హైదరాబాద్ పోలీసుల ఆపరేషన్ ఆక్టోపస్!

Publish Date:Feb 24, 2026

Advertisement

 దేశవ్యాప్తంగా విస్తరించిన సైబర్  గ్యాంగ్‌లపై హైదరాబాద్ నగర పోలీసులు భారీ స్థాయిలో అణిచివేత చర్యలు చేపట్టారు.  ఆపరేషన్ ఆక్టోపస్  పేరుతో నిర్వహించిన ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో 16 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు చేసి 104 మందిని అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 36 లక్షల నగదు, 200కి పైగా మొబైల్ ఫోన్లు, వందల సంఖ్యలో సిమ్ కార్డులు, బ్యాంకు పాస్‌ బుక్‌లు, డెబిట్–క్రెడిట్ కార్డులు, ల్యాప్‌టాప్‌లు,  సంస్థల స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు.

డీసీపీ  సైబర్ క్రైమ్స్ వి. అరవింద్ బాబు  నాయకత్వంలో స్పెషల్ బ్రాంచ్  జాయింట్ కమిషనర్   ఎస్‌.ఎం. విజయ్ కుమార్  పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ జరిగింది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న పెట్టుబడి, ట్రేడింగ్, డిజిటల్ అరెస్ట్ వంటి మోసాల నేపథ్యంలో బాధితుల ఫిర్యాదులపై లోతైన దర్యాప్తు జరిపిన సైబర్ క్రైమ్ పోలీసులు, అక్రమ డబ్బు లావాదేవీలకు ఉపయో గించిన 151 బ్యాంకు ఖాతాల నెట్‌వర్క్‌ను గుర్తించారు.

పెరిగిపోతున్న నేర ముఠాలను ఛేదించేందుకు అనుభవజ్ఞులైన అధికారుల తో 32 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి... మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, హర్యానా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, అస్సాం, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో 10 రోజుల పాటు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. స్థానిక పోలీసుల సమన్వయంతో  కీలక నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా అరెస్టైన వారిలో  86 మంది మ్యూల్ ఖాతాదారులు,17 మంది ఖాతా సరఫరాదారులు, అగ్రిగేటర్లు,ఒక బ్యాంకు అధికారి ఉన్నారు. 

వీరికి  దేశవ్యాప్తం గా నమోదైన 1,055 సైబర్ మోసం కేసులతో సంబంధం ఉన్నట్లు పోలీసులు వెల్లడిం చారు. మొత్తం రూ.127 కోట్లకు పైగా మోసాలు జరిగినట్లు గుర్తించారు. అక్రమ నిధులను లేయరింగ్, లాండరింగ్ చేయడానికి బ్యాంకు ఖాతాలను ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. సైబర్ నేరాలు కేవలం ఆర్థిక నష్టం మాత్రమే కాదు, కుటుంబాల సామాజిక,ఆర్థిక స్థితిని దెబ్బతీసే ప్రమాదమని పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో  జీరో టాలరెన్స్ విధానంతో చర్యలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ ఆపరేషన్ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుం దనీ, సిండికేట్‌ల ఉన్నత స్థాయి నిందితులపై కూడా దర్యాప్తు జరుగుతోందని హైదరాబాదు సిపి సజ్జనార్ తెలిపారు.  

By
en-us Political News

  
శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్ సోము వీర్రాజుపై ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని మంత్రి లోకేష్ అన్నారు
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద విస్తృత స్థాయిలో టారిఫ్‌లు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి విదితమే. పన్నులు విధించే అధికారం కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది.
దేశంలో మరో విమాన ప్రమాదం చోటుచేసుకుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వల్ల ఐటీ రంగంపై పడే ప్రభావం పట్ల ఇన్వెస్టర్లలో పెరుగుతున్న ఆందోళనలు ఈ పతనానికి ప్రధాన కారణగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. టెక్ మహీంద్ర, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎటర్నర్, టీసీఎస్ , ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఐబీఎం సిట్టమ్స్‌లో ఉపయోగించే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ను అంతథ్రోపిక్ క్లాడ్ ఆధునికీకరించగలదన్న ప్రచారంతో ఐబీఎం షేర్లు భారీగా పతనమయ్యాయి.
భార్యపై అనుమానంతో పథకం ప్రకారం భార్యను భర్త హత్య చేశాడు.
నను అనేక మంది టార్గెట్ చేసుకున్నారనీ, ఇంకా ఎంత కాలం ఉంటానో తెలియదని వ్యాఖ్యానించారు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు రామ్‌రాజ్, ఆయన భార్య మాధవి, కుమారుడు శశాంక్ గా గుర్తించారు.కుటుంబమంతా ఒకేసారి ప్రాణాలు తీసుకోవ డం వెనుక గల కారణాలు తెలియాల్సి ఉంది.
కేరళ అసెంబ్లీ మరోసారి తీర్మానాన్ని ఆమోదించింది. ఇది ప్రస్తుతం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. తమ రాష్ట్రాన్ని మలయాళ భాషలో కేరళం అని పిలుస్తారని సీఎం విజయన్ గత ఏడాది తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన సందర్భంగా తెలిపారు. మలయాళ ప్రజలందరి కోసం ఐక్య కేరళ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ స్వాతంత్ర్య పోరాట కాలంలోనే ఉండేదని గుర్తు చేశారు.
మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌ను వేదికగా చేసుకుని ఒంటరి మహిళలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని పెళ్లి పేరుతో డబ్బులు, నగలు దోచుకుంటున్న మల్కాజిగి రికి చెందిన చిన్న రంగా నాయక్ అలియాస్ రామ్ అలియాస్ చిన్న అనే వ్యక్తి షాదీ డాట్‌కామ్‌లో వేర్వేరు పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించి ఈ మోసాలకు పాల్పడుతున్నాడని బాధితురాలు ఆరోపించారు.
తిరుమల లడ్డూ నెయ్యి కల్తీపై శాసన సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
మూసీ పునరుజ్జీవన పథకం లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం గాంధీ సరోవర్‌ ప్రాజెక్టు కోసం భూసేకరణ నోటిఫికేషన్‌ను కూడా జారీ చేసి, అభిప్రాయ సేకరణ కోసం సమావేశాలను కూడా నిర్వహించింది. ఈ నేపథ్యంలో మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్ గాంధీ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో సీఎం రేవంత్ రెడ్డి, సీఎంవోను ట్యాగ్ చేస్తూ ఓ పోస్టు పెట్టారు.
భువన ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు. అయితే  భువన మృతి చెందిన విషయాన్ని హాస్టల్ యాజమాన్యం ఆలస్యంగా తమకు తెలిపిందని, పోలీసులకు కూడా వెంటనే సమాచారం ఇవ్వలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.