మియాపూర్‌లో నవవధువు ఆత్మహత్య

Publish Date:Apr 3, 2026

Advertisement

కాళ్ల పారాణి ఆరకముందే ఓ నవవధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరా బాద్‌లోని మియాపూర్ ప్రాంతంలో  జరిగింది.   ప్రేమించి పెళ్లి చేసుకుని కోటి ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టిన యువతి చివరకు నిరాశతో బలవన్మరణానికి పాల్పడింది. అత్తారింటికి వెళ్లిన కూతురు సంతోషంగా ఉందని ఆనందపడిన తల్లిదండ్రులను  ఆమె మరణ వార్త  సోక సంద్రంలో ముంచేసింది. 

 2020లో సోషల్ మీడియా ద్వారా బీహార్‌కు చెందిన ఇషికా యాదవ్, మధ్యప్ర దేశ్‌కు చెందిన నీరజ్ బన్సల్ లకు పరిచయం అయ్యింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది.   కుటుంబ సభ్యులను ఒప్పించి ఈ ఏడాది  ఫిబ్రవరి 20న పెద్దల సమక్షంలో   వివాహం చేసుకున్నారు.  వివాహం అనంతరం మక్త మహబూ బ్‌పేట్‌లోని అపార్ట్‌మెంట్‌లో కాపురం పెట్టారు. ఇద్దరూ కూడా  సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే ఇటీవల  అదనపు కట్నం కోసం భర్త వేధిపులు ప్రారంభమయ్యాయి. దీనిపై ఇరువురి మధ్యా   తరచూ గొడవలు జరుగుతుండేవి.

భర్త వేధింపులు తట్టుకోలేక ఇషికా యాదవ్ తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త ఇచ్చిన సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి కు తరలించారు.   మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

By
en-us Political News

  
పంజాగుట్ట నుంచి జూబ్లీ హిల్స్ చెక్‌పోస్ట్ వైపు వెళ్లే వాహనాలను వన్‌వే మార్గంలో మాత్రమే అనుమతించనున్నారు. ఈ మార్గంలో ప్రయాణించే వాహనాలు కేబీఆర్ పార్క్, ఎన్‌టీఆర్ ట్రస్ట్ క్యాన్సర్ ఆస్పత్రి, టీఆర్ఎస్ భవన్, రోడ్ నెంబర్ 12, 45, 36 మార్గాల ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. ఫిలింనగర్, రోడ్ నెంబర్ 45 ప్రాంతాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న కొన్ని ట్రాఫిక్ ఆంక్షలను సడలించే అవకాశముంది.
పార్టీలో పాల్గొన్న వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళాఐఏఎస్ అధికారి కుమారుడికి డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయం బయటపడటంతో కేసు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
మచిలీపట్నం, విజయవాడ్, గుంటూరు కలిసేలా రాజధాని ఏర్పాటు చేసి మావిగన్ అని పేరు పెట్టాలన్న వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రతిపాదనపై .. ఎంత సేపూ గన్‌లు, గొడ్డళ్లేనా?.. అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆ క్రమంలో రకరకాల ఈక్వేషన్లతో మావిగన్ కు కౌంటర్‌గా విచిత్రమైన పేర్లు ఫోకస్ చేస్తూ, జగన్‌ని ఒక రేంజ్‌లో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
తాజాగా మరో వ్యక్తి ఐటీ అధికారుల వలలో చిక్కాడు. నగరానికి చెందిన యాదగిరి చిన్నగౌడ్ అలియాస్ దర్గా చిన్న పహిల్వాన్ వద్ద నుంచి సుమారు రూ.1 కోటి విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.భారీగా బంగారు ఆభరణాలు ధరించి సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తూ ఉండటంతో చిన్న పహిల్వాన్‌పై ఐటీ శాఖ దృష్టి పెట్టింది.
కువైట్‌లోని అత్యంత కీలకమైన మీనా అల్-అహ్మది చమురు శుద్ధి కర్మాగారంపై ఇరాన్ డ్రోన్ దాడులకు తెగబడింది. శుక్రవారం జరిగిన ఈ అనూహ్య దాడితో ఒక్కసారిగా గల్ఫ్ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.
ఇప్పటికే వేల సంఖ్యలో బలగాలను ఆ ప్రాంతానికి తరలించిన పెంటాగన్, సైనికులలో మానసిక ఒత్తిడిని ఇసుమంతైనా పట్టించుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వీడియో తరువాత అగ్రరాజ్యంతో ట్రంప్ తీరుపట్ల ఆగ్రహం మరింత ఎక్కువ అవుతోంది.
అధికారిక లెక్కల్లో చూపని రూ.47,450లు నగదుతో పాటు రిజిస్ట్రేషన్ చేయని 70 పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా సబ్‌ రిజిస్ట్రార్‌ల ఆధీనంలో 204 అందజేయని రిజిస్టర్డ్ పత్రాలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
పబ్‌లో డీజే బ్లాక్ కాఫీ పేరుతో ప్రత్యేక సంగీత కార్యక్రమం నిర్వహించగా, నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో యువత హాజరైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ సమాచారంతో ఈగల్ టీమ్ గురువారం రాత్రి అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టింది.పబ్‌లో ఉన్నవారి కి అక్కడికక్కడే డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. పలువురి నుంచి యూరిన్ నమూనాలు సేకరించి ప్రాథమిక పరీక్షలు నిర్వ హించారు.
హెర్మూజ్ పై జరిగే ఈ సమావేశానికి హాజరు కావాలంటూ యూకే నుంచి భారత్ కు ఆహ్వానం అందిందని భారత విదేశాంగ శాఖ ధృవీకరించింది. భారత్ తరపున విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఈ సమావేశంలో పాల్గొంటారని ఆ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.
మూసి నది ప్రక్షాళన లో ప్రభుత్వం పర్యావరణ నిబంధనలు పాటించలేదంటూ కార్తీక్ రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ముఖ్యంగా గాంధీ సరోవర్ పరిసరాల్లో ముందస్తు అనుమతులు లేకుండానే పనులు ప్రారంభించారని ఆయన ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్ బొగ్గు స్మగ్లింగ్ కేసుకు సంబంధించి ఈడీ రాజకీయ సలహా సంస్థ ఐప్యాక్ కార్యాలయాలపై దాడులు నిర్వహించిందని విశ్వసనీయంగా తెలుస్తోంది. బెంగళూరులో కంపెనీ సహ వ్యవస్థాపకుడైన రిషిరాజ్ సింగ్ కార్యాలయంలో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
మరావతికి శంకుస్థాపన జరిగిన పవిత్ర స్థలం అయిన ఉద్దండరాయుని పాలెంలో జరిగిన సంబరాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా ఉద్దండరాయుని పాలెం చేరుకున్న చంద్రబాబు అక్కడ రాజథానికి శంకుస్థాపన జరిగిన పవిత్ర స్థలాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు.
రైల్వేకోడూరు టోల్ గేట్ వద్ద పూలు కొనేందుకు వెళ్లిన హర్షవీణపై జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర నాయకత్వంలో కొందరు దాడికి పాల్పడ్డారు. తొలుత హర్షవీణ వెంట ఉండే గోపి అనే వ్యక్తిని చితకబాదారు. ఎందుకు కొడుతున్నారు అని ప్రశ్నించినందుకు హర్షవీణపై కూడా దాడి చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.