ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కు భారీ ఊరట లభించింది. ఆయన పార్టీ మారారు అనేందుకు సరైన ఆధారాలు లేవని తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ పేర్కొంటూ.. ఆయనపై బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేశారు. దీంతో పార్టీ ఫిరాయింపు విషయంలో పది మంది ఎమ్మెల్యేలలో ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేలకు ఊరట లభించినట్లైంది. ఇక దానం నాగేందర్, కడియం శ్రీహరిల విషయంలో మాత్రమే స్పీకర్ తన తీర్పు వెలువరించాల్సి ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ టికెట్ పై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి ఫిరాయించినట్లు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
ఆ పదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పట్టుబడుతోంది. దీనిపై గతంలోనే స్పీకర్ కు ఫిర్యాదు చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. కాగా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ బీఆర్ఎస్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. బీఆర్ఎస్ పిటిషన్ ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం నిర్దుష్టగడువులోగా ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ ను ఆదేశించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే స్పీకర్ గడ్డం ప్రసాద్ ఒకరి తరువాత ఒకరిగా ఫిరాయింపు ఆరోపణలను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను విచారించి తీర్పులు వెలువరిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి ఫిరాయించారనడానికి ఆధారాలు లేవంటూ క్లీన్ చిట్ ఇవ్వడంతో ఇప్పటి వరకూ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలలో ఎనిమిది మంది విషయంలో వారు పార్టీ ఫిరాయించినట్లు ఆధారాలు లేవంటూ తీర్పులు వెలువరించారు.
ఇక స్పీకర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇలా ఉండగా సుప్రీం కోర్టు స్పీకర్ ను నిర్దుష్టగడువులోగా నిర్ణయం తీసుకోవాలని మాత్రమే ఆదేశించింది. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నది స్పీకర్ విచక్షణే. ఎందుకంటే బీఆర్ఎస్ స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని మాత్రమే సుప్రీం ను ఆదేశించింది.
ఆయన నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని మాత్రమే బీఆర్ఎస్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో కోరింది. ఆ మేరకే సుప్రీం కోర్టు కూడా గవర్నర్ నిర్దుష్టగడువులోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఇక స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ కు అభ్యంతరాలు ఉంటే ఆ పార్టీ సుప్రీంలో మరో పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/speaker-clean-chit-to-jagityal-mal-25-213508.html
తెలుగువన్ వాస్తవ వేదిక పదకొండవ సంచికలో ఘాటైన చర్చ జరిగింది.
జగన్ హయాంలో అప్పటి విపక్ష నాయకుడు, ప్రస్తుత సీఎం చంద్రబాబు కుటుంబంపై చేసిన దారుణ వ్యాఖ్యలు కారణమనడంలో సందేహం లేదు. అంతే కాకుండా జగన్ హయాం అంతా దౌర్జన్యాలు, దౌర్జన్యాలు, గంట, అరగంట అంటూ మహిళలతో ఫోన్ లలో అసభ్య సంభాషణలు న్యూడ్ వీడియోలు,హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన ఘటనలు, అటువంటి వారిని అక్కున చేర్చుకున్న జగన్ తీరు, ఇదేమిటని ప్రశ్నిస్తే దాడులు, కేసులు.ఇలా జగన్ హయాంలో రాష్ట్రంలో ఏ వర్గమూ సంతోషంగా, భద్రంగా లేని పరిస్థితే గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయానికి కారణం.
రాష్ట్రంలో కులచిచ్చు రేపేందుకు వైసీపీ చేస్తున్న దుష్టయత్నాలను మొగ్గలోనే తుంచేయాలని వీరిరువు అభిప్రాయపడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, విపక్షం విసిరే కులపరమైన ట్రాప్‌లో పడకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, ఆ మేరకు క్యాడర్ కు కూడా తగు సూచనలు చేయాలని వీరిరువురూ నిర్ణయించినట్లు తెలిసింది.
పవన్ కల్యాణ్ తెలంగాణ మునిసిపోల్స్ లో జనసేన బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. బీజేపీ అభ్యర్థుల తరఫున తాను స్వయంగా ప్రచారంలో పాల్గొంటానని తెలిపారు.
జనసేన పార్టీ తెలంగాణ మునిసిపోల్స్ లో పోటీ చేయనున్నట్లు ప్రకటించడమే కాదు, అభ్యర్థులను కూడా ప్రకటించి ప్రచారానికి సైతం రెడీ అయ్యింది. సరిగ్గా ఇటువంటి తరుణంలో బీజేపీ నేత రామచంద్రరావు , కిషన్ రెడ్డిపవన్ కల్యాణ్‌తో భేటీ అవ్వడం, జనసేన మునిసిపోల్స్ లో బీజేపీకి మద్దతు ప్రకటించిందనీ, జనసేనాని స్వయంగా ప్రచారంలో కూడా పాల్గొంటారంటూ ప్రకటన ఇవ్వడం జనసేన వర్గాలలో అసంతృప్తికి కారణమైంది.
శాంతి భద్రతల పరిరక్షణలో ఏపీలోని చంద్రబాబు సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం తమపై ఆధారపడి ఉందన్న అహంభావంతో. ఏం చేసినా చెల్లుతుందనే ధోరణితో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాణి అనుచిత వ్యాఖ్యలు చేశారని, దుర్భాషలాడారని కాకాణిపై తెలుగుదేశం నేతలు చేసిన ఫిర్యాదు మేరకు ఈ నోటీసులు అందజేశారు.
గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన అమర్‌నాథ్‌ను హెసీఏ అధ్యక్షుడిగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ను బ్లాక్‌మెయిల్ చేశారన్న ఆరోపణలు రావడం, సీఐడీ అరెస్టు నేపథ్యంలో జగన్మోహన్‌రావును ఇంతకుముందే హెచ్‌సీఏ సస్పెండ్ చేసింది.
కాపు సామాజికవర్గ నాయకులను వైసీపీ కేవలం ఓటు యంత్రాలుగా, అవసరానికి వాడుకునే సాధనాలుగా మాత్రమే చూస్తోందన్నారు. గతంలో కాపు రిజర్వేషన్లను జగన్ రద్దు చేస్తున్న సమయంలో అంబటి నోరెత్తకపోవడాన్ని ఆయన ఆఈ సందర్భంగా గుర్తు చేశారు.
సీట్ల పంపకంలో.. తన గొంతు కోశారని, కాంగ్రెస్ అధిష్ఠానం తన వర్గానికి న్యాయం చేయలేదని జీవన్ రెడ్డి తన అనుచరుల ఎదుట ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 50 వార్డులు ఉండగా.. 29 టికెట్లు బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే ఎం.సంజయ్ కుమార్ వర్గానికి, 21 టికెట్లు జీవన్ రెడ్డి వర్గానికి పార్టీ అధిష్ఠానం కేటాయించినట్లు సమాచారం.
రాష్ట్రంలో మూడు పార్టీల కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందంటూ.. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో ప్రభుత్వ గళాన్ని వినిపించడంలో జనసేన నేతలు ఉదాశీనంగా వ్యవహరించడంపై మండి పడ్డారు. ఎవరి పేరూ ఎత్తకపోయినా, ఆయన మాట్లాడిన మాటలను బట్టి ఆయన తన సోదరుడు నాగబాబుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారని అర్ధమౌతోంని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అయితే తాను ఆలయంలోకి వెళ్లి శుద్ధి కార్యక్రమం చేస్తానని ఆమె పట్టుబట్టడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దశలో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేశారు. ఈ క్రమంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించారంటూ విడదల రజని, ఆమె అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు పదును పెడుతోంది. అమెరికా పర్యటన నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పటికే పార్టీ శ్రేణులతో రెండు సార్లు జూమ్ సమావేశాలు నిర్వహించారు. ఎన్నికలలో విజయమే లక్ష్యంగా పని చేయాలని దిశా నిర్దేశం చేశారు.