత్ ఆర్మీ అమ్ములపొదిలో చేరాయి.
కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరాను అరెస్ట్ చేసేందుకు అస్సాం పోలీసులు హైదరాబాద్‌కు చేరుకున్నట్లు సమాచారం.
పచ్చటి రుషికొండకు బోడి గుండు కొట్టి మరీ నిర్మించిన ఈ విలాలవంతమైన భవనాన్ని ఎలా వినియోగించుకోవాలన్న విషయంపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఆ సబ్ కమిటీ తాజాగా భేటీ అయ్యింది. ఈ భేటీలో విశాఖపట్నంలోని వివాదాస్పద రుషికొండ ప్యాలెస్ ను కేవలం ఎగ్జిబిషన్ లా కాకుండా, ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే విధంగా తీర్చిదిద్దాలని కేబినెట్ సబ్ కమిటీ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల బలోపేతానికి, ఉన్నత విద్యా రంగంలో సమూల మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్ననేపథ్యంలో హుర్ముజ్ ప్రావిన్స్‌ సమీపంలోని సరిహద్దుల వద్ద ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు తమ దేశ గగనతలంలోకి అక్రమంగా ప్రవేశించిన అమెరికాకు చెందిన మానవరహిత నిఘా విమానాన్ని ( గుర్తించి, తక్షణమే కూల్చివేసాయి. అందుకు సంబంధించి ఆ విమాన శిధిలాల ఫుటేజీని ఇరాన్ అధికారికంగా విడుదల చేయడంతో ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా దావానలంలా వ్యాపించింది. గత కొంతకాలంగా అమెరికా ఇరాన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతున్న సంగతి తెలిసిందే.
మద్యం కుంభకోణం కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డికి ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.