పోలీసు ఆంక్షల ఎఫెక్ట్.. నిబంధనలకు తలొగ్గి ‘రూట్ ‘మార్చిన జగన్

Publish Date:Feb 6, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిబంధనలకు తలొగ్గక తప్పలేదు. సాధారణంగా జగన్ ఎటువంటి ఆంక్షలు, నిబంధనలను పట్టించుకోరు. కోర్టుల విషయంలో కూడా ఆయన తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లు వ్యవహరిస్తారు. అయితే మారిన పరిస్థితులో.. మరీ మొండికేస్తే కటకటాల వెనక్కు వెళ్లాల్సి వస్తుందన్న బెదురో, కేసుల భయమో తెలియదు కానీ శుక్రవారం ఆయన పోలీసు ఆంక్షలకు తలొగ్గి తన రూట్ మార్చుకున్నారు.  

రెండు రోజుల కిందట అంటే బుధవారం ఆయన అంబటి రాంబాబు కుటుంబానికి పరామర్శ పేరుతో గుంటూరులో పర్యటించి పరామర్శ చేసిన సంరద్భంగా పలువురు వైసీపీ నేతలను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బహుశా జగన్ పోలీసు ఆంక్షలకు తలొగ్గి శుక్రవారం తన ఇబ్రహీంపట్నం పర్యటనలో ‘రూటు’ మార్చారు.  అంటే ముందుగా ప్రకటించిన విధంగా కాకుండా పోలీసులు చెప్పినట్లుగా వారు సూచించిన దారిలో వెళ్లారు. 

గుంటూరు పర్యటన సందర్బంగా వైసీపీ నేతల అరెస్టులే కాదు.. దారిపోడవునా ట్రాఫిక్ జామ్ ల కారణంగా స్థానికుల నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకత, వైసీపీ పట్ల, జగన్ పట్ల వ్యక్తమైన ప్రజా నిరసన కారణంగా జగన్ ‘దారికి’ రాక తప్పలేదు. ఈ రోజు ఆయన లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ జోగి రమేష్ కుటుంబ సభ్యులకు పరామర్శ కోసం విజయవాడ పర్యటనకు వచ్చారు.  ఈ సందర్భంగా ఆయన ముందుగా వైసీపీ ప్రకటించిన దారిలో కాకుండా ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పోలీసులు సూచించిన మార్గంలోనే వెళ్లారు.

ముందుగా ప్రకటించినట్లు విజయవాడ బ్రిడ్జి మీదనుంచి కాకుండా జగన్ కాన్వాయ్  పశ్చిమ బెపాస్ రోడ్డు, ఇబ్రహీంపట్నం మీదుగా వెళ్లింది. పోలీసులు ఈ జగన్ దారి మార్చుకుని  ట్రాఫిక్ జామ్ లకు అవకాశం లేకుండా వెళ్లాలని ఆదేశించారు. జగన్ పోలీసు ఆదేశాలను అనుసరించి, వారు సూచించిన దారిలోనే వెళ్లారు. ఇలా ఉండగా జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు పశ్చిమ బైపాస్ రోడ్డు, ఇబ్రహీంపట్నంలో  భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  జగన్ రూట్ మార్చుకుని పశ్చిమ బెపాస్ మీదుగా ఇబ్రహీంపట్నం చేరుకోవాలంటూ విజయవాడ పోలీసు కమిషనర్ గురువారం (ఫిబ్రవరి 5) రాత్రి నోటీసులు ఇచ్చారు.  ఆ నోటీసుల మేరకు జగన్ పర్యటన సాగింది. 

By
en-us Political News

  
అయితే ఇప్పుడు ఆ బృందం అంత గట్టిగా ఆయన పక్కన లేదనీ విశ్లేషించారు. అందుకే జగన్ ఇప్పుడు తానే స్వయంగా బయటకు రాక తప్పని అనివార్య పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆ కారణంగానే వైసీపీ ఆవిర్భావం తరువాత ఇప్పటి వరకూ గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ నుంచి కార్యకర్తలకు ఫోన్లు చేసి మరీ సమావేశాలకు పిలుస్తున్నారని డోలేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.
కొంత కాలం గడిచిన తర్వాత తన బలం ఏంటో అందరికీ అర్థమవుతుందని కవిత వ్యాఖ్యానించారు. ప్రజలే తనను నాయకురాలిగా తీర్చిదిద్దాలని, వారి మద్దతే తనకు అసలైన బలమని పేర్కొన్నారు.
వైసీపీ అధికారంలో ఉండగా దాదాపు ఇలాంటి పనులే చేసి జోగి రమేష్ మంత్రిపదవి పొందారు. కొడాలినాని, అనిల్ కుమార్ యాదవ్ వంటి వారు జగన్ కు అత్యంత నమ్మకస్తులుగా మారారు. తెలుగుదేశం నుంచి వలస వచ్చిన వల్లభనేని వంశీ జగన్ కు అస్మదీయుడయ్యారు.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అంబటి రాంబాబు జట్టుకు రంగు వేయించుకోకపోవడానికి జగన్ కు నలుపు రంగు అంటే ఇష్టం లేకపోవడమే కారణమని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆయన ఇప్పుడు కూడా జుత్తుకు రంగు వేసుకోవడం లేదనుకోండి.. జగన్ కు అప్పుడు ఇష్టం లేని నల్ల రంగు ఇప్పుడు ఎందుకు ఇష్టం అవుతుందన్న అభిప్రాయం కావచ్చు.
తెలుగువన్ వాస్తవ వేదిక పదకొండవ సంచికలో ఘాటైన చర్చ జరిగింది.
జగన్ హయాంలో అప్ప‌టి విప‌క్ష నాయ‌కుడు, ప్ర‌స్తుత సీఎం చంద్ర‌బాబు కుటుంబంపై చేసిన దారుణ వ్యాఖ్య‌లు కారణమనడంలో సందేహం లేదు. అంతే కాకుండా జగన్ హయాం అంతా దౌర్జన్యాలు, దౌర్జ‌న్యాలు, గంట, అరగంట అంటూ మహిళలతో ఫోన్ లలో అసభ్య సంభాషణలు న్యూడ్ వీడియోలు,హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన ఘటనలు, అటువంటి వారిని అక్కున చేర్చుకున్న జగన్ తీరు, ఇదేమిటని ప్రశ్నిస్తే దాడులు, కేసులు.ఇలా జగన్ హయాంలో రాష్ట్రంలో ఏ వర్గమూ సంతోషంగా, భద్రంగా లేని పరిస్థితే గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయానికి కారణం.
రాష్ట్రంలో కులచిచ్చు రేపేందుకు వైసీపీ చేస్తున్న దుష్టయత్నాలను మొగ్గలోనే తుంచేయాలని వీరిరువు అభిప్రాయపడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, విపక్షం విసిరే కులపరమైన ట్రాప్‌లో పడకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, ఆ మేరకు క్యాడర్ కు కూడా తగు సూచనలు చేయాలని వీరిరువురూ నిర్ణయించినట్లు తెలిసింది.
ఆ పదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పట్టుబడుతోంది. దీనిపై గతంలోనే స్పీకర్ కు ఫిర్యాదు చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. కాగా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ బీఆర్ఎస్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. బీఆర్ఎస్ పిటిషన్ ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం నిర్దుష్టగడువులోగా ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ ను ఆదేశించిన సంగతి విదితమే.
పవన్ కల్యాణ్ తెలంగాణ మునిసిపోల్స్ లో జనసేన బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. బీజేపీ అభ్యర్థుల తరఫున తాను స్వయంగా ప్రచారంలో పాల్గొంటానని తెలిపారు.
జనసేన పార్టీ తెలంగాణ మునిసిపోల్స్ లో పోటీ చేయనున్నట్లు ప్రకటించడమే కాదు, అభ్యర్థులను కూడా ప్రకటించి ప్రచారానికి సైతం రెడీ అయ్యింది. సరిగ్గా ఇటువంటి తరుణంలో బీజేపీ నేత రామచంద్రరావు , కిషన్ రెడ్డిపవన్ కల్యాణ్‌తో భేటీ అవ్వడం, జనసేన మునిసిపోల్స్ లో బీజేపీకి మద్దతు ప్రకటించిందనీ, జనసేనాని స్వయంగా ప్రచారంలో కూడా పాల్గొంటారంటూ ప్రకటన ఇవ్వడం జనసేన వర్గాలలో అసంతృప్తికి కారణమైంది.
శాంతి భద్రతల పరిరక్షణలో ఏపీలోని చంద్రబాబు సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం తమపై ఆధారపడి ఉందన్న అహంభావంతో. ఏం చేసినా చెల్లుతుందనే ధోరణితో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాణి అనుచిత వ్యాఖ్యలు చేశారని, దుర్భాషలాడారని కాకాణిపై తెలుగుదేశం నేతలు చేసిన ఫిర్యాదు మేరకు ఈ నోటీసులు అందజేశారు.
గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన అమర్‌నాథ్‌ను హెసీఏ అధ్యక్షుడిగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ను బ్లాక్‌మెయిల్‌ చేశారన్న ఆరోపణలు రావడం, సీఐడీ అరెస్టు నేపథ్యంలో జగన్మోహన్‌రావును ఇంతకుముందే హెచ్‌సీఏ సస్పెండ్‌ చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.