తెలంగాణ మునిసిపోల్స్ లో జనసేనాని పవన్ కల్యాణ్ బీజేపీకి మద్దతు ప్రకటించారు. ఈ విషయాన్నితెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు స్వయంగా ప్రకటించారు. అంతకు ముందు మంగళవారం (ఫిబ్రవరి 3) రాత్రి వీరిరువురూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. ఆ భేటీ తరువాత బీజేపీ నుంచి జనసేన మద్దతు, పవన్ కల్యాణ్ ప్రచారం ప్రకటన వెలువడింది.
వాస్తవానికి జనసేన పార్టీ తెలంగాణ మునిసిపోల్స్ లో పోటీ చేయనున్నట్లు ప్రకటించడమే కాదు, అభ్యర్థులను కూడా ప్రకటించి ప్రచారానికి సైతం రెడీ అయ్యింది. సరిగ్గా ఇటువంటి తరుణంలో బీజేపీ నేత రామచంద్రరావు , కిషన్ రెడ్డిపవన్ కల్యాణ్‌తో భేటీ అవ్వడం, జనసేన మునిసిపోల్స్ లో బీజేపీకి మద్దతు ప్రకటించిందనీ, జనసేనాని స్వయంగా ప్రచారంలో కూడా పాల్గొంటారంటూ ప్రకటన ఇవ్వడం జనసేన వర్గాలలో అసంతృప్తికి కారణమైంది.
ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే పొత్తుల గురించి బీజేపీ ఎలాంటి చొరవ తీసుకోలేదు సరికదా, తెలంగాణ మునిసిపోల్స్ లో తమ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ప్రకటన కూడా చేసింది. ఇప్పుడు అభ్యర్థులు నామినేషన్లు కూడా దాఖలు చేసిన తరువాత పవన్ కల్యాణ్ బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారన్న బీజేపీ ప్రకటన తెలంగాణలో జనసేన ఉనికినే ప్రశ్నార్థకం చేసినట్లైంది. సొంత పార్టీ నేతలు బరిలో ఉండగా వారిని కాదని పవన్ కల్యాణ్ బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారానికి రావడమేంటన్న విస్మయం రాజకీయ పరిశీలకుల్లో కూడా వ్యక్తం అవుతోంది.
అదలా ఉంటే పవన్ కల్యాణ్ ప్రచారం విషయాన్ని బీజేపీ అధికారికంగా ప్రకటించింది కానీ ఈ విషయంపై పవన్ కల్యాణ్ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. ఈ నేపథ్యంలోనే జనసేన క్యాడర్ పవన్ కషాయ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారన్నబీజేపీ ఏకపక్ష ప్రకటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.సరే తెలంగాణలో జనసేన, బీజేపీల మధ్య పొత్తు లేదు. అయినా పవన్ కల్యాణ్ బీజేపీ తరఫున తెలంగాణ మునిసిపోల్స్ లో ప్రచారం చేస్తే.. బరిలో ఉన్న జనసేన అభ్యర్థుల పరిస్థితి ఏమిటన్న గందరగోళం నెలకొంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-municipal-polls-25-213490.html
తెలుగువన్ వాస్తవ వేదిక పదకొండవ సంచికలో ఘాటైన చర్చ జరిగింది.
జగన్ హయాంలో అప్పటి విపక్ష నాయకుడు, ప్రస్తుత సీఎం చంద్రబాబు కుటుంబంపై చేసిన దారుణ వ్యాఖ్యలు కారణమనడంలో సందేహం లేదు. అంతే కాకుండా జగన్ హయాం అంతా దౌర్జన్యాలు, దౌర్జన్యాలు, గంట, అరగంట అంటూ మహిళలతో ఫోన్ లలో అసభ్య సంభాషణలు న్యూడ్ వీడియోలు,హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన ఘటనలు, అటువంటి వారిని అక్కున చేర్చుకున్న జగన్ తీరు, ఇదేమిటని ప్రశ్నిస్తే దాడులు, కేసులు.ఇలా జగన్ హయాంలో రాష్ట్రంలో ఏ వర్గమూ సంతోషంగా, భద్రంగా లేని పరిస్థితే గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయానికి కారణం.
రాష్ట్రంలో కులచిచ్చు రేపేందుకు వైసీపీ చేస్తున్న దుష్టయత్నాలను మొగ్గలోనే తుంచేయాలని వీరిరువు అభిప్రాయపడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, విపక్షం విసిరే కులపరమైన ట్రాప్‌లో పడకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, ఆ మేరకు క్యాడర్ కు కూడా తగు సూచనలు చేయాలని వీరిరువురూ నిర్ణయించినట్లు తెలిసింది.
ఆ పదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పట్టుబడుతోంది. దీనిపై గతంలోనే స్పీకర్ కు ఫిర్యాదు చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. కాగా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ బీఆర్ఎస్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. బీఆర్ఎస్ పిటిషన్ ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం నిర్దుష్టగడువులోగా ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ ను ఆదేశించిన సంగతి విదితమే.
పవన్ కల్యాణ్ తెలంగాణ మునిసిపోల్స్ లో జనసేన బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. బీజేపీ అభ్యర్థుల తరఫున తాను స్వయంగా ప్రచారంలో పాల్గొంటానని తెలిపారు.
శాంతి భద్రతల పరిరక్షణలో ఏపీలోని చంద్రబాబు సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం తమపై ఆధారపడి ఉందన్న అహంభావంతో. ఏం చేసినా చెల్లుతుందనే ధోరణితో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాణి అనుచిత వ్యాఖ్యలు చేశారని, దుర్భాషలాడారని కాకాణిపై తెలుగుదేశం నేతలు చేసిన ఫిర్యాదు మేరకు ఈ నోటీసులు అందజేశారు.
గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన అమర్‌నాథ్‌ను హెసీఏ అధ్యక్షుడిగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ను బ్లాక్‌మెయిల్ చేశారన్న ఆరోపణలు రావడం, సీఐడీ అరెస్టు నేపథ్యంలో జగన్మోహన్‌రావును ఇంతకుముందే హెచ్‌సీఏ సస్పెండ్ చేసింది.
కాపు సామాజికవర్గ నాయకులను వైసీపీ కేవలం ఓటు యంత్రాలుగా, అవసరానికి వాడుకునే సాధనాలుగా మాత్రమే చూస్తోందన్నారు. గతంలో కాపు రిజర్వేషన్లను జగన్ రద్దు చేస్తున్న సమయంలో అంబటి నోరెత్తకపోవడాన్ని ఆయన ఆఈ సందర్భంగా గుర్తు చేశారు.
సీట్ల పంపకంలో.. తన గొంతు కోశారని, కాంగ్రెస్ అధిష్ఠానం తన వర్గానికి న్యాయం చేయలేదని జీవన్ రెడ్డి తన అనుచరుల ఎదుట ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 50 వార్డులు ఉండగా.. 29 టికెట్లు బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే ఎం.సంజయ్ కుమార్ వర్గానికి, 21 టికెట్లు జీవన్ రెడ్డి వర్గానికి పార్టీ అధిష్ఠానం కేటాయించినట్లు సమాచారం.
రాష్ట్రంలో మూడు పార్టీల కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందంటూ.. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో ప్రభుత్వ గళాన్ని వినిపించడంలో జనసేన నేతలు ఉదాశీనంగా వ్యవహరించడంపై మండి పడ్డారు. ఎవరి పేరూ ఎత్తకపోయినా, ఆయన మాట్లాడిన మాటలను బట్టి ఆయన తన సోదరుడు నాగబాబుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారని అర్ధమౌతోంని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అయితే తాను ఆలయంలోకి వెళ్లి శుద్ధి కార్యక్రమం చేస్తానని ఆమె పట్టుబట్టడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దశలో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేశారు. ఈ క్రమంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించారంటూ విడదల రజని, ఆమె అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు పదును పెడుతోంది. అమెరికా పర్యటన నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పటికే పార్టీ శ్రేణులతో రెండు సార్లు జూమ్ సమావేశాలు నిర్వహించారు. ఎన్నికలలో విజయమే లక్ష్యంగా పని చేయాలని దిశా నిర్దేశం చేశారు.