వైమానిక దాడుల్లో వందల మంది ఐసిస్ ఉగ్రవాదులు హతం

Publish Date:May 19, 2026

Advertisement

పశ్చిమాఫ్రికా దేశమైన నైజీరియాలో ఇస్లామిక్ స్టేట్ ( ఉగ్రవాద సంస్థకు  భారీ నష్టం వాటిల్లింది. ఆ దేశ ఈశాన్య సరిహద్దు ప్రాంతాల్లో అమెరికా సైనిక విభాగం, నైజీరియా రక్షణ దళాలు సంయుక్తంగా నిర్వహించిన వైమానిక దాడుల్లో   175 మందికి పైగా ఐసిస్ ఉగ్రవాదులు హతమయ్యారు.  ఈ విషయాన్ని   నైజీరియా సైనిక ప్రతినిధి   అధికారిక ప్రకటన ద్వారా ధృవీకరించారు.   నిర్దేశిత ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా సాగిన ఈ ఆపరేషన్‌లో వందలాది మంది ఐసీస్ ఉగ్రవాదులు హతమవ్వడమే కాకుండా.. వారి రక్షణ నిలిచే అనేక రహస్య చెక్‌పోస్టులు కూడా నేలమట్టమయ్యాయని ఆ ప్రకటన పేర్కొంది. 

అలాగే..  ఉగ్రవాదులకు చెందిన  భారీ ఆయుధ డిపోలు, కీలకమైన లాజిస్టిక్స్ కేంద్రాలను వైమానిక దళాలు పూర్తిగా ధ్వంసం చేశాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు గట్టి ఊతాన్నిచ్చే ఆర్థిక వనరుల వ్యవస్థను, నిధుల సరఫరా నెట్‌వర్క్ ప్రధాన కార్యాలయాలను సైతం ఈ దాడులలో ముక్కలు ముక్కలు చేసినట్లు నైజీరియా ప్రకటించింది. 

నైజీరియా, అమెరికా దేశాల మధ్య ఇటీవలి కాలంలో రక్షణ పరమైన సంబంధాలు,  సైనిక సహకారం  బలపడ్డాయి. ఈ వ్యూహాత్మక బంధం కారణంగానే  ఐసిస్ గ్లోబల్ సెకండ్-ఇన్-కమాండ్‌గా వ్యవహరిస్తున్న అబు-బిలాల్ అల్-మినుకిని ఇటీవల హతం చేయడం సాధ్యమైంది. ఉగ్రవాద నిర్మూలనలో ఇరు దేశాల భాగస్వామ్యం అత్యంత కీలకమైనదని నైజీరియా దేశాధినేత బోలా టినుబు పేర్కొన్నారు.

కాగా నైజీరియాలో ఆపరేషన్ విజయవంతం కావడంపై అమెరికా  అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. తన మార్గదర్శకత్వంలోనే అమెరికా, నైజీరియా బలగాలు అత్యంత సంక్లిష్టమైన ఈ ఆపరేషన్‌ను సమర్థవంతంగా పూర్తి చేయగలిగాయని ఆయన పేర్కొన్నారు.  

ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం.. 2009  నుండి నైజీరియాలో బోకో హరామ్, ఇస్లామిక్ స్టేట్ వంటి   ఉగ్రవాద సంస్థల హింసాత్మక చర్యల వల్ల దాదాపు 40 వేల మందికి పైగా  పౌరులు ప్రాణాలు కోల్పోయారు.  సుమారు 20 లక్షల మంది ప్రజలు తమ సొంత నివాసాలను కోల్పోయి శరణార్థులుగా మారారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి, మిగిలిన ఉగ్రవాద నెట్‌వర్క్‌లను పూర్తిగా నిర్మూలించడానికి సంయుక్త బలగాలు మరిన్ని వ్యూహాత్మక దాడులను కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

By
en-us Political News

  
హైదరాబాద్ బహదూర్‌పురాలో బ్యాటరీ వ్యాపారం నిర్వహిస్తున్న రాకేష్ వర్మకు ముంబైకి చెందిన మజార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడినట్లు విచారణలో వెల్లడైంది. ఈ పరిచయంతోనే గత డిసెంబర్‌లో మజార్ వద్ద నుంచి కోకైన్ కొనుగోలు చేసినట్లు రాకేష్ వర్మ సిట్‌కు తెలిపినట్టు సమాచారం.
దాదాపు 11 గంటల పాటు కొనసాగిన ఈ విచారణలో హీరా గ్రూప్‌కు చెందిన ఆస్తుల విక్రయాలు, అనుమతులు, అధికారిక నిర్ణయాలపై వివరణలు కోరినట్లు సమాచారం. హీరా గ్రూప్‌పై మనీలాండరింగ్‌, పెట్టుబడిదారుల మోసం వంటి ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఇప్పటికే పలు ఆస్తులను అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ అటాచ్‌ చేసిన ఆస్తులను విక్రయించేందుకు అనుమతులు ఇచ్చే ప్రక్రియలో అమోయ్ కుమార్ సహకరించారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ పరిధిలో అమెరికా నౌకాదళ ఆస్తులపై ఇరాన్ జరిపిన దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఈ దాడులు పరిమిత సైనిక చర్య మాత్రమేనని, పూర్తి స్థాయి యుద్ధాన్ని మళ్లీ ప్రారంభించడం తమ ఉద్దేశం కాదని అమెరికా సీనియర్ అధికారులు పేర్కొన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి భీతావహంగా మారింది.
ముఖ్యంగా ప్లేఆఫ్స్ చేరని జట్ల కెప్టెన్లపై ప్రస్తుతం ఉద్వాసన కత్తి వేళాడుతోంది. టీ20 ఫార్మాట్‌లో నాయకుడి పాత్ర ఎంతవరకు ఉంటుంది అనేదానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, జట్టు ఓటమికి కెప్టెన్ బాధ్యత వహించక తప్పదు. ఈ నేపథ్యంలో మూడు జట్ల కెప్టెన్లు ఆ బాధ్యతల నుంచి వైదొలగడమో, ఉద్వాసనకు గురి కావడమో తప్పదని క్రీడా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఈ నూతన గ్రీన్ కార్డ్ విధానం అమెరికా టెక్ పరిశ్రమను అతలాకుతలం చేసింది. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలుస్తున్న భారతీయ ప్రతిభను దూరం చేసుకుంటే ఐటీ రంగానికి భారీ నష్టం వాటిల్లుతుందని కంపెనీల ప్రతినిధులు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి.
ఒప్పందంలో అమెరికా విధించిన షరతులకు తాము అంగీకరించలేదని ఇరాన్ కుండబద్దలు కొట్టింది. ఇరాన్ లో శుద్ధి చేసిన యురేనియంను విదేశాలను తరలించేందుకు ఆ దేశం అంగీకరించలేదు. ఈ విషయాన్ని ఇరాన్ సెమీ అఫీషియల్ వార్తా సంస్థ తస్నీమ్ తెలిపింది. ఇరాన్ తన వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియంను దేశం నుంచి తరలించడానికి సిద్ధంగా ఉందని సౌదీ అరేబియాకు చెందిన అల్ హదత్ మీడియా ప్రచురించిన కథనాన్ని తస్నిమ్ ఖండించింది. ఈ కథనంలో ఎలాంటి నిజం లేదని పేర్కొంది.
11 రోజుల వ్యవధిలోనే సీఎన్‌జీ ధర ఆరు రూపాయలు పెరిగింది. మే 15న కిలో సీఎన్జీ పై రూ. 2, మే 18న రూ. 1, మే 23న మరో రూపాయి చొప్పున ధరలను పెంచారు. తాజా పెంపుతో నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లలో కిలో సీఎన్‌జీ ధర రూ. 88.70కి చేరింది. గురుగ్రామ్‌లో రూ. 86.12, ముంబైలో రూ. 84గా ఉంది.
ఇప్పటివరకు తాము ఎన్నో విషయాలను ఓపికగా భరించామని, అయితే ఇకపై సహించే ప్రసక్తే లేదని జనసేన
డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పార్టీ అంతర్గత సమీక్షా సమావేశంలో శ్రేణులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణకు చెందిన ముగ్గురు ప్రముఖులకు తాజాగా పద్మ పురస్కారాలు దక్కాయి.
రాజకీయాల్లోకి తాను అన్నీ కోల్పోవడానికి సిద్ధపడే వచ్చానని, అంతేగానీ ఎవరైనా ఇష్టానుసారంగా మాట్లాడితే చేతులు కట్టుకుని కూర్చోవడానికి సిద్ధంగా లేనని
ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 ఎపీ సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకుంది.
అనంత శ్రీరామ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్‌లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.