ఆమె కనే కలలకి రెక్కలనివ్వు.. అంతరిక్షపు అంచులని కూడా  తాకగలదు.. 

Publish Date:Jan 24, 2025

Advertisement

 

భారతీయ సమాజంలో ఇప్పటికీ ఒక మచ్చలా ఉండిపోయిన అంశం.. ఆడపిల్లని ఒక పెద్ద భారంగా చూడటం లేదా అప్రయోజకురాలని ముందే నిర్ణయించేయటం. కాలం ఎంతలా మారినా ఇప్పటికీ ఎక్కడో ఒకచోట  తల్లిదండ్రుల నోటి నుంచో, ఏ బంధువుల నోటి నుంచో ‘ఆ...డపిల్ల పుట్టిందా..!’ అన్న పెదవి విరుపు మాట వినాల్సి వస్తుంది.  ఇన్నేళ్ల తర్వాత కూడా ఇది జరుగుతోందంటే అది నిజంగా మన సమాజపు దౌర్భాగ్యమనే చెప్పాలి. ఊరికో అమ్మవారిని కొలిచే సాంప్రదాయం ఉన్న భారతీయులు తమ ఇంట్లో ఆడపిల్ల పుడితే అపురూపంగా చూడలేకపోతున్నారు. వీర వనితల గురించి, సమాజం మీద వారు చూపించిన ప్రభావం గురించి పురాణాలు, గత చరిత్రలు సాక్ష్యాలుగా నిలుస్తున్నా కూడా ఆడపిల్ల జీవితం అమ్మ కడుపులోనో, రోడ్డు పక్కన చెత్తబుట్టలోనో అంతమవుతూనే ఉంది. ఇప్పుడిప్పుడు కొంత మార్పు మొదలైనా కూడా అదంతా పైపై మెరుగులా స్త్రీ జాతికి ఏదో మేలు జరిగిపోతోందనే మాటలు మాత్రం ఎక్కువ ఉంటాయి. సమాజంలో మహిళల ప్రాధాన్యతపై అవగాహన పెంచడానికి,  భారత యువ జనాభాలో కీలక భాగమైన బాలికల ప్రాముఖ్యతను ప్రజలకు చాటి చెప్పడానికి, వారి విద్య గురించి అవగాహన కల్పించడానికి 2008 నుంచి  ప్రతీ సంవత్సరం జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

బాలికలకూ బంగారు జీవితం..

ఆపిడ్డలలు  తమ కుటుంబంలోనూ, సమాజంలోనూ చాలా వివక్షను ఎదుర్కొంటున్నారు. అందుకే ఈ వివక్షని నిర్మూలించటానికి, సమాజంలో ఆడపిల్లల  పట్ల ఉన్న అభిప్రాయాన్ని మార్చటానికి, మన నాగరికత మనుగడకి బాలికలు కూడా ముఖ్యమేనన్న  విషయం అర్ధమయ్యేలా వివరించటానికి జాతీయ బాలికా దినోత్సవం మంచి వేదిక అవుతుంది. ఆడపిల్లలు ఎంతో వివక్ష ఎదుర్కొంటున్న రోజుల్లోనే వారి  విద్య కోసం ఎన్నో కష్టాలని, అవమానాలని ఎదుర్కొని మరీ తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా మారిన  సావిత్రిబాయి ఫూలే, తొలి మహిళా వైద్యురాలిగా మారిన చంద్రపభా సైకియాని,  ఫాతిమా షేక్ లాంటి పలువురు సంఘ సంస్కర్తల   త్యాగాలను, పోరాటాన్ని ఈ రోజు మనకి  గుర్తు చేస్తుంది. ఆడపిల్లల భ్రూణ హత్యలని నిరోధించటం, బాలికల విద్యను ప్రోత్సహించడం వంటి లక్ష్యాలను గుర్తుచేస్తుంది. బాలికల హక్కులు, సమాజంలో వారి పాత్రపై అవగాహన పెంచడమే దీని ప్రధాన లక్ష్యం. భారతదేశ భవిష్యత్తుకు బాలికలు కూడా కీలకమైన భాగమనీ, వారిని రక్షించడం, విద్యను అందించడం, సమాన అవకాశాలు కల్పించడం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తుంది.

2025 థీమ్.....

భారత ప్రభుత్వం జాతీయ బాలిక దినోత్సవం 2025కి గానూ, “ఉజ్వల భవిష్యత్తు కోసం బాలికలకి సాధికారత కల్పించటం” అనే అంశాన్ని ఎంచుకుంది.  ఈ థీమ్ మన దేశ భవిష్యత్తు బాగుండాలంటే దాని నిర్మాణంలో బాలికలకి కూడా సమ ప్రాధాన్యమిచ్చి, సాధికారత కల్పించాలన్న విషయాన్ని తెలియజేస్తుంది. సమాజ అభివృద్ధిలో  వారి పాత్రను హైలైట్ చేస్తుంది.

సాధించాల్సిన లక్ష్యాలు....

బాలికల హక్కుల గురించి ప్రజలకు అవగాహన కల్పించి,  సమాజంలో మగవారితోపాటూ సమానావకాశం ఇవ్వాలి.  వారికి  నాణ్యమైన విద్యావకాశాలు కల్పించి, వారి కలలను సాధించడంలో సహాయం చేయాలి.  బాలికలు ఆత్మవిశ్వాసంతో ఉండేందుకు, స్వయం సమర్థతను పొందేందుకు,  స్వంతంగా చురుకైన  నిర్ణయాలు తీసుకోగలిగేలా  ప్రోత్సహించాలి.  భారతదేశంలో బాలికల అభ్యున్నతికి, సంక్షేమానికి  మద్దతు ఇచ్చేలా చర్యలు తీసుకోవటం,  విధానాలను రూపొందించటం చేయాలి. బాలికల పట్ల అడుగడుగునా జరిగే అత్యాచారాలు, దౌర్జన్యాలని అరికట్టి సురక్షితమైన వాతావరణాన్ని అందించడానికి సమాజాన్ని  ప్రోత్సహింఛాలి.  
 
బాలికల అభివృద్ధితోనే  మన దేశ అభివృద్ధి.....

ప్రతీ బాలికకు తగిన గౌరవం, అవకాశాలు లభించేవరకు ఈ దినోత్సవ లక్ష్యం నెరవేరనట్టే అర్ధం. ప్రతి ఒక్కరూ బాలికలను రక్షించి,  వారికి భవిష్యత్తు అందించడానికి కృషి చేయాలి.  బాలికలను శక్తివంతం చేసి, సమాజపు మూస ధోరణిలను పగలగొట్టాలి.  ప్రతీ  బాలికలోనూ  అపారమైన సామర్థ్యం ఉందని గుర్తుచేస్తూ, వారి ప్రతిభను గుర్తించి, ప్రశంసించడం  ద్వారా మనం మరింత గొప్ప సమాజాన్ని నిర్మించగలుగుతాం. లింగ సమానత్వం ఒక కల కాదు నిజమేనని నిరూపించేలా అడుగులు వేస్తూ,  అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని అందరూ అర్ధం చేసుకోవాలి. వారు అనుకుంటే అంతరిక్షం కూడా చేరుకోగలరన్న నమ్మకాన్ని మన ఇంటి ఆడపిల్లకి ఇచ్చిననాడు, భారతదేశంలోని ఆడబిడ్డలంతా వారి శక్తి సామర్ధ్యాలతో సమాజపు రూపురేఖలనే మార్చగలుగుతారు. ఆడపిల్లే కదా అని అలుసుగా చూడకు... ఆమె లేకపోతే సమాజం ఒంటెద్దు బండిలా కుంటుతూ నడుస్తుందన్న నిజాన్ని గ్రహించు.

                                              *రూపశ్రీ.

By
en-us Political News

  
ఫిబ్రవరి, మార్చి నెలలు వచ్చాయంటే చాలు.. విద్యార్థుల్లో ఒక రకమైన తెలియని ఆందోళన మొదలవుతుంది. ఇంటర్, టెన్త్ క్లాస్ పరీక్షలు దగ్గర పడుతుంటే, ఎంత చదివినా ఏదో వెలితి, చదివింది మర్చిపోతున్నామనే భయం చాలా మందిని వెంటాడుతుంటుంది. కేవలం విద్యార్థులే కాదు, వారి తల్లిదండ్రులు కూడా తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంటారు...
నేటి సమాజంలో పెళ్లి అనేది కేవలం రెండు కుటుంబాల కలయిక మాత్రమే కాదు, అది ఇద్దరు వ్యక్తుల జీవితకాల ప్రయాణం. అయితే, మారుతున్న కాలంతో పాటు యువత ఆలోచనలు, వారి భయాలు కూడా మారుతున్నాయి...
ఎలాంటి సంబంధం అయినా సరే.. ప్రతి సంబంధంలో ఏదో ఒక రకమైన గొడవ, సంఘర్షణ ఉంటుంది. ఇది ముఖ్యంగా ప్రేమ సంబంధాలలో చాలా సాధారణం. మరీ ముఖ్యంగా భార్యాభర్తల బంధంలో గొడవలు కూడా చాలా ఉంటాయి...
ప్రతి తల్లిదండ్రులకి తమ పిల్లల పెళ్లిని కళ్లారా చూడాలని, ఆ వేడుకలో భాగం కావాలని ఒక పెద్ద కల ఉంటుంది. కానీ, ఒక రోజు మీ పిల్లలు "నాకు ఇప్పుడే పెళ్లి వద్దు" లేదా "నేను పెళ్లికి రెడీగా లేను" అని చెబితే, ఆ మాట వినగానే మనసు ముక్కలవుతుంది. కోపం, బాధ, ఆందోళన కలగడం సహజం...
ఆదివారం అనే మాట వినగానే మన ముఖాల్లో సంతోషకరమైన చిరునవ్వు వస్తుంది. ఇది కుటుంబంతో సమయం గడపడానికి,  పని నుండి విరామం తీసుకోవడానికి కేటాయించబడిన రోజుగా పరిగణిస్తారు...
వేగంగా మారుతున్న  జీవనశైలి,  డిజిటల్ యుగంలో పేరెంటింగ్ పద్ధతులు కూడా మారుతున్నాయి. అలాంటి ఒక కొత్త ట్రెండ్ ఇప్పుడు చాలా చర్చించబడుతోంది...
పెళ్లి అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఒప్పందం కాదు; అది రెండు కుటుంబాల కలయిక, రెండు జీవితాల మేళవింపు. కానీ నేటి కాలంలో సంబంధం చూసేటప్పుడు మనం కేవలం ఆస్తులు, అంతస్తులు లేదా...
ఏ బంధం అయినా నిలబడటానికి పరస్పర అవగాహన చాలా ముఖ్యం. అందులో భార్యాభర్తల బంధం మరీ సున్నితమైనది. కానీ ఆ బంధాన్ని ఎంత దృఢంగా మార్చుకుంటారు అనేదే ఇక్కడ ముఖ్యం.  భార్యాభర్తల బంధం బలంగా మారడానికి పరస్పర అవగాహన చాలా ముఖ్యం...
నేటి కాలంలో ప్రజల ఉద్దేశాలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. బయటకు ఒకటి చెబుతారు, కానీ తరువాత వారు చేసేది మరొకటి ఉంటుంది. దీని వలన ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవడం కష్టమవుతుంది...
కొత్త వస్తువులు కొంటేనే చాలామంది చాలా సంతోషంగా ఉంటారు.  ఇక మహిళలు అయితే వంటింటి వస్తువుల నుండి వారు కొనుగోలు చేసే వస్తువు పట్ల చాలా ఇష్టంతో ఉంటారు.  కానీ కొత్త వస్తువుల లుక్ పాడు చేసే వాటిలో వాటి మీద ఉండే స్టిక్కర్లు ప్రధానంగా ఉంటాయి...
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభానికి గుర్తుగా బుధవారం దేశంలో రంజాన్ చంద్రుడు కనిపించాడు. అంతకుముందు సౌదీ అరేబియాలో ఫిబ్రవరి 17న చంద్రుడు కనిపించాడు.  ఫిబ్రవరి 18న అక్కడ రంజాన్ ఉపవాసం ప్రారంభానికి గుర్తుగా చంద్రుడు కనిపించాడు...
ప్రతి వ్యక్తి జీవితం గురించి చాలా ఆలోచిస్తారు.  తమ జీవితం ఎలా ఉండాలో,  ఎలా ఉంటే బాగుంటుందో అని చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.  సరిగ్గా గమనిస్తే.. కొందరు నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది అని అంటూ ఉంటారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.