ఒక వైపు ఏఐ, మరోవైపు ట్రంప్.. స్టాక్ మార్కెట్లు కుదేలు

Publish Date:Feb 24, 2026

Advertisement

భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం (ఫిబ్రవరి 24)  తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నాయి. ప్రధానంగా ఐటీ రంగంలోని షేర్లు భారీగా అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి.  దీంతో మార్కెట్లు  భారీ నష్టాలను చవిచూశాయి. ఈ మధ్యాహ్నం 12.15 గంటల సమయానికి సెన్సెక్స్ ఏకంగా 900 పాయింట్లు,  నిఫ్టీ 25,500 కీలక స్థాయికి దిగువన కొనసాగుతోంది.  

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  ఏఐ వల్ల ఐటీ రంగంపై పడే ప్రభావం పట్ల ఇన్వెస్టర్లలో పెరుగుతున్న ఆందోళనలు ఈ పతనానికి ప్రధాన కారణగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. టెక్ మహీంద్ర, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎటర్నర్, టీసీఎస్ , ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఐబీఎం సిట్టమ్స్‌లో ఉపయోగించే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ను అంతథ్రోపిక్ క్లాడ్ ఆధునికీకరించగలదన్న ప్రచారంతో ఐబీఎం షేర్లు భారీగా పతనమయ్యాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా 15% గ్లోబల్ టారిఫ్ విధిస్తూ జారీ చేసిన ఆదేశాలు, అమెరికా సుప్రీంకోర్టు తీర్పును అలుసుగా తీసుకుని ఏ దేశమైనా ఆటలాడాలని చూస్తే భారీగా టారిఫ్‌లు విధిస్తానని చేసిన హెచ్చరికలు అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితిని సృష్టించాయి. ఇది నేరుగా భారతీయ ఎగుమతి రంగాలపై, ముఖ్యంగా ఐటీపై ప్రభావం చూపింది.

By
en-us Political News

  
శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్ సోము వీర్రాజుపై ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని మంత్రి లోకేష్ అన్నారు
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద విస్తృత స్థాయిలో టారిఫ్‌లు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి విదితమే. పన్నులు విధించే అధికారం కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది.
దేశంలో మరో విమాన ప్రమాదం చోటుచేసుకుంది.
భార్యపై అనుమానంతో పథకం ప్రకారం భార్యను భర్త హత్య చేశాడు.
నను అనేక మంది టార్గెట్ చేసుకున్నారనీ, ఇంకా ఎంత కాలం ఉంటానో తెలియదని వ్యాఖ్యానించారు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు రామ్‌రాజ్, ఆయన భార్య మాధవి, కుమారుడు శశాంక్ గా గుర్తించారు.కుటుంబమంతా ఒకేసారి ప్రాణాలు తీసుకోవ డం వెనుక గల కారణాలు తెలియాల్సి ఉంది.
కేరళ అసెంబ్లీ మరోసారి తీర్మానాన్ని ఆమోదించింది. ఇది ప్రస్తుతం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. తమ రాష్ట్రాన్ని మలయాళ భాషలో కేరళం అని పిలుస్తారని సీఎం విజయన్ గత ఏడాది తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన సందర్భంగా తెలిపారు. మలయాళ ప్రజలందరి కోసం ఐక్య కేరళ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ స్వాతంత్ర్య పోరాట కాలంలోనే ఉండేదని గుర్తు చేశారు.
మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌ను వేదికగా చేసుకుని ఒంటరి మహిళలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని పెళ్లి పేరుతో డబ్బులు, నగలు దోచుకుంటున్న మల్కాజిగి రికి చెందిన చిన్న రంగా నాయక్ అలియాస్ రామ్ అలియాస్ చిన్న అనే వ్యక్తి షాదీ డాట్‌కామ్‌లో వేర్వేరు పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించి ఈ మోసాలకు పాల్పడుతున్నాడని బాధితురాలు ఆరోపించారు.
తిరుమల లడ్డూ నెయ్యి కల్తీపై శాసన సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అనుభవజ్ఞులైన అధికారుల తో 32 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి... మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, హర్యానా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, అస్సాం, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో 10 రోజుల పాటు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. స్థానిక పోలీసుల సమన్వయంతో కీలక నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
మూసీ పునరుజ్జీవన పథకం లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం గాంధీ సరోవర్‌ ప్రాజెక్టు కోసం భూసేకరణ నోటిఫికేషన్‌ను కూడా జారీ చేసి, అభిప్రాయ సేకరణ కోసం సమావేశాలను కూడా నిర్వహించింది. ఈ నేపథ్యంలో మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్ గాంధీ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో సీఎం రేవంత్ రెడ్డి, సీఎంవోను ట్యాగ్ చేస్తూ ఓ పోస్టు పెట్టారు.
భువన ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు. అయితే  భువన మృతి చెందిన విషయాన్ని హాస్టల్ యాజమాన్యం ఆలస్యంగా తమకు తెలిపిందని, పోలీసులకు కూడా వెంటనే సమాచారం ఇవ్వలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.