కుటుంబం ఇలా ఉంటే ఆ ఇంటి పిల్లలు అభివృద్ది పథంలో దూసుకెళ్తారట..!

Publish Date:Oct 5, 2024

Advertisement

 


జీవితంలో ప్రతి వ్యక్తికి కుటుంబం చాలా కీలకం. మనిషికి కుటుంబం ఆర్థికంగానే కాదు.. వ్యక్తిత్వ పరంగా,  విలువల పరంగా చాలా నేర్పుతుంది. కుటుంబం గురించి, కుటుంబం ఎలా ఉంటే పిల్లలు అభివృద్ది పథంలో దూసుకెళ్తారు అనే విషయం గురించి ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ప్రస్తావించాడు.  సంతోషకరమైన కుటుంబం ఎలా ఉంటుందో కూడా చెప్పాడు.  దీని గురించి తెలుసుకుంటే..

'మూర్ఖా యత్ర న పూజ్యంతే ధాన్యం యత్ర సుసఞ్చితం'              దమ్పత్యేః కల్హో నాస్తి తత్ర శ్రీః స్వయమాగతః ।

ఒక ఇంట్లో మూర్ఖులను గౌరవించడం కంటే ఆ ఇంట్లో మంచి వారిని,  మంచి గుణం కలిగిన వారిని గౌరవిస్తూ ఉంటే ఆ ఇల్లు ఎప్పుడూ ఆనందంగా ఉంటుందట. ఇలాంటి కుటుంబంలో ఉన్న వారు జీవితంలో అబివృద్ది చెందుతారట. ఇది మాత్రమే కాదు.. ఇంకా ఏమన్నారంటే..

యస్య పుత్రో వశిభూతో భార్యా ఛన్దానుగామినీ ।
విభవే యశ్చ సతాంసతస్య స్వర్గం .

చాణక్య నీతిలో పొందుపరిచిన ఈ శ్లోకం ప్రకారం..  ఎవరి కొడుకు అయితే నియంత్రణలో ఉంటాడో.. ఏ ఇంట్లో అయితే మహిళలు కూడా తమ కోరిక,అభివృద్ది మేరకు విద్య, ఉద్యోగం విషయాలలో ఉండగలుగుతుందో,  ఏ ఇంట్లో అయితే తాము సంపాదించుకున్న డబ్బుతో తృప్చిగా ఉంటారో.. అలాంటి కుటుంబంలో వ్యక్తులు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారట. అలాంటి ఇళ్లలోనే ఆనందం కూడా ఉంటుందట.

తే పుత్రా యే పితుర్భక్తాః సా పితా యస్తు నూత్రికాః ।
తన్మిత్రం యస్య విశ్వాసః స భార్యా యత్ర నిర్వృత్తిః ।

చాణక్య నీతి ప్రకారం ఏ ఇంట్లో అయితే పిల్లలు తల్లిదండ్రుల నియంత్రణలో ఉంటారో.. ఏ ఇంట్లో అయితే పిల్లలు తల్లిదండ్రుల మాట పాటిస్తారో ఆ ఇంటి పెద్ద ఎప్పడూ సంతోషంగా ఉంటాడట. తండ్రి మాటను పాటించే కుటుంబం ఎప్పుడూ ఆనందంతో,  సంతోషంతో ఉంటుందట.

నీతిజ్ఞః శీలమ్పన్నా భవన్తి, కులపూజితః.

బాల్యంలో చదివిన విద్యను బట్టి పిల్లలు అభివృద్ధి చెందుతారని చాణక్య నీతిలోని ఈ శ్లోకం అర్థం.  అందుకే పిల్లలకు చిన్నతనంలోనే మంచిదారిలో తీసుకువెళ్లాలి.  వారికి మంచి చెడుల గురించి తల్లిదండ్రులు పిల్లలకు చిన్నతనంలోనే చెప్పాలి.  అలాంటి పిల్లలు పెద్దయ్యే కొద్ది ఉత్తమ పౌరులుగా అబివృద్ది పథంలో దూసుకుపోతారు.

                        *రూపశ్రీ.


 

By
en-us Political News

  
ప్రకృతి సృష్టించే అత్యంత భయంకరమైన , విధ్వంసకరమైన ముప్పులలో సునామీ ఒకటి. సముద్ర గర్భంలో సంభవించే భూకంపాలు లేదా అల్లకల్లోలాల కారణంగా ఉద్భవించే ఈ రాక్షస అలలు క్షణాల్లో తీర ప్రాంతాలను ముంచెత్తుతాయి.
ధంతేరస్ నుంచి దీపావళి వరకు ఏ రోజు ఏ వస్తువులు కొనుగోలు చేయాలి? బంగారం, వెండి, పాత్రలతో పాటు ఏది శుభప్రదం? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
మానవ ఆరోగ్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఆధునిక పోషకాహార ఫ్రేమ్‌వర్క్ తెస్తున్న విప్లవాత్మక మార్పులు, ప్రయోజనాల గురించిన పూర్తి సమగ్ర విశేషాలు.
మలబద్దక సమస్యతో బాధపడుతున్నారా? ఉదయాన్నే మోషన్ ఫ్రీగా అవ్వడానికి ప్రముఖ నిపుణులు డాక్టర్ బాలు యెల్లెపు సూచించిన 10 అద్భుతమైన సూపర్ ఫుడ్స్ మరియు డైట్ చిట్కాల గురించి ఈ స్టోరీలో తెలుసుకోండి.
తెలంగాణ స్టైల్ నల్లకూర ఫ్రై తయారీ విధానం తెలుసుకోండి. నీచు వాసన రాకుండా, పర్ఫెక్ట్ మసాలాలతో పల్లెటూరి రుచిలో నల్లకూర ఎలా చేయాలో ఈ స్టోరీలో చూసేయండి.
ఆంధ్రా స్టైల్ చింత చిగురు రొయ్యల కూర తయారీ విధానం మరియు ఆరోగ్య ప్రయోజనాలు. రుచికరమైన పచ్చి రొయ్యల కర్రీని సులభంగా ఎలా చేయాలో తెలుసుకోండి.
దీపావళి పండుగ ప్రత్యేకంగా స్వీట్ షాప్ స్టైల్ లో నేతి బొబ్బట్లు ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేయాలో తెలుసుకోండి. పర్ఫెక్ట్ కొలతలు, చిట్కాలతో రుచికరమైన బొబ్బట్ల రెసిపీ.
మనం నిత్య జీవితంలో ఎదుర్కొనే ఒత్తిడి , అనేక రకాల చిన్న చిన్న కారణాల వల్ల చాలా మంది క్షణాల వ్యవధిలోనే తీవ్రమైన కోపం తెచ్చుకుంటూ ఉంటారు.
చాయ్‌తో తినడానికి సరికొత్త రుచితో కరకరలాడే బియ్యంపిండి మురుకులను ఇంట్లోనే అత్యంత సులభంగా, నూనె పీల్చకుండా గుల్లగా ఎలా తయారు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.
ప్రతిరోజూ వేరుశెనగలు తినడం వల్ల మెదడు జ్ఞాపకశక్తి మరియు ఇన్సులిన్ పనితీరు ఎలా మెరుగుపడుతుందో తాజా పరిశోధన ఆధారంగా తెలుసుకోండి.
బరువు తగ్గాలనుకునే వారు ఈవెనింగ్ స్నాక్స్‌గా మఖానా లేదా పాప్‌కార్న్ ఏది తినాలి? ఏది ఆరోగ్యకరం, బరువు తగ్గడానికి ఏది బెటర్ అనే పూర్తి వివరాలు తెలుసుకోండి.
నిద్రలో వచ్చే గురక సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఇది ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో తెలుసుకోండి. ఎలాంటి ఖరీదైన మందులు లేకుండా, సహజ పద్ధతుల్లో గురకను ఎలా నివారించాలో ఇక్కడ తెలుసుకోండి.
శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గును తగ్గించి, గొంతుకు ఉపశమనం అందించే ఆలయ శైలి ట్రెడిషనల్ మిరియాల పులిహోరను సరైన కొలతలతో సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.