వైసీపీ గ్రాఫ్ మరింత పతనం.. సీఓటర్ సర్వే ఏం చెప్పిందంటే?

Publish Date:Feb 5, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రెడ్డి రాజకీయం అంతా బెదరింపులు, దబాయింపులేనా? అధికారంలో ఉన్నా, లేకపోయినా ఆయన తీరు మారదా? యధా జగన్.. తథా వైసీపీ అన్నట్లుగా ఆ పార్టీ నేతలూ, కార్యకర్తలూ అలాగే వ్యవహరిస్తారా? అంటే పరిశీలకులే కాదు, జనబాహుల్యం కూడా ఔననే అంటున్నది. ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన తరువాత ఐదేళ్ల పాటు జగన్ పాలనతో విసిగిపోయిన ఏపీ ప్రజలు  గత ఎన్నికలలో ఆయనను ఛీకొట్టారు. కేవలం 11 స్థానాలను మాత్రమే ఇచ్చి ప్రతిపక్షనేతగా జగన్ కు, ప్రతిపక్ష పార్టీగా వైసీపీకి అర్హత లేదని తమ ఓటు ద్వారా కుండబద్దలు కొట్టారు.  

ఇందుకు ప్రధాన కారణం జగన్ పాలన, , బూతులు వినా మరో భాష తెలియదన్నట్లుగా వ్యవహరించిన ఈ పార్టీ నేతల తీరు కారణమనడంలో సందేహం లేదు.  జగన్ హయాంలో  అప్ప‌టి విప‌క్ష నాయ‌కుడు, ప్ర‌స్తుత సీఎం చంద్ర‌బాబు కుటుంబంపై చేసిన దారుణ వ్యాఖ్య‌లు కారణమనడంలో సందేహం లేదు. అంతే కాకుండా జగన్ హయాం అంతా దౌర్జన్యాలు,    దౌర్జ‌న్యాలు, గంట, అరగంట అంటూ మహిళలతో ఫోన్ లలో అసభ్య సంభాషణలు న్యూడ్ వీడియోలు,హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన ఘటనలు, అటువంటి వారిని అక్కున చేర్చుకున్న జగన్ తీరు, ఇదేమిటని ప్రశ్నిస్తే దాడులు, కేసులు.ఇలా జగన్ హయాంలో రాష్ట్రంలో ఏ వర్గమూ సంతోషంగా, భద్రంగా లేని పరిస్థితే గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయానికి కారణం.  అయితే అంతటి ఘోర పరాజయం తరువాత కూడా జగన్ తీరు ఇసుమంతైనా మారలేదని.. ఈ పద్దెనిమిది నెలల కాలంలో తేలిపోయింది.  ఇప్పటికీ వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ   బెదిరింపుల రాజ‌కీయాలనే నమ్ముకుంది. 

చంద్ర‌బాబు, మంత్రి లోకేష్‌ల‌పై దారుణ‌మైన వ్యాఖ్య‌ల‌తో మాజీ మంత్రులు అంబ‌టి రాంబాబు, జోగి ర‌మేష్‌, పేర్ని నాని విరుచుకుప‌డుతున్న తీరు   అదే సూచిస్తోంది.  చంద్రబాబుపై బూతులతో రెచ్చిపోయి అరెస్టైన అంబటి రాంబాబుకు మద్దతుగా, ఆయన కుటుంబ సభ్యుల పరామర్శ పేర జగన్ గుంటూరు పర్యటనలో జగన్ దబాయింపులు, బెదరింపులతో రెచ్చిపోయారు. తాము అధికారంలోకి వస్తే వడ్డీతో సహా చెల్లిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు.   ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప్ర‌తి విష‌యాన్నీ రాసి పెట్టుకుంటున్నామన్నారు.  

అయితే జగన్ తీరు పట్ల, ధోరణి పట్ల ప్రజలలోనే కాదు, వైసీపీలోనే అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం అవుతోంది.  జగన్ ఈ ధోరణే రాష్ట్రంలో వైసీపీ గ్రాఫ్ అంతకంతకూ దిగజారిపోవడానికి కారణమౌతోంది. తాజాగా ఇండియాటుడే సీఓటర్ నిర్వహించిన సర్వేలో గత ఎన్నికలలో కంటే, ఇప్పుడు జగన్ పట్ల, వైసీపీ పట్ల ప్రజా వ్యతిరేకత మరింతగా పెరిగిందని తేలింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, వైసీపీకి 2024 ఎన్నికలలో వచ్చినన్ని సీట్లు, ఓట్లు వచ్చే అవకాశం ఇసుమంతైనా లేదని కుండబద్దలు కొట్టింది. గత ఎన్నికలలో 40 శాతం ఓట్లు వచ్చాయని చెప్పుకుంటున్న ఆ పార్టీకి ఇప్పుడు ఎన్నికలు జరిగితే అప్పటి కంటే చాలా తక్కువ శాతం ఓట్లు పడతాయని ఆ సర్వే పేర్కొంది. ఇప్పటికైనా జగన్ తీరు మారకుంటే.. వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ మనుగడ ప్రశ్నార్థకం అయ్చే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.  

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదిక పదకొండవ సంచికలో ఘాటైన చర్చ జరిగింది.
రాష్ట్రంలో కులచిచ్చు రేపేందుకు వైసీపీ చేస్తున్న దుష్టయత్నాలను మొగ్గలోనే తుంచేయాలని వీరిరువు అభిప్రాయపడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, విపక్షం విసిరే కులపరమైన ట్రాప్‌లో పడకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, ఆ మేరకు క్యాడర్ కు కూడా తగు సూచనలు చేయాలని వీరిరువురూ నిర్ణయించినట్లు తెలిసింది.
ఆ పదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పట్టుబడుతోంది. దీనిపై గతంలోనే స్పీకర్ కు ఫిర్యాదు చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. కాగా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ బీఆర్ఎస్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. బీఆర్ఎస్ పిటిషన్ ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం నిర్దుష్టగడువులోగా ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ ను ఆదేశించిన సంగతి విదితమే.
పవన్ కల్యాణ్ తెలంగాణ మునిసిపోల్స్ లో జనసేన బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. బీజేపీ అభ్యర్థుల తరఫున తాను స్వయంగా ప్రచారంలో పాల్గొంటానని తెలిపారు.
జనసేన పార్టీ తెలంగాణ మునిసిపోల్స్ లో పోటీ చేయనున్నట్లు ప్రకటించడమే కాదు, అభ్యర్థులను కూడా ప్రకటించి ప్రచారానికి సైతం రెడీ అయ్యింది. సరిగ్గా ఇటువంటి తరుణంలో బీజేపీ నేత రామచంద్రరావు , కిషన్ రెడ్డిపవన్ కల్యాణ్‌తో భేటీ అవ్వడం, జనసేన మునిసిపోల్స్ లో బీజేపీకి మద్దతు ప్రకటించిందనీ, జనసేనాని స్వయంగా ప్రచారంలో కూడా పాల్గొంటారంటూ ప్రకటన ఇవ్వడం జనసేన వర్గాలలో అసంతృప్తికి కారణమైంది.
శాంతి భద్రతల పరిరక్షణలో ఏపీలోని చంద్రబాబు సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం తమపై ఆధారపడి ఉందన్న అహంభావంతో. ఏం చేసినా చెల్లుతుందనే ధోరణితో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాణి అనుచిత వ్యాఖ్యలు చేశారని, దుర్భాషలాడారని కాకాణిపై తెలుగుదేశం నేతలు చేసిన ఫిర్యాదు మేరకు ఈ నోటీసులు అందజేశారు.
గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన అమర్‌నాథ్‌ను హెసీఏ అధ్యక్షుడిగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ను బ్లాక్‌మెయిల్‌ చేశారన్న ఆరోపణలు రావడం, సీఐడీ అరెస్టు నేపథ్యంలో జగన్మోహన్‌రావును ఇంతకుముందే హెచ్‌సీఏ సస్పెండ్‌ చేసింది.
కాపు సామాజికవర్గ నాయకులను వైసీపీ కేవలం ఓటు యంత్రాలుగా, అవసరానికి వాడుకునే సాధనాలుగా మాత్రమే చూస్తోందన్నారు. గతంలో కాపు రిజర్వేషన్లను జగన్ రద్దు చేస్తున్న సమయంలో అంబటి నోరెత్తకపోవడాన్ని ఆయన ఆఈ సందర్భంగా గుర్తు చేశారు.
సీట్ల పంపకంలో.. తన గొంతు కోశారని, కాంగ్రెస్ అధిష్ఠానం తన వర్గానికి న్యాయం చేయలేదని జీవన్ రెడ్డి తన అనుచరుల ఎదుట ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 50 వార్డులు ఉండగా.. 29 టికెట్లు బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే ఎం.సంజయ్ కుమార్ వర్గానికి, 21 టికెట్లు జీవన్ రెడ్డి వర్గానికి పార్టీ అధిష్ఠానం కేటాయించినట్లు సమాచారం.
రాష్ట్రంలో మూడు పార్టీల కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందంటూ.. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో ప్రభుత్వ గళాన్ని వినిపించడంలో జనసేన నేతలు ఉదాశీనంగా వ్యవహరించడంపై మండి పడ్డారు. ఎవరి పేరూ ఎత్తకపోయినా, ఆయన మాట్లాడిన మాటలను బట్టి ఆయన తన సోదరుడు నాగబాబుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారని అర్ధమౌతోంని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అయితే తాను ఆలయంలోకి వెళ్లి శుద్ధి కార్యక్రమం చేస్తానని ఆమె పట్టుబట్టడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దశలో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేశారు. ఈ క్రమంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించారంటూ విడదల రజని, ఆమె అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు పదును పెడుతోంది. అమెరికా పర్యటన నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పటికే పార్టీ శ్రేణులతో రెండు సార్లు జూమ్ సమావేశాలు నిర్వహించారు. ఎన్నికలలో విజయమే లక్ష్యంగా పని చేయాలని దిశా నిర్దేశం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.