LATEST NEWS
రాజ్యసభ ఎన్నికల వేళ దేశ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రాజ్యసభ బరిలోకి దిగిన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు. అసలు ఎలాంటి తప్పు లేకపోయినా సాంకేతిక కారణాలు వెతికి మరీ నామినేషన్‌ను రద్దు చేయడం వెనుక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇది చీకటి రోజని, వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యంపై జరిపిన దాడి అని రేవంత్ రెడ్డి అన్నారు.
కాగా మీనాక్షీ నటరాజ్ నామినేషన్ తిరస్కరణ వ్యవహారానికీ, తెలంగాణలోని ఒక సివిల్ వివాదానికీ లింక్ ఉంది. గతంలో తెలంగాణకు చెందిన ఒక మాజీ కార్పొరేటర్ కేసుకు సంబంధించిన వివరాలను మీనాక్షి నటరాజన్ తన ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపరచలేదని బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అభ్యంతరాన్ని ఆధారంగా చేసుకుని మధ్యప్రదేశ్‌లోని రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్‌ను తిరస్కరించారు. దీనిపై రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో ఓట్ల దొంగతనానికి పాల్పడిన బీజేపీ, ఇప్పుడు ఏకంగా రాజ్యసభ స్థానాలను దక్కించుకోవడానికి సీట్ల దొంగతనానికి' తెగబడిందని విమర్శించారు. కేవలం అపవాదులు సృష్టించి ప్రతిపక్షాల అభ్యర్థులను రేసు నుంచి తప్పుకునేలా చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మండిపడ్డారు.
మీనాక్షీ నటరాజన్ నామినేషన్ తిరస్కరించడాన్ని కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కాంగ్రెస్ బృందం తక్షణమే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించింది. అయితే.. ఆ బృందం ఈసీ అధికారులను కలవకుండా అడ్డుకున్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, న్యాయం కోసం త్వరలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, కోర్టులోనే తేల్చుకుంటామని అధికారికంగా ప్రకటించింది.
ఇలా ఉండగా.. మీనాక్షి నటరాజన్ తెలంగాణ కేసుకు సంబంధించిన కీలక సమాచారాన్ని కాంగ్రెస్ పార్టీలోని కొందరు అంతర్గత నేతలే తమకు స్వయంగా అందించారని మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తన నామినేషన్ రద్దుపై స్వయంగా మీనాక్షి నటరాజన్ స్పందిస్తూ.. దేశంలో ప్రతిపక్షాల గొంతు నొక్కేసి, ఎలాగైనా ఏకపార్టీ పాలనను స్థాపించాలనే ఏకైక దురాలోచనతోనే బీజేపీ ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు.
కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 12 ఏళ్ళ పాలన పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మీడియాతో ప్రత్యేకంగా నిర్వహించిన చిట్ చాట్ లో సంచలన విషయాలు వెల్లడించారు. తెలంగాణలో వచ్చే ఎన్నికలలో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందన్నారు. ఇంకా ఈ చిట్ చాట్ లో అమిత్ షా దేశ రాజకీయాలు, నియోజకవర్గాలపునర్విభజన, మహిళా రిజర్వేషన్లు, దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ వ్యూహాలు సహా పలు కీలక, సంచలన విషయాలు చెప్పారు.
నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదన్న ఆయన.. డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల నుంచి వస్తున్న అభ్యంతరాలపై స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం లోక్‌సభలో ఆయా రాష్ట్రాలకు ఉన్న నిష్పత్తిని ఏమాత్రం దెబ్బతీయకుండా.. అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా 50 శాతం సీట్లు పెరిగేలా బిల్లులో పొందుపరిచినట్లు ఆయన వెల్లడించారు. అలాగే.. మహిళా రిజర్వేషన్ల పెంపు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ప్రస్తుతం పార్లమెంట్‌లో పెండింగ్‌లో ఉందని, అవసరమైన రాజకీయ మద్దతు లభించగానే దీనిని ఆమోదించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
ఇక దేశమంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానంపై మాట్లాడిన అమిత్ షా.. ప్రస్తుతం ఈ అంశంపై ఏర్పాటు చేసిన కమిటీ లోతుగా అధ్యయనం చేస్తోందని తెలిపారు. కమిటీ నివేదిక సమర్పించిన వెంటనే.. దానికి సంబంధించిన బిల్లుకు పార్లమెంట్‌లో అవసరమైన మద్దతు లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ఎన్డీఏ కూటమిలోని ప్రాంతీయ పార్టీల సంబంధాలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. జెడియు , టిడిపి, శివసేన సహా కూటమిలో ఉన్న భాగస్వామ్య పక్షాలన్నీ పూర్తి సంతృప్తితో ఉన్నాయని, తమ వల్ల ఏ ప్రాంతీయ పార్టీకీ ఎలాంటి ఇబ్బందీ లేదనీ అమిత్ షా చెప్పారు. అక్కడితో ఆగకుండా.. భవిష్యత్తులో కొత్తగా మరే ఇతర ప్రాంతీయ పార్టీని ఎన్డీఏ కూటమిలో చేర్చుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.
ముందు ముందు ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా సొంత బలంతో ఒంటరిగానే పోటీ చేసి అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని ప్రకటించారు. దక్షిణాది రాష్ట్రాలలో తెలంగాణపై తాము ప్రత్యేక దృష్టి సారించామన్న అమిత్ షా.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీతోనూ బీజేపీ పొత్తు పెట్టుకోదని, ఒంటరిగానే బరిలోకి దిగుతుందని కుండబద్దలు కొట్టేశారు. అలాగే.. పంజాబ్‌లో సైతం శిరోమణి అకాలీదళ్ సహా ఏ ఇతర పార్టీతోనూ పొత్తు ఉండదని, అక్కడ ఒంటరిగా పోటీ చేసి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తామని అన్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ తప్పనిసరిగా ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామని అమిత్ షా చెప్పారు. దేశ సరిహద్దు ప్రాంతాల భద్రతను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించబోతున్నామని, సరిహద్దులన్నింటినీ కట్టుదిట్టంగా ఆధునీకరిస్తామని పేర్కొన్నారు. మొత్తంగా.. మోదీ 12 ఏళ్ళ పాలన ముగిసిన వేళ అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్యలు అటు జాతీయ రాజకీయాల్లోనూ, ఇటు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
దేశంలో అత్యంత సుదీర్ఘ కాలం పాటు ప్రధానిగా పదవిలో కొనసాగిన రికార్డు ఇప్పడు నరేంద్రమోడీ పేరు మీద ఉంది. ఇప్పటి వరకూ భారత తొలి ప్రధాని జవహర్లాల్ పేరు మీద ఉన్న ఈ రికార్డును ప్రధాని మోడీ తిరగరాశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై, కేంద్రంలో అత్యంత సుదీర్ఘకాలం పాటు నిరవధికంగా దేశానికి సేవలు అందించిన ఏకైక ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న ఈ రికార్డును మోదీ బద్దలు కొట్టారు.
ఈ చారిత్రక ప్రస్థానంలో సరిగ్గా బుధవారం (జూన్ 10) నాటికి నరేంద్ర మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. బుధవారం (జూన్ 10) తో ప్రదాని మోడీ నెహ్రూను అధిగమించారు. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 14 ఏళ్లకు పైగా ప్రధానిగా సేవలు అందించినప్పటికీ.. ఆమె నిరంతరాయంగా ఆ పదవిలో కొనసాగలేదు. కానీ మోదీ మాత్రం 2014, 2019,2024 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు చారిత్రాత్మక విజయాలను అందుకొని, నిరవధికంగా ప్రధానిగా కొనసాగుతూ అప్రతిహతంగా దూసుకుపోతున్నారు.
ఈ అద్భుతమైన ఘనతను.. అలాగే కేంద్రంలో ఎన్డీఏ (NDA) ప్రభుత్వం విజయవంతంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక భారత్ మండపం లో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఆయనతో పాటు బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులు కూడా హాజరయ్యారు. అలాగే.. దేశవ్యాప్తంగా ఉన్న 22 ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మిత్రపక్షాల అధినేతలు ఈ వేడుకకు తరలివచ్చారు. ఈ చారిత్రక మైలురాయిని అందుకున్న ప్రధాని మోదీకి ఘనంగా అభినందనలు తెలుపుతూ ఎన్డీఏ కూటమి ఒక ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ సమావేశంలో గత 12 ఏళ్ల ప్రభుత్వ విజయాలు, భవిష్యత్తు కార్యాచరణ మరియు రాబోయే రాజకీయ వ్యూహాలపై చర్చించారు.
ALSO ON TELUGUONE N E W S
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) సరికొత్త సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే టాలీవుడ్ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. క్లాస్ మరియు మాస్ ఎలిమెంట్స్‌ను సమానంగా మేళవించి సినిమాలను తెరకెక్కించే టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు "ఇరుముడి" (Irumudi) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. టైటిల్‌తోనే వైవిధ్యతను చూపించిన ఈ సినిమా, భక్తి మరియు యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక విలక్షణమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. ఇండస్ట్రీ సర్కిల్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా బిజినెస్ పరంగానూ, క్రేజ్ పరంగానూ ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన బజ్ క్రియేట్ చేస్తోంది. రవితేజ మార్కెట్ స్టామినాకు తగినట్లుగా శివ నిర్వాణ ఈ స్క్రిప్ట్‌ను ఎంతో పకడ్బందీగా సిద్ధం చేశారని టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరియు మ్యూజిక్ లవర్స్‌లో హల్చల్ చేస్తోంది. ఈ చిత్రానికి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. కథా నేపథ్యానికి తగ్గట్టుగా జి.వి. ప్రకాష్ ఈ సినిమా కోసం రెండు అద్భుతమైన, అత్యంత శక్తివంతమైన అయ్యప్ప స్వామి భక్తి గీతాలను స్వరపరిచినట్లు తెలుస్తోంది. సాధారణంగానే అయ్యప్ప స్వామి పాటలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అలాంటిది రవితేజ లాంటి ఎనర్జిటిక్ హీరో నటిస్తున్న సినిమాలో ఈ తరహా సాంగ్స్ పడితే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయం. జి.వి. ప్రకాష్ కంపోజ్ చేసిన ఆ రెండు పాటల్లో "బంగారు పల్లకి" అనే సాంగ్ ఇప్పటికే ఇండస్ట్రీ ఇన్నర్ సర్కిల్స్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోందని, ఈ ట్రాక్ ప్రేక్షకులకు ఒక సరికొత్త గూస్‌బంప్స్ ఇచ్చే మ్యూజికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతోందని టాక్ బలంగా వినిపిస్తోంది.
రవితేజ కెరీర్‌లో భక్తిరస ఎలిమెంట్స్ ఉన్న సబ్జెక్ట్ రావడం చాలా అరుదు. అందుకే దర్శకుడు శివ నిర్వాణ ఈ "ఇరుముడి" చిత్రాన్ని కేవలం భక్తి చిత్రంగానే కాకుండా, రవితేజ మార్క్ కమర్షియల్ హంగులు, అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్ మరియు ఎమోషనల్ డ్రామాతో పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేశారు. సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్ విడుదలైన రోజు నుంచే ఈ ప్రాజెక్ట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. రవితేజ మాస్ ఇమేజ్‌కు, శివ నిర్వాణ క్లాసిక్ టేకింగ్‌కు, అలాగే జి.వి. ప్రకాష్ మ్యాజికల్ మ్యూజిక్ తోడవ్వడంతో ఈ సినిమా రేంజ్ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లనుందని ఇండస్ట్రీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఈ అయ్యప్ప స్వామి భక్తి గీతాలు సినిమా కథాగమనంలో అత్యంత కీలకమైన సందర్భంలో వస్తాయని, ఇవి సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చెప్తున్నారు.
భారీ అంచనాలు ఉన్న ఈ మోస్ట్ అవేటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ విడుదలకు సంబంధించి కూడా మేకర్స్ ఇప్పటికే పక్కా ప్లానింగ్‌తో ఉన్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ "ఇరుముడి" చిత్రాన్ని రాబోయే ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. మాస్ మహారాజా రవితేజ ఎనర్జీకి, జి.వి. ప్రకాష్ అందించిన భక్తి గీతాల మ్యాజిక్ తోడైతే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. ఈ క్రేజీ మ్యూజికల్ అప్‌డేట్‌తో సినిమాపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి.
లెజండ్రీ దర్శక శిఖరం భారతీరాజా(Bharathiraja)ఈ రోజు ఉదయం స్వర్గస్థులయ్యారు. ఈ వార్త తెలియగానే కోలీవుడ్‌తో పాటు మొత్తం దక్షిణ భారత సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. దాదాపు ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో నలభైకి పైగా అద్భుతమైన చిత్రాలని తెరకెక్కించి, ఆరు జాతీయ చలనచిత్ర అవార్డులని సొంతం చేసుకున్న ఈ మహోన్నత దర్శకుడి మరణం సినీ రంగానికి తీరని లోటుగా మారింది.
ఇళయ దళపతి, తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తన బిజీ షెడ్యూల్‌ని పక్కనబెట్టి భారతీరాజా నివాసానికి చేరుకున్నారు. విజయ్ రాకతో అక్కడ ఒక్కసారిగా వాతావరణం మరింత భావోద్వేగంగా మారింది. భారతీరాజా భౌతికకాయాన్ని చూసిన విజయ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన కళ్లల్లో నీళ్లు తిరిగాయి.భారతీరాజా పాదాలకి నమస్కరించి, నివాళులర్పించారు. దాదాపు 10 నిమిషాల పాటు అక్కడే మౌనంగా ఉండిపోయిన విజయ్, ఆ తర్వాత భారతీరాజా కుటుంబ సభ్యులని పరామర్శించారు. ఆయన కుమారుడు మనోజ్ భారతీరాజాను గట్టిగా కౌగిలించుకుని ఓదార్చారు. ఈ కష్టసమయంలో ధైర్యంగా ఉండాలని కోరుతూ, తమ కుటుంబం ఎల్లప్పుడూ తోడుంటుందని భరోసా ఇచ్చారు.
Also read: Bharathiraja: భారతీరాజా అంటే... గుర్తొచ్చేది ఏంటో తెలుసా!
విజయ్ మరియు భారతీరాజా మధ్య కేవలం దర్శకుడు, నటుడి బంధమే కాకుండా ఒక బలమైన కుటుంబ అనుబంధం కూడా ఉంది. విజయ్ కెరీర్ ప్రారంభంలో ఆయన తండ్రి, దర్శకుడు ఎస్.ఎ. చంద్రశేఖర్‌తో భారతీరాజాకి ఎంతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. విజయ్ ఎదిగిన తీరుని భారతీరాజా ఎప్పుడూ అభినందిస్తూ ఉండేవారు. 2020లో వచ్చిన ఒక సూపర్ హిట్ చిత్రంలో వీరిద్దరూ కలిసి స్క్రీన్ పంచుకోవాల్సి ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు. అయినప్పటికీ, విజయ్ నటనని , ఆయనకున్న 80 శాతానికి పైగా ఉన్న భారీ మాస్ ఫాలోయింగ్‌ను భారతీరాజా పలు ఇంటర్వ్యూలలో ప్రశంసించారు. ఒక గ్రామీణ నేపథ్య కథతో విజయ్‌తో సినిమా చేయాలనేది భారతీరాజా చివరి కోరికలలో ఒకటిగా ఉండేదని సినీ వర్గాలు అంటుంటాయి. భారతీరాజా భౌతికకాయానికి అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Priya Bhavani Shankar has officially completed filming her scenes for the upcoming Telugu movie, Irumudi. Marking the occasion, she posted a few behind-the-scenes pictures on Instagram to share her experience working on the project.
Reflecting on her time on set, she wrote, "We shot scenes, took home a thousand memories, collected a few inside jokes, laughed at things that weren’t supposed to be funny, and somehow finished a film. What a lovely journey this has been."
Directed by Shiva Nirvana, Irumudi marks a clear shift in genre for lead actor Ravi Teja. He is stepping away from his regular action-oriented scripts to play a middle-class father who takes up a spiritual path. The story heavily focuses on the emotional bond between his character and his daughter, played by Baby Nakshatra.
Recent promotional material has shown both Ravi Teja and Priya in grounded, everyday looks, pointing toward a character-driven family drama rather than a commercial entertainer. Produced by Mythri Movie Makers, the film is currently making its way through production and is slated for a worldwide release on August 21st.
Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
సినిమా అనే పదానికి సరికొత్త వయసుని, వన్నెని తెచ్చిన దర్శకుడు భారతిరాజా(Bharathiraja)ముఖ్యంగా తమిళ సినిమా చరిత్రలో సరికొత్త విప్లవానికి తెరతీసిన లెజెండరీ. గత కొంతకాలంగా వయోభారం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.
సినిమాని నాలుగు గోడల స్టూడియో సెట్ల నుంచి బయటకు తీసుకువచ్చి, పచ్చని పల్లెటూరి వాతావరణాన్ని, గ్రామీణ సంస్కృతిని వెండితెరకి పరిచయం చేసిన ఘనత ఆయనదే. ఇంటర్ క్యాస్ట్ ప్రేమలకి కూడా ఆద్యుడు. ప్రెజెంట్ ఆ ఫార్ములాతో ఇండియా వైడ్ గా ఎవరు సినిమాని తెరకెక్కించినా, భారతి రాజా ఎప్పుడో తెరకెక్కించాడని గుర్తు చేసుకుంటారు. అందుకే సినీ లోకం ఎంతో గౌరవంగా ‘ఇయక్కునర్ ఇమయం’ (దర్శకుల శిఖరం) అని పిలుచుకుంటుంది. ఆయన మరణవార్త తెలియగానే కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోను విషాద ఛాయలు అలముకున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు భారతీరాజా నివాసానికి చేరుకుని ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు.
భారతీరాజా సినీ ప్రస్థానం ఒక అద్భుత కావ్యం. 1977లో వచ్చిన '16 వాయతినిలే' (తెలుగులో 'పదహారేళ్ళ వయసు') చిత్రంతో ఆయన దర్శకుడిగా పరిచయమయ్యారు. కమల్ హాసన్, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా, సూపర్ స్టార్ రజనీకాంత్ విలన్ గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులని సృష్టించడమే కాకుండా, తమిళ సినిమా గమనాన్నే మార్చేసింది. దాదాపు 4 దశాబ్దాలకు పైగా సాగిన ఆయన కెరీర్ లో 40 కి పైగా చిత్రాలని అద్భుతంగా తెరకెక్కించారు. కిళక్కే పోగుం రైల్, సికప్పు రోజాక్కళ్, అలైగళ్ ఓయ్వతిల్లై, ముదల్ మరియాదై వంటి క్లాసిక్ చిత్రాలు ఆయన కలం నుండి జాలువారినవే. కేవలం దర్శకుడిగానే కాకుండా, నిర్మాతగా, స్క్రీన్ రైటర్ గా, నటుడిగా కూడా ఆయన రాణించారు.
Also read: Balakrishna: ఈ రోజు బాలకృష్ణ బర్త్ డే..పవన్ కళ్యాణ్ ట్వీట్ వైరల్
ఇటీవల ధనుష్ నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా 'తిరుచిత్రాంబలం' (తెరు) మరియు 'మహారాజ' చిత్రాలలో ఆయన నటనకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మోహన్‌లాల్ సరసన నటించిన 'తుడరుమ్' ఆయన చివరి స్క్రీన్ అప్పీయరెన్స్ కాగా, ఇంకా విడుదల కాని 'పులవర్' చిత్రం నటుడిగా ఆయనకు చివరి సినిమా కానుంది. ఆయన ప్రతిభకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. తన కెరీర్ లో 6 జాతీయ చలనచిత్ర అవార్డులు, 4 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 6 తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులతో పాటు ఒక నంది అవార్డుని కూడా గెలుచుకున్నారు. సినిమా రంగానికి ఆయన చేసిన సేవలు అనన్యసామాన్యం. అయితే, గత కొద్ది కాలంగా భారతీరాజా వ్యక్తిగత జీవితంలో తీవ్రమైన మానసిక వేదనను అనుభవించారు. మార్చి 2025 లో ఆయన కుమారుడు, నటుడు మనోజ్ భారతీరాజా కేవలం 48 ఏళ్ల వయసులో గుండెపోటుతో అకాల మరణం చెందారు. కుమారుడి మరణం భారతీరాజాను మానసికంగా తీవ్రంగా కుంగదీసింది. అప్పటి నుండి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆయన మరణంతో భారతీయ సినిమా ఒక గొప్ప దార్శనికుడిని కోల్పోయింది. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన సృష్టించిన అమర చిత్రాలు తరతరాల సినీ ప్రేమికులని అలరిస్తూనే ఉంటాయి. తెలుగులో ఆయన తెరకెక్కించిన సీతాకోకచిలుక మూవీకి ఉత్తమ చిత్రంగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారంతో పాటు నంది ఉత్తమ దర్శకుడు అవార్డుని గెలుచుకుంది. బాలకృష్ణ నుంచి వచ్చిన మంగమ్మగారి మనవడుకి కథని, పల్నాటి పౌరుషం చిత్రానికి స్క్రీన్‌ప్లేని అందించారు. 1941 జూలై 17న తమిళనాడులోని తేని జిల్లా అల్లినగరంలో జన్మించిన భారతీరాజా వయసు 84 సంవత్సరాలు.
ఈ రోజు ఆంధ్రా అందగాడు, బాక్స్ ఆఫీస్ బొనాంజా, యువరత్న,నటసింహ, గాడ్ ఆఫ్ మాసెస్, పద్మభూషణ్, హిందూపురం ఏంఎల్ఏ బాలకృష్ణ పుట్టినరోజు. అభిమానులకి పండుగరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమాల వేదికగా బాలకృష్ణకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
తన ట్వీట్ లో 'వెండితెరపై పవర్‌ఫుల్ నటనతో అలరిస్తూ, రాజకీయాల్లో హిందూపురం నియోజకవర్గం నుండి వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందుతూ ప్రజాసేవలో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా తన మాతృమూర్తి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చైర్మన్‌గా ఉంటూ, వేలాది మంది పేద క్యాన్సర్ రోగులకి ఉచితంగా, రాయితీలతో కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ ఆపన్నహస్తంగా నిలవడం అభినందనీయం. సినిమాలకే పరిమితం కాకుండా నిజజీవితంలోనూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన బాలయ్య బాబు, రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నానని తెలిపాడు. ఇప్పుడు ఈ ట్వీట్ ఇరువురి అభిమానులని అలరిస్తుంది.
Also read: Peddi: నష్టాల దిశగా నాన్ తెలుగు స్టేట్స్.. ఓవర్ సీస్ అంతకు మించి?
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు.
టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.
జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి.
చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది.
"ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు.
సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు.
గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.
*నిశ్శబ్ద.
ఏదయినా ఒక వస్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధగా వుంటుంది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువు చేజారి పడి పగిలిపోయినా, దొంగతనం జరిగినా, ఎక్కడో మర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొందలేమని దిగులు పట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్టమయిన పెయింటింగ్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దూరమయింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడగలి గింది.
అదంటే మరి ఆమెకు ప్రాణ సమానం. చాలా కాలం దొరుకుతుందని, తర్వాత ఇక దొరకదేమో అనీ ఎంతో బాధపడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గతేడాది ఆమెను చేరింది. ఆమెది నెదర్లాండ్స్. ఆమె తండ్రి నెదర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్నపిల్లల ఆస్పత్రి డైరెక్టర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విషయానికి వస్తే.. అది 1683లో కాస్పర్ నెషర్ వేసిన స్టీవెన్ ఓల్టర్స్ పెయింటింగ్.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల ఆదేశాలను చార్లెట్ తండ్రి వ్యతిరేకించారు. ఆయన రహస్య జీవనం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం తన నగరంలోని ఒక బ్యాంక్‌లో భద్ర పరచమని ఇచ్చారట. 1940లో నాజీలు నెదర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద పడి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన తర్వాత ఈ పెయింటింగ్ ఎక్కడున్నదీ ఎవరికీ తెలియలేదు. చిత్రంగా 1950ల్లో డసల్‌డార్ష్ ఆర్ట్ గ్యాలరీలో అది ప్రత్యక్షమయింది. 1969లో ఆమ్‌స్టర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాలరీలో వుందని చూసినవారు చెప్పారు. వేలంపాట తర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక కళాపిపాసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.
మొత్తానికి వూహించని విధంగా ఎంతో కాలం దూరమయిన గొప్ప కళాఖండం తిరిగి తన వద్దకు చేరడంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే కదా.. పోయిందనుకున్న గొప్ప వస్తువు తిరిగి చేరితే ఆ ఆనందమే వేరు! అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భద్రంగా చూసుకునే ఆసక్తి వున్నప్పటికీ శక్తి సామర్ధ్యాలు లేవు. అందుకనే త్వరలో ఎవరికయినా అమ్మేసీ వచ్చిన సొమ్మును పిల్లలకు పంచుదామనుకుంటోందిట! చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు వున్నారు. అలాగే ఇరవై మంది పిల్లలు ఉన్నారు. అందరూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అందరం ఒకే కుటుంబం, చాలాకాలం తర్వాత ఇల్లు చేరిన కళాఖండం మా కుటుంబానిది అన్నది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు.
చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్ విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది.
ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.
అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి 15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్ పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు.
అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో, ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది.
మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.
అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు ఒకే సారి ఆయన మీద విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.
రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .
దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.
ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు. వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .
ప్రతి వ్యక్తికి నేటికాలంలో ఇల్లు, ఆఫీసు అంటూ రెండు ప్రదేశాలు ముఖ్యంగా మారాయి. ఒకటి కుటుంబ సభ్యులతో కలసి ఉండేది అయితే రెండవది కుటుంబ సభ్యులను పోషించడానికి మరొక ప్రదేశంలో విభిన్న వ్యక్తులతో కలిసి పనిచేసే స్థలం. చాలామంది ఆఫీసులో ఒత్తిడి ఎదుర్కుంటున్నామని చెబుతూ ఉంటారు. ఆఫీసులో గనుక పని ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటే అది మానసిక ఆరోగ్యాన్ని, వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అయితే కొన్ని చిన్న చిన్న మార్పులు, చిట్కాలతో ఒత్తిడి నుండి బయట పడవచ్చు. ఇవి నేరుగా ఆఫీసుకు వెళ్లి పని చేసే వారికి అయినా, లేక వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి అయినా చాలా చక్కగా పని చేస్తాయి. అవేంటో తెలుసుకుంటే..
పనుల జాబితా..
ఈ చిట్కా ఖచ్చితంగా సహాయపడుతుంది. ఉదయాన్నే డైరీలో రోజు పనులను రాసుకోవాలి. పైన తేలికైన పనులను, దిగువన ఎక్కువ సమయం, శ్రద్ధ అవసరమయ్యే పనులను లిస్ట్ చేయాలి. ఇది మనస్సు గందరగోళం లేకుండా క్లారిటీగా ఉంచడానికి సహాయపడుతుంది. రోజులో ఆ పనులు చేయాలి, ఈ పనులు చేయాలి.. వాటిని ఎప్పుడు చేయాలో అనుకుంటూ అతిగా ఆలోచించడాన్ని తగ్గిస్తుంది.
బ్రేక్ ముఖ్యం..
ఎంత పని ఉన్నా సరే.. గంటల తరబడి కూర్చుని పని చేయడం తప్పు. ప్రతి 25-30 నిమిషాల పని తర్వాత 5 నిమిషాల విరామం తీసుకోవాలి. నీరు త్రాగడం, కళ్ళు మూసుకోవడం లేదా కొద్దిగా శరీరాన్ని రిలాక్స్ చేసుకోవడం.. ఇవన్నీ మనసు అలసిపోకుండా విశ్రాంతిని ఇస్తాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి.
నో చెప్పడం నేర్చుకోండి..
ఇది అతి ముఖ్యమైన చిట్కా ఏమిటంటే.. ప్రతి పనినీ, మీటింగ్‌నీ లేదా పనిని.. ఇట్లా ఏదైనా సరే.. ఆఫీసులో అదనపు బాధ్యతను ఎప్పుడూ తీసుకోకూడదు. చాలా మంది కాస్త మంచిగా మాట్లాడుతూ, కాస్త పొగుడుతూ ఏదైనా పని చేసిపెట్టమని అడుగుతూ ఉంటారు. అలాంటి సందర్భాలలో మర్యాదగా తిరస్కరించాలి. ఇది మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎందుకంటే అదనపు పని భారం ఒత్తిడికి దారి తీస్తుంది. ప్రతి ఒక్కరూ నో చెప్పడం నేర్చుకోవాలి. ఇది ఎంతో సహాయపడుతుంది.
శారీరక శ్రమ..
పనిలో బిజీగా ఉన్నప్పటికీ, ప్రతిరోజూ 15-30 నిమిషాలు నడవడం, యోగా చేయడం లేదా తేలికపాటి వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. ఇది సహజ ఒత్తిడిని తగ్గించే మార్గం. ఒత్తిడి హార్మోన్లు వ్యాయామం వల్ల తగ్గుతాయి. వ్యాయమం మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఇది ఫిట్‌గా ఉంచుతుంది. డెస్క్ దగ్గరే కూర్చుని చేయగల యోగా భంగిమలు కొన్ని ఉంటాయి. అలాంటివి చేసినా బాగుంటుంది.
*రూపశ్రీ.
ఆదివారం అనే మాట వినగానే మన ముఖాల్లో సంతోషకరమైన చిరునవ్వు వస్తుంది. ఇది కుటుంబంతో సమయం గడపడానికి, పని నుండి విరామం తీసుకోవడానికి కేటాయించబడిన రోజుగా పరిగణిస్తారు. చిన్నప్పుడు పిల్లలు ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తుందా అని ఎదురుచూసేవారు.. కానీ ఇప్పుడు పిల్లలు పెద్దలు కూడా ఆదివారం కోసం ఎదురుచూడటం సాధారణమైపోయింది. భారతదేశంలో ప్రభుత్వ కార్యాలయాలకు ఆదివారం వారపు సెలవుదినంగా ఉంటుంది. కానీ ఆదివారం అనేది మొదటి నుండి సెలవు దినంగా ఉన్నది కాదని, ఆదివారం సెలవు దినం కావడం వెనుక చాలా ఆసక్తికరమైన సంఘటన ఉంది. దాని గురించి తెలుసుకుంటే..
కార్మిక హక్కులు..
బ్రిటిష్ పాలన కాలంలో ఆదివారంను వారపు సెలవు దినంగా ఎంచుకున్నారు. దీని వెనుక ఒక కథ ఉంది.
ఆదివారం సెలవు వెనుక కథ..
ప్రస్తుత కాలం ఆదివారంతో చేసే ఎంజాయ్మెంట్ ఎప్పుడూ ఉండేది కాదు. ఎందుకంటే బ్రిటిష్ పాలనలో భారతదేశంలోని వస్త్ర మిల్లులలో, ముఖ్యంగా ముంబైలోని కార్మికుల పరిస్థితులు దారుణంగా ఉండేవి. వారు వారానికి ఏడు రోజులు విరామం లేకుండా పని చేయాల్సి వచ్చింది. వారం మొత్తం ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల ఆరోగ్యం చాలా దెబ్బతినేది. ఈ క్లిష్ట సమయంలో నారాయణ్ మేఘాజీ లోఖండే వారి హీరో అయ్యాడు.
7ఏళ్ల పోరాటం..
కార్మికుల దుస్థితిని చూసి లోఖండే వారి హక్కుల కోసం గొంతు విప్పాడు. 1881, 1884 మధ్య ఎన్నో నిరసనలు నిర్వహించి బ్రిటిష్ పరిపాలకులకు చాలా సందేశాలను పంపాడు. అతని విజ్ఞప్తిపై వేలాది మంది కార్మికులు ఏకమయ్యారు. కానీ అది చిన్న పోరాటం కాదు. ఈ ఉద్యమం ఏడు సంవత్సరాలు కొనసాగింది. చివరికి కార్మికుల సంఘీభావం, లోఖండే ప్రయత్నాలకు బ్రిటిష్ ప్రభుత్వం లొంగిపోయింది. జూన్ 10, 1890న, భారతదేశంలో ఆదివారం అధికారికంగా వారపు సెలవు దినంగా ప్రకటించబడింది.
ఆదివారం సెలవు వెనుక అసలు కారణం..
ఆదివారం సెలవు దినంగా ఎంచుకోవడం వెనుక మతపరమైన, ఆచరణాత్మక కారణాలు రెండూ ఉన్నాయి.
ఆ సమయంలోభారతదేశాన్ని క్రైస్తవ మతాన్ని ఆచరించే బ్రిటిష్ వారు పరిపాలించారు. వారికి ఆదివారం చర్చికి వెళ్లడానికి సరైన రోజు. అందువల్ల ఆదివారం సెలవు దినంగా ఎంచుకున్నారు.
భారతీయ సంస్కృతి, హిందూ మతంతో అనుసంధానిస్తూ ఆదివారం సూర్యభగవానుడికి, కొన్ని ప్రాంతాలలో ఖండోబాకు అంకితం చేయబడిందని ఒక వాదన ముందుకు వచ్చింది. బ్రిటిష్ వారిలాగే భారతీయ కార్మికులు కూడా విశ్రాంతి, పూజ కోసం ఒక రోజును కలిగి ఉండాలి.
1700 సంవత్సరాల చరిత్ర..
ఆదివారాన్ని విశ్రాంతి దినంగా చేయడం అనేది భారతదేశంలో పుట్టినది కాదు. దీని చరిత్ర చాలా కాలం నాటిది. 321 ADలో, రోమన్ చక్రవర్తి కాన్‌స్టాంటైన్ ది గ్రేట్ మొదట ఆదివారాన్ని రోమన్ సామ్రాజ్యం అంతటా విశ్రాంతి దినంగా ప్రకటించాడు. క్రమంగా ఈ సంప్రదాయం యూరప్, తరువాత బ్రిటన్ పరిపాలనా వ్యవస్థలో భాగమైంది. వారు దానిని భారతదేశానికి తీసుకువచ్చారు. అంతే తప్ప భారతీయులకు ప్రత్యేకంగా ఈ ఆదివారం సెలవు వెనుక ఎలాంటి ప్రాధాన్యత లేదు.
*రూపశ్రీ.
భారతదేశ పరిమళం ఇప్పుడు సప్త సముద్రాల ఆవలి దేశాల వాతావరణంతో మేళవిస్తోంది. ఆ దేశాల సంస్కృతులు, సంప్రదాయాలు మనకంటే పూర్తిగా భిన్నమైనవి. మనం మన పెరటి మొక్కగా అంతకంటే ఎక్కువ ఇంటి దేవతగా భావించి, ప్రతి ఉదయం, సాయంత్రం నీళ్ళు పోసి పూజించే తులసి, ఇప్పుడు ప్రపంచంలోని ప్రధాన ముస్లిం దేశాల మొదటి ఎంపికగా మారింది. ఈ మాట తెలియగానే చాలామందికి ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఇటీవలి డేటా , వాణిజ్య నివేదికలు ఒక ఆశ్చర్యకరమైన నిజాన్ని వెల్లడించాయి. బంగ్లాదేశ్, మలేషియా , ఇండోనేషియా వంటి దేశాలలో భారతీయ తులసికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇది కేవలం వాణిజ్యానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, భారతీయులుగా తెలుసుకోవాల్సిన విషయం. తులసిని కేవలం మొక్కగా బావించే ఎంతోమంది విదేశీయులు కూడా తులసికి ఎందుకంత గొప్ప ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీని గురించి వివరంగా తెలుసుకుంటే..
విదేశాలలో తులసి..
సనాతన ధర్మంలో, తులసిని కేవలం ఒక మొక్కగా మాత్రమే కాకుండా, "సాక్షాత్తు లక్ష్మీదేవి" స్వరూపంగా భావిస్తారు. పెరట్లో తులసి ఉన్న ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశించలేదని శాస్త్రాలు చెబుతున్నాయి. కానీ నేడు, ఈ నమ్మకం అన్ని హద్దులను దాటింది. ఇటీవలి నివేదికల ప్రకారం, తులసి, దాని సారాలు భారతదేశం నుండి పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ , మలేషియా వంటి ఆగ్నేయాసియా దేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతి అవుతున్నాయి. ఆశ్చర్యకరంగా, ఈ దేశాలు దీనిని కేవలం ఒక మొక్కగా మాత్రమే కాకుండా, ఒక "దివ్య ఔషధం"గా స్వీకరిస్తున్నాయి.
విదేశాలలో తులసికి ఆదరణ..
విదేశాలలో తులసి ఆదరణ వెనుక విజ్ఞానం ఆధ్యాత్మికతల కలయికను ప్రతిబింబించే అనేక లోతైన , తార్కిక కారణాలు ఉన్నాయి. నయంకాని వ్యాధులకు సర్వరోగ నివారిణిగా తులసి పనిచేస్తుంది. ఈ దేశాలలో ఆయుర్వేదంపై నమ్మకం పెరిగింది. అక్కడి శాస్త్రవేత్తలు కూడా క్యాన్సర్, మధుమేహం , శ్వాసకోశ వ్యాధుల చికిత్సలో తులసి ప్రభావవంతంగా పనిచేస్తుందని గుర్తించి దాన్ని వైద్యంలో భాగం చేస్తున్నారట.
హలాల్ గుర్తించిన మూలిక..
మలేషియా , ఇండోనేషియా వంటి దేశాలలో, "హలాల్" ఉత్పత్తులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. తులసి ఉత్పత్తులు సహజమైనవి , స్వచ్ఛమైనవి, వీటిలో నిషేధిత రసాయనాలు ఏవీ ఉండవు. ఈ కారణంగానే అక్కడి ముస్లిం సమాజంలో వీటికి ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది.
తులసి టీ..
భారతీయ "తులసి టీ" కి ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రజలు కెఫిన్‌ను వదిలిపెట్టి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి , రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి తులసి సారాన్ని ఆశ్రయిస్తున్నారు. తులసితో టీ తయారు చేసుకుని తాగుతున్నారు.
మతపరమైన దృక్కోణం నుండి చూస్తే ప్రతి భారతీయుడు దీన్ని గర్వంగా భావించాలి. మనం విష్ణువుకు ఎంతో ప్రతీకరమైనదిగా పిలుచుకునే మొక్క పరిమళం ఇప్పుడు విభిన్నమైన ప్రార్థనా పద్ధతులున్న ఇళ్లకు చేరుతోంది. సనాతన సంస్కృతి పూజించే ప్రకృతిలోని ప్రతి అంశం మానవులకు ఎంతో మేలు చేసేది, ఆరోగ్యం చేకూర్చేది అనేటువంటి దానికి ఇదొక నిదర్శనం.
ప్రపంచ మార్కెట్లో తులసికి ప్రాధాన్యత..
భవిష్యత్తులో తులసి ప్రపంచ మూలికా మార్కెట్‌కు బిలియన్ల డాలర్ల మేర దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. గత మూడేళ్లలో గల్ఫ్ దేశాలకు తులసి ఎగుమతులు 30-40% పెరిగాయట.
దుబాయ్ , సౌదీ అరేబియాలోని విలాసవంతమైన స్పా మరియు బ్యూటీ పార్లర్లలో ఇప్పుడు తులసి ఆధారిత ఫేస్ మాస్క్‌లు , నూనెలను ప్రీమియం ట్రీట్మెంట్ లో భాగంగా గా అందిస్తున్నారట.
భారతీయులకు ఎంతో పవిత్రమైన, ఆయుర్వేదంలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నట్టు పేర్కొన్న తులసిని భారతీయులు చిన్నతనం చేయకుండా ఉపయోగించుకోవాలి.
*రూపశ్రీ.
రాజ్యసభ ఎన్నికల వేళ దేశ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రాజ్యసభ బరిలోకి దిగిన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు. అసలు ఎలాంటి తప్పు లేకపోయినా సాంకేతిక కారణాలు వెతికి మరీ నామినేషన్‌ను రద్దు చేయడం వెనుక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇది చీకటి రోజని, వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యంపై జరిపిన దాడి అని రేవంత్ రెడ్డి అన్నారు.
కాగా మీనాక్షీ నటరాజ్ నామినేషన్ తిరస్కరణ వ్యవహారానికీ, తెలంగాణలోని ఒక సివిల్ వివాదానికీ లింక్ ఉంది. గతంలో తెలంగాణకు చెందిన ఒక మాజీ కార్పొరేటర్ కేసుకు సంబంధించిన వివరాలను మీనాక్షి నటరాజన్ తన ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపరచలేదని బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అభ్యంతరాన్ని ఆధారంగా చేసుకుని మధ్యప్రదేశ్‌లోని రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్‌ను తిరస్కరించారు. దీనిపై రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో ఓట్ల దొంగతనానికి పాల్పడిన బీజేపీ, ఇప్పుడు ఏకంగా రాజ్యసభ స్థానాలను దక్కించుకోవడానికి సీట్ల దొంగతనానికి' తెగబడిందని విమర్శించారు. కేవలం అపవాదులు సృష్టించి ప్రతిపక్షాల అభ్యర్థులను రేసు నుంచి తప్పుకునేలా చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మండిపడ్డారు.
మీనాక్షీ నటరాజన్ నామినేషన్ తిరస్కరించడాన్ని కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కాంగ్రెస్ బృందం తక్షణమే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించింది. అయితే.. ఆ బృందం ఈసీ అధికారులను కలవకుండా అడ్డుకున్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, న్యాయం కోసం త్వరలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, కోర్టులోనే తేల్చుకుంటామని అధికారికంగా ప్రకటించింది.
ఇలా ఉండగా.. మీనాక్షి నటరాజన్ తెలంగాణ కేసుకు సంబంధించిన కీలక సమాచారాన్ని కాంగ్రెస్ పార్టీలోని కొందరు అంతర్గత నేతలే తమకు స్వయంగా అందించారని మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తన నామినేషన్ రద్దుపై స్వయంగా మీనాక్షి నటరాజన్ స్పందిస్తూ.. దేశంలో ప్రతిపక్షాల గొంతు నొక్కేసి, ఎలాగైనా ఏకపార్టీ పాలనను స్థాపించాలనే ఏకైక దురాలోచనతోనే బీజేపీ ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు.
కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 12 ఏళ్ళ పాలన పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మీడియాతో ప్రత్యేకంగా నిర్వహించిన చిట్ చాట్ లో సంచలన విషయాలు వెల్లడించారు. తెలంగాణలో వచ్చే ఎన్నికలలో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందన్నారు. ఇంకా ఈ చిట్ చాట్ లో అమిత్ షా దేశ రాజకీయాలు, నియోజకవర్గాలపునర్విభజన, మహిళా రిజర్వేషన్లు, దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ వ్యూహాలు సహా పలు కీలక, సంచలన విషయాలు చెప్పారు.
నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదన్న ఆయన.. డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల నుంచి వస్తున్న అభ్యంతరాలపై స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం లోక్‌సభలో ఆయా రాష్ట్రాలకు ఉన్న నిష్పత్తిని ఏమాత్రం దెబ్బతీయకుండా.. అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా 50 శాతం సీట్లు పెరిగేలా బిల్లులో పొందుపరిచినట్లు ఆయన వెల్లడించారు. అలాగే.. మహిళా రిజర్వేషన్ల పెంపు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ప్రస్తుతం పార్లమెంట్‌లో పెండింగ్‌లో ఉందని, అవసరమైన రాజకీయ మద్దతు లభించగానే దీనిని ఆమోదించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
ఇక దేశమంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానంపై మాట్లాడిన అమిత్ షా.. ప్రస్తుతం ఈ అంశంపై ఏర్పాటు చేసిన కమిటీ లోతుగా అధ్యయనం చేస్తోందని తెలిపారు. కమిటీ నివేదిక సమర్పించిన వెంటనే.. దానికి సంబంధించిన బిల్లుకు పార్లమెంట్‌లో అవసరమైన మద్దతు లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ఎన్డీఏ కూటమిలోని ప్రాంతీయ పార్టీల సంబంధాలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. జెడియు , టిడిపి, శివసేన సహా కూటమిలో ఉన్న భాగస్వామ్య పక్షాలన్నీ పూర్తి సంతృప్తితో ఉన్నాయని, తమ వల్ల ఏ ప్రాంతీయ పార్టీకీ ఎలాంటి ఇబ్బందీ లేదనీ అమిత్ షా చెప్పారు. అక్కడితో ఆగకుండా.. భవిష్యత్తులో కొత్తగా మరే ఇతర ప్రాంతీయ పార్టీని ఎన్డీఏ కూటమిలో చేర్చుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.
ముందు ముందు ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా సొంత బలంతో ఒంటరిగానే పోటీ చేసి అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని ప్రకటించారు. దక్షిణాది రాష్ట్రాలలో తెలంగాణపై తాము ప్రత్యేక దృష్టి సారించామన్న అమిత్ షా.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీతోనూ బీజేపీ పొత్తు పెట్టుకోదని, ఒంటరిగానే బరిలోకి దిగుతుందని కుండబద్దలు కొట్టేశారు. అలాగే.. పంజాబ్‌లో సైతం శిరోమణి అకాలీదళ్ సహా ఏ ఇతర పార్టీతోనూ పొత్తు ఉండదని, అక్కడ ఒంటరిగా పోటీ చేసి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తామని అన్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ తప్పనిసరిగా ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామని అమిత్ షా చెప్పారు. దేశ సరిహద్దు ప్రాంతాల భద్రతను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించబోతున్నామని, సరిహద్దులన్నింటినీ కట్టుదిట్టంగా ఆధునీకరిస్తామని పేర్కొన్నారు. మొత్తంగా.. మోదీ 12 ఏళ్ళ పాలన ముగిసిన వేళ అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్యలు అటు జాతీయ రాజకీయాల్లోనూ, ఇటు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
దేశంలో అత్యంత సుదీర్ఘ కాలం పాటు ప్రధానిగా పదవిలో కొనసాగిన రికార్డు ఇప్పడు నరేంద్రమోడీ పేరు మీద ఉంది. ఇప్పటి వరకూ భారత తొలి ప్రధాని జవహర్లాల్ పేరు మీద ఉన్న ఈ రికార్డును ప్రధాని మోడీ తిరగరాశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై, కేంద్రంలో అత్యంత సుదీర్ఘకాలం పాటు నిరవధికంగా దేశానికి సేవలు అందించిన ఏకైక ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న ఈ రికార్డును మోదీ బద్దలు కొట్టారు.
ఈ చారిత్రక ప్రస్థానంలో సరిగ్గా బుధవారం (జూన్ 10) నాటికి నరేంద్ర మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. బుధవారం (జూన్ 10) తో ప్రదాని మోడీ నెహ్రూను అధిగమించారు. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 14 ఏళ్లకు పైగా ప్రధానిగా సేవలు అందించినప్పటికీ.. ఆమె నిరంతరాయంగా ఆ పదవిలో కొనసాగలేదు. కానీ మోదీ మాత్రం 2014, 2019,2024 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు చారిత్రాత్మక విజయాలను అందుకొని, నిరవధికంగా ప్రధానిగా కొనసాగుతూ అప్రతిహతంగా దూసుకుపోతున్నారు.
ఈ అద్భుతమైన ఘనతను.. అలాగే కేంద్రంలో ఎన్డీఏ (NDA) ప్రభుత్వం విజయవంతంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక భారత్ మండపం లో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఆయనతో పాటు బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులు కూడా హాజరయ్యారు. అలాగే.. దేశవ్యాప్తంగా ఉన్న 22 ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మిత్రపక్షాల అధినేతలు ఈ వేడుకకు తరలివచ్చారు. ఈ చారిత్రక మైలురాయిని అందుకున్న ప్రధాని మోదీకి ఘనంగా అభినందనలు తెలుపుతూ ఎన్డీఏ కూటమి ఒక ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ సమావేశంలో గత 12 ఏళ్ల ప్రభుత్వ విజయాలు, భవిష్యత్తు కార్యాచరణ మరియు రాబోయే రాజకీయ వ్యూహాలపై చర్చించారు.
కొన్నిసార్లు శరీరంపై నీలం లేదా ఊదా రంగు మచ్చలు కనిపిస్తాయి. చాలా వరకు ఇలాంటి మచ్చలు ఏవైనా గాయాలు లేదా దెబ్బలు తగిలినప్పుడు బయటకు రక్తం కారడం, చర్మం దెబ్బ తినడం వంటివి జరగకపోయినా, చర్మం మీద నీలం రంగులో మచ్చలు మాత్రం ఏర్పడుతూ ఉంటాయి. కొందరికి ఎలాంటి గాయాలు అయినట్లు కూడా గుర్తుండదు. చాలామంది తరచుగా ఇది సాధారణమే అనుకుని నిర్లక్ష్యం చేస్తారు, కానీ కొన్ని సందర్భాల్లో, ఇది ఒక శరీరం లోపల ఏదో సమస్యకు సంకేతం కావచ్చని వైద్యులు చెబుతున్నారు. పదేపదే కారణం లేకుండా ఏర్పడే గాయాలను తేలికగా తీసుకోవడం మంచిది కాదని అంటున్నారు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే…
మచ్చలు ఎందుకు కనిపిస్తాయి?
కొన్నిసార్లు అధిక శారీరక శ్రమ లేదా తీవ్రమైన వ్యాయామం చర్మం కింద ఉండే చిన్న రక్తనాళాలను ప్రభావితం చేయగలదని నిపుణులు అంటున్నారు. కండరాలపై అధిక ఒత్తిడి ఈ నాళాలు చిట్లిపోవడానికి, చర్మం కింద రక్తం గడ్డకట్టడానికి కారణమవుతుంది, దీని ఫలితంగా నీలి రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇలా జరిగినప్పుడు ఆ వ్యక్తికి గాయం అయినట్టు తెలియకపోవచ్చు, కానీ మచ్చలు కనిపినస్తుంటాయి.
మందులు..
కొన్ని మందులు కూడా చర్మం మీద ఇలా నీలి రంగు మచ్చలకు కారణం కావచ్చు. రక్తాన్ని పల్చబరిచే మందులు, ముఖ్యంగా ఆస్పిరిన్, ఇబుప్రోఫెన్, నాప్రోక్సెన్ వంటివి, రక్తం మరింత త్వరగా గడ్డకట్టేలా చేస్తాయి. రక్తం సాధారణ వేగంతో గడ్డకట్టనప్పుడు, అది చర్మం కిందకు కారిపోయి, సులభంగా కమిలిపోతుంది. కొత్త మందులు తీసుకున్న తర్వాత ఈ సమస్య మొదలైతే వైద్యుడిని సంప్రదించడం ఎంతో ముఖ్యం.
పోషకాల లోపం..
కొన్ని ముఖ్యమైన పోషకాల లోపం కూడా ఈ సమస్యను తీవ్రతరం చేస్తుంది. విటమిన్ సి లోపం చర్మాన్ని, రక్తనాళాలను బలహీనపరిచి, చిన్న ఒత్తిడికే మచ్చలు ఏర్పడేలా చేస్తుంది. ఐరన్ లోపం రక్తనాళాలను ప్రభావితం చేస్తుంది, విటమిన్ కె లోపం రక్తం గడ్డకట్టడాన్ని నెమ్మదింపజేస్తుంది. అందువల్ల, ఎటువంటి కారణం లేకుండా పదేపదే నీలి మచ్చలు రావడం పోషకాహార లోపానికి సంకేతం కావచ్చట..
ఈ సమస్య ఉన్నవారికి ఎక్కువ ప్రమాదం..
ఇమ్యూన్ థ్రోంబోసైటోపెనియా వంటి అరుదైన సమస్యలలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గడానికి కారణమవుతాయి. రక్తం గడ్డకట్టడంలో ప్లేట్‌లెట్లు కీలక పాత్ర పోషిస్తాయి. వాటి లోపం వల్ల చర్మంపై అకస్మాత్తుగా నీలం లేదా ఊదా రంగు మచ్చలు ఏర్పడవచ్చు. కొన్ని సందర్భాల్లో, పదేపదే వచ్చే నీలం మచ్చలు నాన్-హాడ్కిన్స్ లింఫోమా లేదా ఇతర రక్త సంబంధిత సమస్యల వంటి తీవ్రమైన వైద్య పరిస్థితికి సంకేతం కావచ్చు. ఇది అరుదైనప్పటికీ, తీవ్రమైన అలసట, బరువు తగ్గడం లేదా తరచుగా రక్తస్రావం వంటి లక్షణాలతో పాటుగా ఉంటే వైద్యులను కలిసి పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం.
వైద్యుడిని ఎప్పుడు కలవాలి?
ఎటువంటి స్పష్టమైన గాయం లేకుండా శరీరంపై పదేపదే నీలి మచ్చలు కనిపిస్తే, ఆ మచ్చలు క్రమంగా పెద్దగా అవుతూ పరిమాణంలో పెరుగుతుంటే, తరచుగా ముక్కు నుండి రక్తం కారుతుంటే, లేదా ఆ రక్తస్రావం సులభంగా ఆగకపోతే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సకాలంలో వైద్య పరీక్ష చేయించుకోవడం వల్ల తీవ్రమైన అనారోగ్యాన్ని దాని ప్రారంభ దశలోనే గుర్తించి, వ3ఎలైనంత తొందరగా చికిత్సను ప్రారంభించవచ్చు.
*రూపశ్రీ
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో, మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది శరీరానికి కావలసిన పోషకాలను సరిగ్గా అందజేయలేకపోతున్నారు. ఈ క్రమంలో శరీరంలో విటమిన్లు, ఖనిజాల లోపాన్ని భర్తీ చేయడానికి చాలామంది ఆశ్రయించేది "మల్టీవిటమిన్ టాబ్లెట్లు" (Multivitamin Tablets). అయితే, ఈ టాబ్లెట్లను ఎప్పుడు వాడాలి? ఎలా వాడాలి? ఎక్కువగా వాడితే ఎలాంటి నష్టాలు జరుగుతాయి? అనే విషయాలపై ప్రముఖ వైద్యులు డాక్టర్ లక్ష్మి కోన గారు అందించిన పూర్తి వివరాలు ఈ VIDEO ద్వారా తెలుసుకుందాం.
మల్టీవిటమిన్ టాబ్లెట్ల ఉపయోగాలు (Uses of Multivitamins)
మన శరీరంలో వివిధ అవయవాలు సక్రమంగా పనిచేయడానికి, రోగనిరోధక శక్తి బలంగా ఉండటానికి విటమిన్లు ఎంతగానో తోడ్పడతాయి. మల్టీవిటమిన్ల వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలు:
పోషకాహార లోపాన్ని భర్తీ చేయడం: మనం తినే ఆహారంలో లోపించిన ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్‌ను ఇవి శరీరానికి అందిస్తాయి.
రోగనిరోధక శక్తి పెరుగుదల (Immunity Boost): విటమిన్ C, D, మరియు జింక్ వంటి పోషకాలు శరీరంలో ఇమ్యూనిటీని పెంచి, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి.
శక్తిని అందించడం (Energy Levels): విటమిన్ B-కాంప్లెక్స్ శరీరంలో ఆహారాన్ని శక్తి గా మార్చడంలో సహాయపడుతుంది, దీనివల్ల అలసట, నీరసం తగ్గుతాయి.
చర్మం, జుట్టు ఆరోగ్యం: విటమిన్ E, బయోటిన్ వంటివి చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి, జుట్టు రాలడాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి.
ఎముకల బలం: క్యాల్షియం మరియు విటమిన్ D కలిసిన మల్టీవిటమిన్లు ఎముకలను, దంతాలను దృఢంగా ఉంచుతాయి.
సరైన డోసేజ్ మరియు వేసుకునే విధానం (Correct Dosage & Guidelines)
మల్టీవిటమిన్లను ఎప్పుడు పడితే అప్పుడు, ఎన్ని పడితే అన్ని వేసుకోకూడదు. వాటికంటూ ఒక పద్ధతి ఉంటుంది:
మల్టీవిటమిన్ టాబ్లెట్లను సాధారణంగా ఉదయం లేదా मధ్యాహ్నం భోజనం తర్వాత వేసుకోవడం మంచిది. పరగడుపున (ఖాళీ కడుపుతో) వేసుకుంటే కొంతమందిలో కడుపులో మంట లేదా వికారం కలగవచ్చు.
కొన్ని విటమిన్లు (A, D, E, K) కొవ్వులో కరిగేవి (Fat-soluble vitamins). కాబట్టి, కొద్దిగా కొవ్వు పదార్థాలు ఉన్న ఆహారం తీసుకున్న తర్వాత వీటిని వేసుకుంటే శరీరం బాగా గ్రహిస్తుంది.
ఎల్లప్పుడూ డాక్టర్ సూచించిన డోస్ మాత్రమే వాడాలి. సొంత నిర్ణయాలతో రోజుకు ఒకటి కంటే ఎక్కువ టాబ్లెట్లు వేసుకోకూడదు.
జాగ్రత్త: మితిమీరిన విటమిన్ల వాడకం
చాలామంది మల్టీవిటమిన్లు ఆరోగ్యానికి మంచిదే కదా అని విపరీతంగా వాడుతుంటారు. కానీ, డాక్టర్ లక్ష్మి కోన గారి ప్రకారం, విటమిన్లు ఎక్కువైతే "విటమిన్ టాక్సిసిటీ" (Vitamin Toxicity / Hypervitaminosis) అనే ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుంది.
ముఖ్యంగా విటమిన్ A, D, E, K లు శరీరంలో పేరుకుపోయి కాలేయం (Liver) మరియు మూత్రపిండాల (Kidneys) పై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు, విటమిన్ D ఎక్కువైతే శరీరంలో క్యాల్షియం పెరిగిపోయి కిడ్నీలో రాళ్లు (Kidney Stones) ఏర్పడే అవకాశం ఉంది. అలాగే విటమిన్ A ఎక్కువైతే తలనొప్పి, వాంతులు మరియు కాలేయ సమస్యలు రావచ్చు.
దుష్ప్రభావాలు (Side Effects)
సాధారణంగా పరిమితికి లోబడి వాడినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ కొంతమందిలో క్రింది లక్షణాలు కనిపించవచ్చు:
కడుపులో అశాంతి, వికారం లేదా వాంతులు.
మలబద్ధకం (Constipation) లేదా విరేచనాలు (Diarrhea) - ముఖ్యంగా ఐరన్ (Iron) ఎక్కువగా ఉన్న మల్టీవిటమిన్ల వల్ల మలం నల్లగా రావడం మరియు మలబద్ధకం జరుగుతుంది.
నోటిలో వింత రుచి (Metallic Taste).
ఇతర మందులతో పరస్పర చర్యలు (Drug Interactions)
మీరు ఇప్పటికే ఇతర ఆరోగ్య సమస్యల కోసం మందులు వాడుతుంటే, మల్టీవిటమిన్లు వేసుకునే ముందు జాగ్రత్త వహించాలి:
యాంటీబయాటిక్స్: మల్టీవిటమిన్లలో ఉండే క్యాల్షియం, ఐరన్, జింక్ వంటి మినరల్స్ కొన్ని రకాల యాంటీబయాటిక్స్ (ఉదాహరణకు Tetracyclines) శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. కాబట్టి వీటి మధ్య కనీసం 2 గంటల వ్యవధి ఉండాలి.
బ్లడ్ థిన్నర్స్ (రక్తాన్ని పలచబరిచే మందులు): విటమిన్ K రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది. ఒకవేళ మీరు రక్తాన్ని పలచబరిచే మందులు (Warfarin వంటివి) వాడుతుంటే, విటమిన్ K ఉన్న మల్టీవిటమిన్లు వాటి పనితీరును దెబ్బతీస్తాయి.
చివరిగా:- మల్టీవిటమిన్ టాబ్లెట్లు అనేవి సమతుల్య ఆహారానికి ప్రత్యామ్నాయం కావు.. సహజసిద్ధమైన పండ్లు, కూరగాయలు, ఆకుకూరల ద్వారా వచ్చే పోషకాలే శరీరానికి అత్యంత శ్రేష్ఠమైనవి.
మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
గుండె మానవ శరీరంలో అత్యంత కీలకమైన అవయవం, ఇది శరీరమంతటికీ ఆక్సిజన్ , పోషకాలను అందించడానికి నిరంతరం రక్తాన్ని పంపింగ్ చేస్తుంది. అయితే, మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల గుండె జబ్బుల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గుండె సమస్యలు వచ్చే వారిలో మొదట్లోనే చిన్న చిన్న లక్షణాలుగా కనిపిస్తాయి. కానీ చాలామంది వీటిని పెద్దగా పట్టించుకోరు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ లక్షణాలను ముందుగానే గుర్తించడం వల్ల తీవ్రమైన గుండె జబ్బులను , గుండెపోటు వంటి ప్రాణాంతక పరిస్థితులను నివారించవచ్చు. శరీరంలో ఏ లక్షణాలు గుండె జబ్బులను సూచిస్తాయో.. ఆ లక్షణాలు మీకు ఉన్నాయేమో ఒక్కసారి చెక్ చేస్కోండి..
ఛాతీ నొప్పి..
ఛాతీ నొప్పి, బిగుతుగా అనిపించడం, బరువుగా ఉండటం లేదా ఒత్తిడి వంటివి గుండె జబ్బు అత్యంత సాధారణ లక్షణాలు. ఈ నొప్పి కొన్ని నిమిషాల పాటు ఉండవచ్చు లేదా పదేపదే రావచ్చు. కొన్నిసార్లు ఈ నొప్పి భుజం, మెడ, వీపు లేదా చేతికి కూడా వ్యాపించవచ్చు. ఇలా పదేపదే జరుగుతుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
ఊపిరి ఆడకపోవడం..
మెట్లు ఎక్కేటప్పుడు విపరీతమైన అలసటగా లేదా ఆయాసంగా అనిపిస్తే, అది గుండె బలహీనతకు సంకేతం కావచ్చు. గుండె సరిగ్గా రక్తాన్ని పంప్ చేయలేనప్పుడు, ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరిగి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది.
అలసట, బలహీనత..
విశ్రాంతి తీసుకున్నప్పటికీ నిరంతరం అలసటగా అనిపిస్తుంటే, దానిని సాధారణ బలహీనతగా భావించి నిర్లక్ష్యం చేయకూడదు. గుండె పనితీరు తగ్గినప్పుడు, శరీర భాగాలకు తగినంత ఆక్సిజన్ అందదు, దీనివల్ల అలసట , నీరసం ఏర్పడుతుంది.
హృదయ స్పందన..
గుండె కొట్టుకునే వేగంలో ఆకస్మిక పెరుగుదల లేదా తగ్గుదల గుండె సమస్యకు సంకేతం కావచ్చు. ఈ పరిస్థితి పదేపదే ఏర్పడుతుంటే వైద్య పరీక్ష చేయించుకోవడం చాలా అవసరం.
*రూపశ్రీ.
