సూపర్-8 తొలి మ్యాచ్ లలో ఆతిధ్య జట్ల ఓటమి

Publish Date:Feb 22, 2026

Advertisement

టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో భాగంగా జరిగిన తొలి రెండు మ్యాచుల్లో ఆధిత్య దేశాలు శ్రీలంక, భారత్ పరాజయం పాలయ్యాయి. శ్రీలంకపై ఘన విజయం సాధించి ఇంగ్లండ్ సూపర్ 8లో శుభారంభం చేసింది.   శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియం వేదికగా  జరిగిన ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్  51 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్త.  147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక బ్యాటర్లు.. 16.4 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌటయ్యారు. ఇంగ్లిష్ బౌలర్ల ధాటికి లంక బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది.  లీగ్ స్టేజ్ నుంచి అజేయంగా  సూపర్ -8కు చేరుకున్న శ్రీలంక జట్టు ఇంగ్గాండ్ స్పిన్నర్ల ధాటికి విలవిలల్లాడిపోయింది. లంక జట్టులో ఏడు వికెట్లను ఇంగ్లాండ్ స్పిన్నర్లే పడగొట్టారు. 

ఇక సౌత్ ఆఫ్రికాతో ఆడిన  సూపర్ -8 మ్యాచ్‌లో భారత్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.  తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు ఏడు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేయగా, ఛేదనలో భారత్ 118 పరుగులకే ఆలౌట్ అయ్యింది.  శివమ్ దూబె (42) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత్ జట్టు సైతం గ్రూప్ మ్యాచుల్లో అజేయంగా నిలిచి సూపర్-8 దశకు చేరింది
 

By
en-us Political News

  
శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్ సోము వీర్రాజుపై ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని మంత్రి లోకేష్ అన్నారు
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద విస్తృత స్థాయిలో టారిఫ్‌లు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి విదితమే. పన్నులు విధించే అధికారం కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది.
దేశంలో మరో విమాన ప్రమాదం చోటుచేసుకుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వల్ల ఐటీ రంగంపై పడే ప్రభావం పట్ల ఇన్వెస్టర్లలో పెరుగుతున్న ఆందోళనలు ఈ పతనానికి ప్రధాన కారణగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. టెక్ మహీంద్ర, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎటర్నర్, టీసీఎస్ , ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఐబీఎం సిట్టమ్స్‌లో ఉపయోగించే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ను అంతథ్రోపిక్ క్లాడ్ ఆధునికీకరించగలదన్న ప్రచారంతో ఐబీఎం షేర్లు భారీగా పతనమయ్యాయి.
భార్యపై అనుమానంతో పథకం ప్రకారం భార్యను భర్త హత్య చేశాడు.
నను అనేక మంది టార్గెట్ చేసుకున్నారనీ, ఇంకా ఎంత కాలం ఉంటానో తెలియదని వ్యాఖ్యానించారు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు రామ్‌రాజ్, ఆయన భార్య మాధవి, కుమారుడు శశాంక్ గా గుర్తించారు.కుటుంబమంతా ఒకేసారి ప్రాణాలు తీసుకోవ డం వెనుక గల కారణాలు తెలియాల్సి ఉంది.
కేరళ అసెంబ్లీ మరోసారి తీర్మానాన్ని ఆమోదించింది. ఇది ప్రస్తుతం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. తమ రాష్ట్రాన్ని మలయాళ భాషలో కేరళం అని పిలుస్తారని సీఎం విజయన్ గత ఏడాది తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన సందర్భంగా తెలిపారు. మలయాళ ప్రజలందరి కోసం ఐక్య కేరళ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ స్వాతంత్ర్య పోరాట కాలంలోనే ఉండేదని గుర్తు చేశారు.
మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌ను వేదికగా చేసుకుని ఒంటరి మహిళలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని పెళ్లి పేరుతో డబ్బులు, నగలు దోచుకుంటున్న మల్కాజిగి రికి చెందిన చిన్న రంగా నాయక్ అలియాస్ రామ్ అలియాస్ చిన్న అనే వ్యక్తి షాదీ డాట్‌కామ్‌లో వేర్వేరు పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించి ఈ మోసాలకు పాల్పడుతున్నాడని బాధితురాలు ఆరోపించారు.
తిరుమల లడ్డూ నెయ్యి కల్తీపై శాసన సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అనుభవజ్ఞులైన అధికారుల తో 32 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి... మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, హర్యానా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, అస్సాం, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో 10 రోజుల పాటు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. స్థానిక పోలీసుల సమన్వయంతో కీలక నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
మూసీ పునరుజ్జీవన పథకం లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం గాంధీ సరోవర్‌ ప్రాజెక్టు కోసం భూసేకరణ నోటిఫికేషన్‌ను కూడా జారీ చేసి, అభిప్రాయ సేకరణ కోసం సమావేశాలను కూడా నిర్వహించింది. ఈ నేపథ్యంలో మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్ గాంధీ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో సీఎం రేవంత్ రెడ్డి, సీఎంవోను ట్యాగ్ చేస్తూ ఓ పోస్టు పెట్టారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.