వరంగల్ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు.. భారీగా బయటపడిన అవకతవకలు

Publish Date:Apr 3, 2026

Advertisement

హనుమకొండ జిల్లా వరంగల్  సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయం లో ఏసీబీ  నిర్వహించిన ఆకస్మిక తనిఖీలhay భారీ అవకతవకలు బయటపడ్డాయి.  గురువారం (ఏప్రిల్ 2) నిర్వహించిన ఈ దాడుల్లో కార్యాలయంలో అనధికార డాక్యుమెంట్ రైటర్ల వ్యవస్థ పటిష్టంగా నడుస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

తనిఖీల సమయంలో కార్యాలయంలో 20 మంది అనధికారిక ఏజెంట్లు, డాక్యుమెంట్ రైటర్లు పనిచేస్తున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అధికారిక లెక్కల్లో చూపని రూ.47,450లు నగదుతో పాటు రిజిస్ట్రేషన్ చేయని 70 పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా సబ్‌ రిజిస్ట్రార్‌ల ఆధీనంలో 204 అందజేయని రిజిస్టర్డ్ పత్రాలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

డాక్యుమెంట్ రైటర్ల మొబైల్ ఫోన్లను పరిశీలించగా గత ఏడాది కాలంలో డాక్యుమెంట్ రైటర్ల నుంచి సుమారు రూ.42.03 లక్షల రూపాయలను ఫోన్‌పే ద్వారా లావా దేవీలు జరిగినట్లు బయటపడింది. ఈ వ్యవహారంలో ఎస్‌ఆర్‌ఓ-1 జమాలపురం రామనరసింహారావు, ఎస్‌ఆర్‌ఓ-2 దావులూరి ఆనంద్ మధ్య జరిగిన వాట్సాప్ చాట్‌ల ద్వారా  కీలక ఆధారాలు బయటపడ్డాయి. అనధికారిక డాక్యుమెంట్ రైటర్లు ఇచ్చిన పత్రాలకే ప్రాధాన్యత ఇస్తూ రిజిస్ట్రే షన్ ప్రక్రియ నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు.

కార్యాలయ తనిఖీలతో పాటు ఇద్దరు సబ్‌ రిజిస్ట్రార్‌ల నివాసాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఎస్‌ఆర్‌ఓ-2 దావులూరి ఆనంద్ నివాసంలో రూ.24.61 లక్షల నగదు, 819.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 2.6 కిలోల వెండి ఆభరణాలు, కపిల్ చిట్స్‌లో రూ.30.10 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లు స్వాధీనం చేసుకున్నారు. అదనంగా పలు ఆస్తి పత్రాలు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు పూర్తి వివరాలతో ప్రభుత్వం‌కు నివేదిక సమర్పించి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. 

By
en-us Political News

  
పంజాగుట్ట నుంచి జూబ్లీ హిల్స్ చెక్‌పోస్ట్ వైపు వెళ్లే వాహనాలను వన్‌వే మార్గంలో మాత్రమే అనుమతించనున్నారు. ఈ మార్గంలో ప్రయాణించే వాహనాలు కేబీఆర్ పార్క్, ఎన్‌టీఆర్ ట్రస్ట్ క్యాన్సర్ ఆస్పత్రి, టీఆర్ఎస్ భవన్, రోడ్ నెంబర్ 12, 45, 36 మార్గాల ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. ఫిలింనగర్, రోడ్ నెంబర్ 45 ప్రాంతాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న కొన్ని ట్రాఫిక్ ఆంక్షలను సడలించే అవకాశముంది.
పార్టీలో పాల్గొన్న వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళాఐఏఎస్ అధికారి కుమారుడికి డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయం బయటపడటంతో కేసు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
మచిలీపట్నం, విజయవాడ్, గుంటూరు కలిసేలా రాజధాని ఏర్పాటు చేసి మావిగన్ అని పేరు పెట్టాలన్న వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రతిపాదనపై .. ఎంత సేపూ గన్‌లు, గొడ్డళ్లేనా?.. అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆ క్రమంలో రకరకాల ఈక్వేషన్లతో మావిగన్ కు కౌంటర్‌గా విచిత్రమైన పేర్లు ఫోకస్ చేస్తూ, జగన్‌ని ఒక రేంజ్‌లో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
తాజాగా మరో వ్యక్తి ఐటీ అధికారుల వలలో చిక్కాడు. నగరానికి చెందిన యాదగిరి చిన్నగౌడ్ అలియాస్ దర్గా చిన్న పహిల్వాన్ వద్ద నుంచి సుమారు రూ.1 కోటి విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.భారీగా బంగారు ఆభరణాలు ధరించి సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తూ ఉండటంతో చిన్న పహిల్వాన్‌పై ఐటీ శాఖ దృష్టి పెట్టింది.
కువైట్‌లోని అత్యంత కీలకమైన మీనా అల్-అహ్మది చమురు శుద్ధి కర్మాగారంపై ఇరాన్ డ్రోన్ దాడులకు తెగబడింది. శుక్రవారం జరిగిన ఈ అనూహ్య దాడితో ఒక్కసారిగా గల్ఫ్ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.
ఇప్పటికే వేల సంఖ్యలో బలగాలను ఆ ప్రాంతానికి తరలించిన పెంటాగన్, సైనికులలో మానసిక ఒత్తిడిని ఇసుమంతైనా పట్టించుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వీడియో తరువాత అగ్రరాజ్యంతో ట్రంప్ తీరుపట్ల ఆగ్రహం మరింత ఎక్కువ అవుతోంది.
పబ్‌లో డీజే బ్లాక్ కాఫీ పేరుతో ప్రత్యేక సంగీత కార్యక్రమం నిర్వహించగా, నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో యువత హాజరైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ సమాచారంతో ఈగల్ టీమ్ గురువారం రాత్రి అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టింది.పబ్‌లో ఉన్నవారి కి అక్కడికక్కడే డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. పలువురి నుంచి యూరిన్ నమూనాలు సేకరించి ప్రాథమిక పరీక్షలు నిర్వ హించారు.
హెర్మూజ్ పై జరిగే ఈ సమావేశానికి హాజరు కావాలంటూ యూకే నుంచి భారత్ కు ఆహ్వానం అందిందని భారత విదేశాంగ శాఖ ధృవీకరించింది. భారత్ తరపున విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఈ సమావేశంలో పాల్గొంటారని ఆ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.
సోషల్ మీడియా ద్వారా బీహార్‌కు చెందిన ఇషికా యాదవ్, మధ్యప్ర దేశ్‌కు చెందిన నీరజ్ బన్సల్ లకు పరిచయం అయ్యింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. కుటుంబ సభ్యులను ఒప్పించి ఈ ఏడాది ఫిబ్రవరి 20న పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు.
మూసి నది ప్రక్షాళన లో ప్రభుత్వం పర్యావరణ నిబంధనలు పాటించలేదంటూ కార్తీక్ రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ముఖ్యంగా గాంధీ సరోవర్ పరిసరాల్లో ముందస్తు అనుమతులు లేకుండానే పనులు ప్రారంభించారని ఆయన ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్ బొగ్గు స్మగ్లింగ్ కేసుకు సంబంధించి ఈడీ రాజకీయ సలహా సంస్థ ఐప్యాక్ కార్యాలయాలపై దాడులు నిర్వహించిందని విశ్వసనీయంగా తెలుస్తోంది. బెంగళూరులో కంపెనీ సహ వ్యవస్థాపకుడైన రిషిరాజ్ సింగ్ కార్యాలయంలో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
మరావతికి శంకుస్థాపన జరిగిన పవిత్ర స్థలం అయిన ఉద్దండరాయుని పాలెంలో జరిగిన సంబరాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా ఉద్దండరాయుని పాలెం చేరుకున్న చంద్రబాబు అక్కడ రాజథానికి శంకుస్థాపన జరిగిన పవిత్ర స్థలాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు.
రైల్వేకోడూరు టోల్ గేట్ వద్ద పూలు కొనేందుకు వెళ్లిన హర్షవీణపై జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర నాయకత్వంలో కొందరు దాడికి పాల్పడ్డారు. తొలుత హర్షవీణ వెంట ఉండే గోపి అనే వ్యక్తిని చితకబాదారు. ఎందుకు కొడుతున్నారు అని ప్రశ్నించినందుకు హర్షవీణపై కూడా దాడి చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.