పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం అగ్రరాజ్యం అమెరికా సైనికుల్లో ఆందోళన నింపుతోంది. ఇరాన్‌తో ముంచుకొస్తున్న పోరు నేపథ్యంలో అక్కడ మోహరించిన అమెరికా బలగాలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురౌతున్నాయి. క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులపై తాజాగా ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ విడుదల చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నది.
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, అమెరికా సైనికులు తమ భయాలను అధిగమించేందుకు క్లబ్బులను ఆశ్రయిస్తున్నట్లు సదరు ఇన్‌ఫ్లుయెన్సర్ వెల్లడించారు. సైనిక స్థావరాలకు సమీపంలో ఉన్న వినోద కేంద్రాలకు సైనికులు పోటెత్తుతున్నారని, అక్కడ వారు భారీగా డబ్బు ఖర్చు చేస్తూ సేదతీరుతున్నారని ఆ వీడియోలో పేర్కొన్నారు. ముఖ్యంగా తక్కువ వయసున్న సైనికులు కూడా ఈ యుద్ధ భయంతో కలత చెందుతున్నారనీ, మేము యుద్ధానికి వెళ్తున్నాం" అంటూ వారు తనతో పంచుకున్న మాటలను ఇన్‌ఫ్లుయెన్సర్ వివరించారు. వారి ముఖాల్లో కనిపిస్తున్న ఒత్తిడిని చూస్తుంటే బాధగా అనిపించింద వ్యాఖ్యానించాడు.
పశ్చిమాసియాలో రక్షణ ఏర్పాట్లను అమెరికా పెంచుతున్న తరుణంలో ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. ఇప్పటికే వేల సంఖ్యలో బలగాలను ఆ ప్రాంతానికి తరలించిన పెంటాగన్, సైనికులలో మానసిక ఒత్తిడిని ఇసుమంతైనా పట్టించుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వీడియో తరువాత అగ్రరాజ్యంతో ట్రంప్ తీరుపట్ల ఆగ్రహం మరింత ఎక్కువ వ్యక్తం అవుతోంది.
యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో సైనికుల కదలికలు, వారి మానసిక స్థితిపై ఇలా బహిరంగంగా వీడియోలు రావడం పట్ల అమెరికా మాజీ సైనికాధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. క్లబ్బులు, పబ్‌ల వంటి బహిరంగ ప్రదేశాల్లో సైనికులు చేసే సాధారణ సంభాషణలు శత్రువులకు కీలక సమాచారాన్ని అందించే ప్రమాదం ఉందన్న ఆందోళన వారిలో వ్యక్తం అవుతున్నది. సైనిక గోప్యత దెబ్బతినడం పెను ముప్పుకు దారితీసు ప్రమాదం ఉందని అమెరికా రక్షణ అధికారులు సైతం అంటున్నారు.
ఈ తరుణంలో సైనికుల మానసిక ఆరోగ్యం మరియు భద్రతపై అగ్రరాజ్యం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతున్నది. కాగా ఆ ఇన్ ఫ్లుయెన్సర్ వీడియో ద్వారా ట్రంప్ ప్రపంచంపైనే కాదు, అమెరికాపైనా, అమెరికా సైన్యంపైనా కూడా యుద్ధాన్ని బలవంతంగా రుద్దుతున్నారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/war-fear-in-america-soldiers-36-216619.html
పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రశాంత్ బోస్, మావోయిస్టు ఉద్యమంలో అత్యంత ప్రభావమంతమైన నాయకులలో ఒకరు. కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరోలో కీలక సభ్యుడిగా ఉండటంతో పాటు, ఆ సంస్థ యొక్క తూర్పు ప్రాంతీయ బ్యూరో కార్యదర్శిగా కూడా పనిచేశారు.ప్రశాంత్ కిషోర్ కిషన్ దాదా, మనీష్, బుద్ధ పేర్లతో కూడా గుర్తింపు పొందారు.
గృహ వినియోగానికి సంబంధించిన మొత్తం 3,699 ఎల్పీజీ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా వాణిజ్య వినియోగానికి సంబంధించి 70 చిన్న ఎల్పీజీ సిలిండర్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్నసిలెండర్ల విలువ 1.10 కోట్లు రూపాయలుగా అధికారులు అంచనా వేశారు.
పంజాగుట్ట నుంచి జూబ్లీ హిల్స్ చెక్‌పోస్ట్ వైపు వెళ్లే వాహనాలను వన్‌వే మార్గంలో మాత్రమే అనుమతించనున్నారు. ఈ మార్గంలో ప్రయాణించే వాహనాలు కేబీఆర్ పార్క్, ఎన్‌టీఆర్ ట్రస్ట్ క్యాన్సర్ ఆస్పత్రి, టీఆర్ఎస్ భవన్, రోడ్ నెంబర్ 12, 45, 36 మార్గాల ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. ఫిలింనగర్, రోడ్ నెంబర్ 45 ప్రాంతాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న కొన్ని ట్రాఫిక్ ఆంక్షలను సడలించే అవకాశముంది.
పార్టీలో పాల్గొన్న వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళాఐఏఎస్ అధికారి కుమారుడికి డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయం బయటపడటంతో కేసు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
మచిలీపట్నం, విజయవాడ్, గుంటూరు కలిసేలా రాజధాని ఏర్పాటు చేసి మావిగన్ అని పేరు పెట్టాలన్న వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రతిపాదనపై .. ఎంత సేపూ గన్‌లు, గొడ్డళ్లేనా?.. అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆ క్రమంలో రకరకాల ఈక్వేషన్లతో మావిగన్ కు కౌంటర్‌గా విచిత్రమైన పేర్లు ఫోకస్ చేస్తూ, జగన్‌ని ఒక రేంజ్‌లో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
తాజాగా మరో వ్యక్తి ఐటీ అధికారుల వలలో చిక్కాడు. నగరానికి చెందిన యాదగిరి చిన్నగౌడ్ అలియాస్ దర్గా చిన్న పహిల్వాన్ వద్ద నుంచి సుమారు రూ.1 కోటి విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.భారీగా బంగారు ఆభరణాలు ధరించి సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తూ ఉండటంతో చిన్న పహిల్వాన్‌పై ఐటీ శాఖ దృష్టి పెట్టింది.
కువైట్‌లోని అత్యంత కీలకమైన మీనా అల్-అహ్మది చమురు శుద్ధి కర్మాగారంపై ఇరాన్ డ్రోన్ దాడులకు తెగబడింది. శుక్రవారం జరిగిన ఈ అనూహ్య దాడితో ఒక్కసారిగా గల్ఫ్ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.
అధికారిక లెక్కల్లో చూపని రూ.47,450లు నగదుతో పాటు రిజిస్ట్రేషన్ చేయని 70 పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్‌ల ఆధీనంలో 204 అందజేయని రిజిస్టర్డ్ పత్రాలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
పబ్‌లో డీజే బ్లాక్ కాఫీ పేరుతో ప్రత్యేక సంగీత కార్యక్రమం నిర్వహించగా, నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో యువత హాజరైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ సమాచారంతో ఈగల్ టీమ్ గురువారం రాత్రి అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టింది.పబ్‌లో ఉన్నవారి కి అక్కడికక్కడే డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. పలువురి నుంచి యూరిన్ నమూనాలు సేకరించి ప్రాథమిక పరీక్షలు నిర్వ హించారు.
హెర్మూజ్ పై జరిగే ఈ సమావేశానికి హాజరు కావాలంటూ యూకే నుంచి భారత్ కు ఆహ్వానం అందిందని భారత విదేశాంగ శాఖ ధృవీకరించింది. భారత్ తరపున విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఈ సమావేశంలో పాల్గొంటారని ఆ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.
సోషల్ మీడియా ద్వారా బీహార్‌కు చెందిన ఇషికా యాదవ్, మధ్యప్ర దేశ్‌కు చెందిన నీరజ్ బన్సల్ లకు పరిచయం అయ్యింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. కుటుంబ సభ్యులను ఒప్పించి ఈ ఏడాది ఫిబ్రవరి 20న పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు.
మూసి నది ప్రక్షాళన లో ప్రభుత్వం పర్యావరణ నిబంధనలు పాటించలేదంటూ కార్తీక్ రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ముఖ్యంగా గాంధీ సరోవర్ పరిసరాల్లో ముందస్తు అనుమతులు లేకుండానే పనులు ప్రారంభించారని ఆయన ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్ బొగ్గు స్మగ్లింగ్ కేసుకు సంబంధించి ఈడీ రాజకీయ సలహా సంస్థ ఐప్యాక్ కార్యాలయాలపై దాడులు నిర్వహించిందని విశ్వసనీయంగా తెలుస్తోంది. బెంగళూరులో కంపెనీ సహ వ్యవస్థాపకుడైన రిషిరాజ్ సింగ్ కార్యాలయంలో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.