ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సారి పరామర్శ యాత్రలకు శ్రీకారం చుట్టనున్నారు. తాజాగా ఆయన రెండు రోజుల పాటు పరామర్శయాత్రకు రెడీ అయిపోయారు. ఔను ఆయన బుధ, శుక్రవారాలలో రాష్ట్రంలో పరామర్శ పర్యటన చేస్తారు. బుధవారం గుంటూరు, శుక్రవారం ఇబ్రహీం పట్నం లలో ఆయన పరామర్శ యాత్రలు ఉండనున్నాయి. ఈ యాత్రలలో భాగంగా ఆయన గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను, శుక్రవారం ఇబ్రహీంపట్నలో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఈ మేరకు పార్టీ వర్గాలు అధికారికంగా తెలిపాయి.
జగన్ అంబటి, జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి రెడీ అవ్వడంపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్స్ వస్తున్నాయి. అరెస్టైన నాయకుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులన పరామర్శించడం ఓకే.. అసెంబ్లీకి వచ్చి ఇదే అంశాలపై మాట్లాడడానికి జగన్ కు ధైర్యం ఉందా? అంటూ నెటిజనులు ప్రశ్నిస్తున్నారు. అంబటి, జోగి రమేష్ ల విషయాన్ని అసెంబ్లీలో జగన్ ప్రస్తావిస్తే అసలు బండారం బయటపడుతుందన్న భయం జగన్ ను వెంటాడుతోందంటున్నారు. అయినా జగన్ పరామర్శయాత్రలంటే జనం భయంతో వణికిపోతున్న పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని ఉదహరిస్తున్నారు. పరామర్శల పేరుతో జగన్ చేసే పర్యటనల అసలు లక్ష్యం శాంతి భద్రతల సమస్య సృష్టించడమేనని విమర్శిస్తున్నారు.
గతంలో గుంటూరు, అనంతపురం, సత్య సాయి జిల్లాలో ఆయన పర్యటన చేసినప్పుడు జరిగిన సంఘటనలను ఉదహరిస్తున్నారు. అసలే ఉద్రిక్తతలు నెలకొన్న గుంటూరు, ఇబ్రహీంపట్నంలో జగన్ పరామర్శ యాత్ర శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ పరామర్శల పేరుతో శాంతికి భంగం కలిగించే కంటే.. ఈ నెలలోనే జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరై తిరుమల ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి సహా అన్ని అంశాలపై చర్చిస్తే మేలన్న చర్చ రాజకీయవర్గాలలో జరుగుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-paramarsa-yatralu-again-25-213433.html
అయితే ఇప్పుడు ఆ బృందం అంత గట్టిగా ఆయన పక్కన లేదనీ విశ్లేషించారు. అందుకే జగన్ ఇప్పుడు తానే స్వయంగా బయటకు రాక తప్పని అనివార్య పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆ కారణంగానే వైసీపీ ఆవిర్భావం తరువాత ఇప్పటి వరకూ గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ నుంచి కార్యకర్తలకు ఫోన్లు చేసి మరీ సమావేశాలకు పిలుస్తున్నారని డోలేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.
కొంత కాలం గడిచిన తర్వాత తన బలం ఏంటో అందరికీ అర్థమవుతుందని కవిత వ్యాఖ్యానించారు. ప్రజలే తనను నాయకురాలిగా తీర్చిదిద్దాలని, వారి మద్దతే తనకు అసలైన బలమని పేర్కొన్నారు.
రెండు రోజుల కిందట అంటే బుధవారం ఆయన అంబటి రాంబాబు కుటుంబానికి పరామర్శ పేరుతో గుంటూరులో పర్యటించి పరామర్శ చేసిన సంరద్భంగా పలువురు వైసీపీ నేతలను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బహుశా జగన్ పోలీసు ఆంక్షలకు తలొగ్గి శుక్రవారం తన ఇబ్రహీంపట్నం పర్యటనలో ‘రూటు’ మార్చారు. అంటే ముందుగా ప్రకటించిన విధంగా కాకుండా పోలీసులు చెప్పినట్లుగా వారు సూచించిన దారిలో వెళ్లారు.
వైసీపీ అధికారంలో ఉండగా దాదాపు ఇలాంటి పనులే చేసి జోగి రమేష్ మంత్రిపదవి పొందారు. కొడాలినాని, అనిల్ కుమార్ యాదవ్ వంటి వారు జగన్ కు అత్యంత నమ్మకస్తులుగా మారారు. తెలుగుదేశం నుంచి వలస వచ్చిన వల్లభనేని వంశీ జగన్ కు అస్మదీయుడయ్యారు.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అంబటి రాంబాబు జట్టుకు రంగు వేయించుకోకపోవడానికి జగన్ కు నలుపు రంగు అంటే ఇష్టం లేకపోవడమే కారణమని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆయన ఇప్పుడు కూడా జుత్తుకు రంగు వేసుకోవడం లేదనుకోండి.. జగన్ కు అప్పుడు ఇష్టం లేని నల్ల రంగు ఇప్పుడు ఎందుకు ఇష్టం అవుతుందన్న అభిప్రాయం కావచ్చు.
తెలుగువన్ వాస్తవ వేదిక పదకొండవ సంచికలో ఘాటైన చర్చ జరిగింది.
జగన్ హయాంలో అప్పటి విపక్ష నాయకుడు, ప్రస్తుత సీఎం చంద్రబాబు కుటుంబంపై చేసిన దారుణ వ్యాఖ్యలు కారణమనడంలో సందేహం లేదు. అంతే కాకుండా జగన్ హయాం అంతా దౌర్జన్యాలు, దౌర్జన్యాలు, గంట, అరగంట అంటూ మహిళలతో ఫోన్ లలో అసభ్య సంభాషణలు న్యూడ్ వీడియోలు,హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన ఘటనలు, అటువంటి వారిని అక్కున చేర్చుకున్న జగన్ తీరు, ఇదేమిటని ప్రశ్నిస్తే దాడులు, కేసులు.ఇలా జగన్ హయాంలో రాష్ట్రంలో ఏ వర్గమూ సంతోషంగా, భద్రంగా లేని పరిస్థితే గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయానికి కారణం.
రాష్ట్రంలో కులచిచ్చు రేపేందుకు వైసీపీ చేస్తున్న దుష్టయత్నాలను మొగ్గలోనే తుంచేయాలని వీరిరువు అభిప్రాయపడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, విపక్షం విసిరే కులపరమైన ట్రాప్‌లో పడకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, ఆ మేరకు క్యాడర్ కు కూడా తగు సూచనలు చేయాలని వీరిరువురూ నిర్ణయించినట్లు తెలిసింది.
ఆ పదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పట్టుబడుతోంది. దీనిపై గతంలోనే స్పీకర్ కు ఫిర్యాదు చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. కాగా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ బీఆర్ఎస్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. బీఆర్ఎస్ పిటిషన్ ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం నిర్దుష్టగడువులోగా ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ ను ఆదేశించిన సంగతి విదితమే.
పవన్ కల్యాణ్ తెలంగాణ మునిసిపోల్స్ లో జనసేన బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. బీజేపీ అభ్యర్థుల తరఫున తాను స్వయంగా ప్రచారంలో పాల్గొంటానని తెలిపారు.
జనసేన పార్టీ తెలంగాణ మునిసిపోల్స్ లో పోటీ చేయనున్నట్లు ప్రకటించడమే కాదు, అభ్యర్థులను కూడా ప్రకటించి ప్రచారానికి సైతం రెడీ అయ్యింది. సరిగ్గా ఇటువంటి తరుణంలో బీజేపీ నేత రామచంద్రరావు , కిషన్ రెడ్డిపవన్ కల్యాణ్‌తో భేటీ అవ్వడం, జనసేన మునిసిపోల్స్ లో బీజేపీకి మద్దతు ప్రకటించిందనీ, జనసేనాని స్వయంగా ప్రచారంలో కూడా పాల్గొంటారంటూ ప్రకటన ఇవ్వడం జనసేన వర్గాలలో అసంతృప్తికి కారణమైంది.
శాంతి భద్రతల పరిరక్షణలో ఏపీలోని చంద్రబాబు సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం తమపై ఆధారపడి ఉందన్న అహంభావంతో. ఏం చేసినా చెల్లుతుందనే ధోరణితో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాణి అనుచిత వ్యాఖ్యలు చేశారని, దుర్భాషలాడారని కాకాణిపై తెలుగుదేశం నేతలు చేసిన ఫిర్యాదు మేరకు ఈ నోటీసులు అందజేశారు.