షాదీ డాట్‌కామ్ పేరుతో పెళ్లి మోసం
Publish Date:Feb 24, 2026
Advertisement
వీడు అలాంటి ఇలాంటి వాడు కాదండోయ్ బాబోయ్… ఒంటరి మహిళ కనిపిస్తే చాలు దగ్గరవు తాడు. మొదట ప్రేమగా మాట్లాడి, తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తాడు. ఆపై రకరకాల కారణాలు చెప్పి డబ్బులు వసూలు చేస్తాడు. పోలీసుల చేతికి చిక్కకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు పేర్లు మార్చుకుంటూ తిరుగుతుంటాడు. వీడి బాగోతం ఓ బాధితురాలు పోలీసులను ఆశ్రయించడం తో వెలుగులోకి వచ్చింది. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌ను వేదికగా చేసుకుని ఒంటరి మహిళలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని పెళ్లి పేరుతో డబ్బులు, నగలు దోచుకుంటున్న మల్కాజిగి రికి చెందిన చిన్న రంగా నాయక్ అలియాస్ రామ్ అలియాస్ చిన్న అనే వ్యక్తి షాదీ డాట్‌కామ్‌లో వేర్వేరు పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించి ఈ మోసాలకు పాల్పడుతున్నాడని బాధితురాలు ఆరోపించారు. బాలాపూర్ మండలం మీర్ పేట్ లెనిన్ నగర్‌కు చెందిన ఈ.ఆర్. భవాని మీడియా ముందు కొచ్చి తన ఆవేదన వ్యక్తం పరిచారు. నిందితుడు వివాహం చేసుకుంటానని నమ్మబలికి ముందుగా పరిచయం పెంచుకుని, తరువాత ఇల్లు కొనుగోలు చేసి పెళ్లి చేసుకుందామని కల్లబొల్లి కబుర్లు చెప్పి నగదు, నగలు తీసుకున్నా డని తెలిపారు.తన వద్ద నుంచి రూ.15 లక్షల నగదుతో పాటు బ్యాంక్ ఖాతా ద్వారా మరో రూ.15 లక్షలు తీసుకుని చివరికి తప్పించుకున్నాడని ఆమె వాపోయారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు నిందితుడు తరచూ పేర్లు మార్చుకుంటూ తిరుగుతు న్నాడని చెప్పారు.ఇలాంటి తప్పుడు ప్రొఫైళ్లతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తుల నుంచి మహిళలు జాగ్రత్తగా ఉండాలని, ఎవరికీ డబ్బులు లేదా నగలు ఇవ్వకూడదని బాధితురాలు సూచించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/marriage-scam-in-the-name-of-shaadidotom-36-214587.html





