నామకరణాల మాయ్య.. నెట్టింట మావిగన్ ట్రోల్స్

Publish Date:Apr 3, 2026

Advertisement

వైసీపీ శ్రేణుల ఆరాధ్యుడు జగనన్న ఇప్పుడు జగన్ మావయ్యా అయ్యారు. ‘ఏప్రిల్ ఫూల్స్’ రోజున  మావిగన్  అని కొత్త క్యాపిటెల్ ప్రపోజ్ చేసిన మాజీ సీఎం నెటిజన్లకు అడ్డంగా బుక్ అయ్యారు. ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టా, యూట్యూబ్ ఒకటేంటి .. మొత్తం సోషల్ మీడియా వేదికల్లో జగన్ ట్రోలింగ్ పీస్ అయిపోయారు. మచిలీపట్నం, విజయవాడ్, గుంటూరు కలిసేలా రాజధాని ఏర్పాటు చేసి మావిగన్ అని పేరు పెట్టాలన్న వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రతిపాదనపై .. ఎంత సేపూ గన్‌లు, గొడ్డళ్లేనా?.. అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆ క్రమంలో రకరకాల ఈక్వేషన్లతో  మావిగన్ కు కౌంటర్‌గా విచిత్రమైన పేర్లు ఫోకస్ చేస్తూ, జగన్‌ని ఒక రేంజ్‌లో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

‘ఇంకా నయం.. జమ్మలమడుగులో జ, గుంటూరులో  గన్ కలిపి గుంటూరు కేంద్రంగా జగన్ పేరుతో రాజధాని పెట్టమన్లేదు ఒకరు సెటైర్ వేశారు. జగయ్యపేట నుంచి గుంటూరు వరకు హైవే ఉందిగా, ఆ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించి జగన్ అని పేరు పెట్టాలని మరొకరు సూచించారు. ఇకపై మా మచిలీపట్నం,విజయవాడ, గుంటూరు ఫ్రెండ్స్‌ను  మావిగన్స్  అని పిలవొచ్చా?  అని జగన్‌ పర్మిషన్ అడిగేస్తున్నారు. జెన్-జీ బ్యాచ్ పిల్లలకు పేర్లు పెట్టేందుకు తల్లిదండ్రులు గూగుల్‌‌లో వెతుకుతున్నారు. వారు జగన్‌ను సంప్రదిస్తే చాలన్న సలహాలు కూడా వినిపిస్తున్నారు.

ఆ క్రమంలో  మావయ్యా ఎలా వస్తాయ్ మీకే ఇలాంటి ఐడియాలు.. మరి మన మూడు రాజధానుల సంగతేం చేద్దాం అని ప్రశ్నలు సంధిస్తున్నారు.  ఎవరో రాసిచ్చారు సరే, చదివే ముందైనా స్క్రిప్ట్ చూసుకోవాలని కదా?..   ఈ వారం వచ్చిన కొత్త ఐడియా ఇదా? దీని కోసం బెంగళూరు నుంచి రావాలా? .. మరిన్ని ప్రెస్‌మీట్లు పెట్టి ప్లాన్ -సి టూ ప్లాన్-జడ్ వరకు చెప్పండంటూ చరుకలు అంటిస్తున్నారు. ‘మేమేం పాపం చేశాం? మా జిల్లా,  మా ఊరి పేరు కూడా కలిసేలా రాజధాని నామకరణం చేయండి  అని పంచ్‌లు విసురుతున్నారు.  రాష్ట్రానికి రాజధాని అనే పదం రాజ్యాంగలో లేదన్నప్పుడు  మావిగన్ ఎక్కడ పెట్టుకోవాలి మాయ్యా అని తెగ్ ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి నెట్టింట నామకరణాల మావయ్య అలా బుక్ అయ్యారిప్పుడు.

By
en-us Political News

  
నాసిక్ ఐటీ కంపెనీలో లైంగిక వేధింపుల ఉదంతం దేశవ్యాప్తంగా ఐటీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
భారతీయ సినీ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రముఖ నేపథ్య గాయని ఆశా భోస్లే
పెళ్లి పీటలపై కట్నం డబ్బుల కోసం డిమాండ్ చేయడం గానీ, ఇతర వివాదాస్పద కోర్కెలతో పెళ్లి ఆగిపోవడం గానీ మనం విన్న విషయాలే.
భారతీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో కీలక అడుగు వేసింది.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి ఓ వాహనదారుడు వేసిన కొత్త ఎత్తు చివరకు పోలీసులకే షాక్ ఇచ్చింది.
అమెరికాలో నివసిస్తున్న విదేశీయులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరోసారి తన కఠిన వైఖరిని రుచిచూపించింది.
వయసు పైబడితే చాలు విశ్రాంతి కోరుకుంటారు ఎవరైనా. 60 ఏళ్లు దాటాయంటే మోకాళ్ల నొప్పులని, ఓపిక లేదని ఇంటికే పరిమితమవుతారు.
దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణం శనివారం ఒక అరుదైన మరియు ఆత్మీయ దృశ్యానికి వేదికైంది.
డిజిటల్ చెల్లింపులు వేగంగా విస్తరిస్తున్న ఈ రోజుల్లో, టెక్నాలజీ ప్రభావం సమాజంలోని ప్రతి వర్గానికీ ఎలా చేరుతోందో చూపించే ఆసక్తికర ఉదాహరణ ఇది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫలితాలను విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది.
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని గిర్నిబావి గ్రామంలో ఓ రైతు పొలం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
సాధారణంగా బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ కార్లు కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం—ప్రాణ భద్రత.
77 ఏళ్ల గణపతి ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్య సమస్యలతో అంటే డయాబెటిస్, కీళ్లనొప్పులు, ఇతర వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఆయనకు మెరుగైన వైద్యం అందించేందుకు పార్టీ ఆయనను అడవుల నుంచి బయటకు పంపిందని సమాచారం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.