అధికారంలో ఉన్నప్పుడు జగన్ పాదయాత్ర చేయడు

posted on: Feb 5, 2026 6:11PM

 

తెలుగువన్ వాస్తవ వేదిక పదకొండవ సంచికలో ఘాటైన చర్చ జరిగింది. తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ పాల్గొని సమకాలీన రాజకీయాలపై నిర్మోహమాటంగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

వైసీపీ అధినేత జగన్‌కు పాదయాత్ర చేయనిస్తారా? అనే ప్రశ్నను కంఠంనేని రవిశంకర్ లేవనెత్తారు. దీనికి స్పందించిన డోలేంద్ర ప్రసాద్, చంద్రబాబు డిక్టేటర్ కాదు… డెమోక్రాట్ అని వ్యాఖ్యానించారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేయలేదని  గుర్తుచేశారు.

జగన్ బూచీ చూపిస్తే ఓట్లు పడతాయని చంద్రబాబు, లోకేశ్ భావిస్తున్నారని కొందరు అంటున్నారని పేర్కొన్నారు. అలాగే ఆర్గానిక్ నేతలకు ఇన్‌ఆర్గానిక్ పదవులు లేవని, జ్యోతీబసు, బుద్ధబట్టాచార్య వంటి వారు వేరే పార్టీలోకి వెళ్లలేదని డోలేంద్ర ప్రసాద్ తెలిపారు.

తెలుగుదేశం, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలకు స్పష్టమైన సిద్ధాంతాలు లేవని ఆయన విమర్శించారు. మరోవైపు, వైసీపీ నాయకులు మాయలో ఉన్నారని, ఇసుక దందాలు, గనుల వ్యవహారాల్లో.. దేశంలో ఒక రకం న్యాయం, పేదలకు మరో రకం న్యాయం ఉందా? అని రవిశంకర్ ప్రశ్నించారు.

ఎన్నికల ముందు అరెస్టులు చేస్తే ప్రజల్లో సానుభూతి కలుగుతుందని పార్టీలు భావిస్తున్నాయని కూడా చర్చలో ప్రస్తావన వచ్చింది. ఈ వంటి అంశాలపై కంఠంనేని రవిశంకర్, డోలేంద్ర ప్రసాద్‌ల మధ్య జరిగిన పూర్తి స్థాయి చర్చను తెలుగువన్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి.

google-ad-img
    Related Sigment News
    • Loading...