పెళ్లి ముసుగులో మోసం... అమ్మాయిలూ జర జాగ్రత్త.. సీపీ సజ్జనార్

Publish Date:Feb 23, 2026

Advertisement

పెళ్లి ముసుగులో ప్రమాదం పొంచి ఉందంటూ హైదరాబాద్ సీపీ సజ్జనార్ అమ్మాయిలను హెచ్చరించారు.  ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో షేర్ చేసిన పోస్టులో ఆయన..   కేవలం ప్రేమ పేరుతోనే కాదు, పెద్దలు కుదిర్చిన సంబం ధాల మాటున కూడా కొందరు నయవంచకులు యువతులను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలపై ఇటీవల హైదరాబాద్ షీ టీమ్స్‌కు ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు  వస్తున్నాయని పేర్కొన్నారు. 

పెళ్లి పేరుతో జరుగుతున్న మోసం గురించి ఆయన తన పోస్టులో సవివరంగా తెలియజేశారు.   సంప్రదాయం ప్రకారం పెళ్లి చూపులు, ఆపై ఎంగేజ్‌మెంట్ జరిగిన తరువాత.. పెళ్లి ఖాయమైంది కదా అనే చనువుతో యువతులకు దగ్గరై.. ఆ తరువాత ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి, అక్కడ నుంచి  పెళ్లి పీటలు ఎక్కాలంటే తమకు భారీగా డబ్బు కావాలని, అదనపు కట్నం ఇస్తేనే తాళి కడతామని  లేదంటే పెళ్లి రద్దు చేసుకుంటామని బెదిరింపులకు పాల్పడు తున్నారని హైదరాబాద్ సిపి సజ్జనార్  పేర్కొన్నారు.

నిశ్చితార్థం జరిగిపోవడం, బంధు మిత్రులందరికీ తెలిసిపో వడంతో..   పెళ్లి ఆగిపోతే సమాజంలో  పరువు   పోతుందన్న భయంతో చాలా మంది యువతులు, వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారనీ.. ఈ బలహీనతనే ఆయుధంగా భావిస్తున్న మోసగాళ్లు రెచ్చిపోతున్నారనీ ఆయన హెచ్చరించారు.    పరువు పోతుందని భయపడి మౌనంగా ఉంటే, జీవితాంతం నరకం అను భవించాల్సి వస్తుందని పేర్కొన్న ఆయన నిశ్చితార్థం అయినా సరే..  పెళ్లి పీటలు ఎక్కేవరకు అప్రమత్తంగా ఉండాలని సిపి సూచించారు.

పెద్దలు కుదిర్చిన సంబంధమే కదా అని గుడ్డిగా నమ్మొద్దని సూచించారు. ముందుగా అబ్బాయి ప్రవర్తన, స్నేహితులు, అలవాట్లపై ఆరా తీయాలనీ, అలాగే  పెళ్లికి ముందే ఏకాంతంగా కలవడానికి, శారీరక సంబంధానికి ఒత్తిడి చేస్తే కచ్చితంగా అనుమానించాలని పేర్కొన్నారు.   డబ్బు డిమాండ్ చేసినా, బ్లాక్ మెయిల్ చేసినా భయపడవద్దనీ, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలనీ సజ్జనార్ ఆ పోస్టులో పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామనీ,  ఇలాంటి సమస్యలు ఎదురైతే వెంటనే హైదరాబాద్ షీ టీమ్స్ వాట్సాప్ నంబర్ 9490616555కు లేదా 100 కు  కాల్ చేయండి అంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్  ఎక్స్ లో పోస్ట్ చేశారు.

By
en-us Political News

  
ఇరాన్ పై అమెరికా ఏ క్షణమైనా దాడి చేయవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ సిటిజన్స్ కు అక్కడి భారత ఎంబసీ కూడా అడ్వైజరీ జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌లో ఉంటున్న ఏపీ విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు, ఇతర ప్రవాసులు క్షేమంగా స్వస్థలాలకు చేరుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఓ ప్రకటనలో కోరారు.
దాదాపు రెండు అడుగుల మేరకు మంచు పేరుకుపోయింది. న్యూయార్క్ నగరంలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. పలు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు
సరోగసీ పేరుతో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో అరెస్టైన డాక్టర్ నమ్రత కేసులో మరో కీలక మలుపు తిరిగింది.
తెలంగాణ మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది
సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయలు తీసుకున్నారు.
అసెంబ్లీకి రమ్మని ఎవ్వరూ బొట్టు పెట్టి పిలవరని మంత్రి లోకేశ్ వైసీపీ ఎమ్మెల్యేలకు చురకలంటించారు.
ప్రపంచ దేశాలను వణికించిన మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా డాన్, జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ అధినేత నెమెసియో ఒసెగుయెరా అలియాస్ ఎల్ మెంచో కథ ముగిసింది.
ట్రంప్ ఎడాపెడా విధించిన టారిఫ్‌లు చెల్లవని అక్కడి సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపధ్యంలో రేపటి నుంచి వాటి వసూళ్లు నిలిపివేయనున్నారు.
ప్రపంచం మరో పెను ప్రమాదం ముంగిట ఉందా? రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కేవలం రెండు దేశాల సరిహద్దు పోరాటం కాదా? అనే ప్రశ్న తలెత్తుతుంది
భారత్ వాయుసేనలోని మరో తేజస్ యుద్ధ విమానం ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది.
దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లోని కేజీబీవీ పాఠశాలల్లో అడ్మిషన్లు, ఫలితాలు అద్భుతంగా ఉన్నాయన్న మంత్రి గత రెండు సంవత్సరాలుగా ఫలితాల్లో గణనీయమైన మెరుగుదల కనిపిస్తోందని చెప్పారు.
నిన్న మ్యాచ్‌లో అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను తీసుకోవడంపై కోచ్ గంభీర్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.