Top Stories

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్

  ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన మద్రాసు హైకోర్టు జడ్జిగా ఉన్నారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. ఆయన గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 2023లో ఏపీ నుంచి మద్రాసుకు బదిలీ కాగా.. ప్రస్తుతం ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.  ఏపీతో పాటు మరిన్ని రాష్ట్రాలకు కొత్త సీజేఐలు నియమించబడ్డారు. తెలంగాణ హైకోర్టు సీజేగా అపరేష్‌కుమార్‌ సింగ్, త్రిపుర హైకోర్టు సీజేగా ఎంఎస్ రామచంద్రరావు, రాజస్థాన్ హైకోర్టు సీజేగా కేఆర్ శ్రీరామ్ నియమితులయ్యారు.  ఈయన ఆంధ్రా యూనివర్సిటీ లా కాలేజ్ నుంచి బీఎల్ పూర్తి చేశారు.
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్ Publish Date: Jul 14, 2025 9:30PM

దత్తన్నకు రిటైర్మెంట్.. ఇచ్చినట్లేనా.. ?

  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే, రాజకీయ నియామకాలపై దృష్టిని కేంద్రీకరించారు. అందులో భాగంగా, నిన్న (ఆదివారం) వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన నలుగురు ప్రముఖులను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్, మాజీ విదేశాంగ కార్యదర్శి హర్ష్ శ్రింగ్లా, కేరళ ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త సి. సదానందన్ మాస్టర్‌, ప్రఖ్యాత చరిత్రకారిణి మీనాక్షి జైన్‌లు పార్లమెంటు ఎగువ సభకు నామినేట్ అయిన వారిలో ఉన్నారు.అలాగే, ఈరోజు (సోమవారం) మూడు రాష్ట్రాలకు గవర్నర్‌‌లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. హర్యానా గవర్నర్‌గా ఆషింకుమార్‌ ఘోష్‌,  గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు,లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవిందర్ గుప్తా‌లను రాష్ట్రపతి నియమించారు.  ఇందులో, గోవా గవర్నర్‌గా నియమితులైన అశోక గజపతి రాజు టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలోనూ, ప్రభుత్వంలోన, పలు హోదాల్లో పని చేశారు. అశోక్ గజపతి రాజు ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఎన్డీఆర్, చంద్రబాబు మంత్రివర్గాలలో కీలక శాఖలు నిర్వహించారు.2014 లో విజయనగరం ఎంపీగా గెలిచిన ఆయన ప్రధాని మోదీ ఫస్ట్ కాబినెట్’ లో కేబినెట్ మంత్రి హోదాలో విమానయాన శాఖ నిర్వహించారు. ఇదే సమయంలో, ప్రస్తుతం హర్యానా గవర్నర్’గా ఉన్న బండారు దత్తాత్రేయ స్థానంలో ప్రొఫెసర్ ఆషిమ్ కుమార్ ఘోష్’ను ఆ రాష్ట్ర నూతన గవర్నర్ గా నియమించారు. దత్తాత్రేయ  హిమాచల్’ ప్రదేశ్ 2019-21), హర్యానా (2021-25)గవర్నర్’గా మొత్తం ఏడేళ్లు సేవలు అందించారు. ఆర్ఎస్ఎస్ ప్రచారక్’గా సుదీర్ఘ కాలం పని చేసిన దత్తాత్రేయ బీజేపీలోనూ పలు హోదాల్లో పని చేశారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. వాజ్ పేయ్, మోదీ ప్రభుత్వాలలో మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం హర్యానా గవర్నర్’గా ఉన్న ఆయన పదవీ కాలం ముగియటంతో ఇప్పుడు అక్కడ కొత్త గవర్నర్’ను నియమించారు.దీంతో.. ఇప్పుడు దత్తాత్రేయను మరో రాష్ట్రానికి గవర్నర్ గా నియమిస్తారా లేక 78 ఏళ్ల దత్తన్నకు రిటైర్మెంట్’ ఇస్తారా అనేది, చూడవలసి వుంది.ఇక.. రాష్ట్రానికి ప్రథమ పౌరుడిగా భావించే గవర్నర్‌ పదవిని చేపట్టిన వారిలో తెలుగువారు చాలా మందే ఉన్నారు.  ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాల రాజ్‌భవన్‌లో తెలుగు వారు గవర్నర్లుగా ఆశీనులయ్యారు. అందులో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా చేసిన ప్రముఖులు కూడా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటివరకూ మొత్తం 20 మంది వివిధ రాష్ట్రాలకు గవర్నర్లుగా పనిచేశారు. అలాగే ఒడిశా, తమళినాడులోని తెలుగు కుటుంబాల్లో జన్మించిన ఇద్దరితోపాటు తెలుగింటి కోడలుగా వచ్చి ఒకరు కూడా గవర్నర్లుగా పనిచేశారు. అంతేకాకుండా వీరిలో పలువురు ఏకకాలంలో వివిధ రాష్ట్రాల్లో గవర్నర్లుగా ఉన్నారు.ప్రస్తుతం అశోక గజపతి రాజుతో సహా ముగ్గురు తెలుగు వారు, మూడు రాష్ట్రాల ప్రధమ పౌరులుగా గౌరవం అందుకుంటున్నారు.
దత్తన్నకు రిటైర్మెంట్.. ఇచ్చినట్లేనా.. ?  Publish Date: Jul 14, 2025 9:12PM

ఏంటీ లోకేష్‌కి.. ప‌థ‌కాలు త‌యారు చేయ‌డం రాదా?

  లోకేష్ కి ప‌థ‌కాలు త‌యారు చేయ‌డం రాదా? మ‌రి స్టాన్ ఫ‌ర్డ్ లో ఏం నేర్చుకున్న‌ట్టు? అమ్మ‌కు వంద‌నం విష‌యంలో వైసీపీ చేస్తున్న ప్ర‌చారంలో అర్ధ‌మేంట‌ని చూస్తే.. ఫ‌స్ట్ మ‌న‌మంతా తెలుసుకోవ‌ల్సిన విష‌య‌మేంటంటే.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌, డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ స్కీముల ఆలోచ‌న‌లు లోకేష్ వే అని ఎంద‌రికి తెలుసు? వీటినే జ‌గ‌న్ కాపీ కొట్టాడ‌న్న సంగ‌తి మీకు తెలుసా? ఎవ‌రు అవున‌న్నా కాద‌న్నా.. లోకేష్ తండ్రి చాటు కొడుకు. ఆయ‌న ఆలోచ‌న‌లు నేరుగా ఏవీ అమ‌లు కానివ్వ‌ని అతి పెద్ద అడ్డంకి త‌న తండ్రే. తానేదైనా ఒక ప్ర‌తిపాద‌న చేస్తే.. దాన్ని అల‌వోక‌గా మ‌రో స్టైల్లోకి మార్చేస్తారు లోకేష్ తండ్రి చంద్ర‌బాబు. కార్య‌క‌ర్త‌ల‌కు జీతాల‌న్న‌దే వాలంటీర్లుగా జ‌గ‌న్ మార్చగా.. దాన్ని గ‌తంలో చంద్ర‌బాబు జ‌న్మ‌భూమి క‌మిటీలుగా మారిన విష‌యం గుర్తించిన వారు అరుదుగా ఉంటారు. ఇక డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ స్కీములు కూడా లోకేష్ తొలుత చేసిన ప్ర‌తిపాద‌న‌. ఇక వైయ‌స్ జ‌గ‌న్  ప‌థ‌క ర‌చ‌న సొంతంగా చేసేది ఏమీ ఉండ‌దు. దీని వెన‌క అతి పెద్ద క్రిష్టియ‌న్ లాబీ ఉంటుంద‌ని స‌మాచారం. జ‌గ‌న్ పైకి త‌న‌ బొమ్మ‌లేసుకుని.. ఇష్టారాజ్యం చేస్తుంటారు. కానీ, అదంతా ఒట్టిదే.. ఊరూరా ఉండే పాస్ట‌ర్లు.. ఈ ప‌థ‌కాల‌కు సంబంధించిన స‌మాచార‌మిచ్చి.. త‌గిన సూచ‌న‌లు చేస్తుంటారు. వీటి ద్వారా జ‌గ‌న్ అయిన దానికీ కాని దానికి, అర్ధం ప‌ర్ధం లేని ప‌థ‌కాలు ర‌చించేవార‌ని అంటారు. అలాగ‌ని ఈ కాపీ పేస్ట్ ప‌థ‌కాలు ఆయ‌న‌కి ఏమంత క‌లిసొచ్చిన ప‌రిస్థితి లేదు. గ‌త ఎన్నిక‌ల్లో ఇంత పెద్ద ఎత్తున ఎడా పెడా ప‌థ‌కాలిచ్చినా స‌రే ఆయ‌న గెల‌వ‌లేక పోయారు. అంటే ఆయ‌న ఈ ప‌థ‌కాల‌ను ఏమంత బాధ్య‌త కొద్దీ త‌యారు చేసిన‌వి కావు. ఒక‌ ఆలోచ‌న‌తో చేసిన‌వి కూడా కావు. అస‌లు జ‌గ‌న్ ప‌థ‌కాలంటే.. ఖ‌ర్చు భారం కింద లెక్క‌. పైపెచ్చు ఓట్ల కొనుగోలు వ్య‌వ‌హారంగానూ భావిస్తుంటారు. అందుకే ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓడిపోయారని అంచనా వేస్తుంటారు నిపుణులు.. నిజానికి ఈ సంక్షేమ ప‌థ‌కాలకు ఆద్యుడు ఎన్టీఆర్. అప్ప‌టి నుంచే ప్ర‌జారంజ‌క ప‌థ‌కాల శ‌కం ఒక‌టి మొద‌లైంది. వాటినే ఆ త‌ర్వాత వైయ‌స్ కాపీ కొట్టారు. ఆ త‌ర్వాత కేసీఆర్ సైతం పేస్ట్ చేసేశారు. ఇక జ‌గ‌న్ సంగ‌తి స‌రే స‌రి. త‌న విస్తృ ప‌థ‌కాల త‌యారీలో అధిక శాతం.. క్రిష్టియ‌న్ లాబీ నుంచి వ‌చ్చిన స‌ల‌హా సూచ‌న‌ల‌కు త‌న సొంత త‌యారీలా క‌ల‌రింగ్ ఇచ్చి.. జ‌నాల్లోకి వ‌దిలేస్తుంటార‌ని అంటారు. నిజానికి ఒక ప‌థ‌కం అంటే అది ప్ర‌భుత్వానికి భారం కారాదు. పెట్టుబ‌డిగా ఉండాలి. అదెలాగో తెలియాలంటే మ‌న‌కు చంద్ర‌బాబు నూత‌న సృష్టి పీ- 4. ఇది నిజంగా ఒక అద్భుత‌మైన ప‌థ‌కం. ఇదే జ‌గ‌న్ త‌న హ‌యాంలో అర్ధం ప‌ర్ధం లేకుండా చేసిన ఖ‌ర్చు ఆయ‌న స్వార్ధానికి సంబంధించిన వ్య‌వ‌హారం. ఈ మొత్తం పెట్టుబ‌డి కింద‌ పెట్టి మంచి రాజ‌ధాని నిర్మాణం చేసి ఉంటే.. అది ఈ పాటికి ఎన్నో ప‌నుల‌ను సృష్టించి ఉండేది. ఈ విష‌యం గుర్తించారు కాబ‌ట్టే.. జ‌నం ఆయ‌న్ను తిప్పి కొట్టారు.అలాంటి జ‌గ‌న్ ఆయ‌న పార్టీ లోకేష్ త‌మ అమ్మ ఒడినే కాపీ కొట్టి అమ్మ‌కు వంద‌నంగా పేరు మార్చార‌ని చెప్పుకోవ‌డం చూస్తుంటే వింత‌గా ఉంద‌ని అంటారు విశ్లేష‌కులు.
ఏంటీ లోకేష్‌కి.. ప‌థ‌కాలు త‌యారు చేయ‌డం రాదా? Publish Date: Jul 14, 2025 8:27PM

తెలంగాణ కొత్త సీజేఐగా జస్టిస్ అపరేష్ కుమార్‌ సింగ్

  తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్‌ సింగ్ నియమితులయ్యారు.ఈ మేరకు కొలీజియం సిఫార్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. కాగా, ఇంతకు ముందు త్రిపుర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ పనిచేశారు. ఇక ప్రస్తుత తెలంగాణ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా ఉన్న సుజయ్ పాల్‌ను కలకత్తా హైకోర్టుకు బదిలీ చేస్తూ కొలిజియం సిఫార్సు చేసింది.  ప్రస్తుతం త్రిపుర హైకోర్టు సీజేగా సేవలందిస్తున్న ఆయన బదిలీపై తెలంగాణ హైకోర్టుకు వచ్చారు. అపరేష్ కుమార్ సింగ్ (ఏకే సింగ్) 1965, జూలై 7న జన్మించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు. అనంతరం 1990 నుంచి 2000 వరకూ యూపీ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. ఆ తర్వాత 2001లో జార్ఖండ్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 2012, జనవరి 24న జార్ఖండ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.  
తెలంగాణ కొత్త సీజేఐగా జస్టిస్ అపరేష్ కుమార్‌ సింగ్ Publish Date: Jul 14, 2025 8:14PM

తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ..జల వివాదం సద్దుమణిగేనా?

  తెలుగు రాష్ట్రాల్లోని జల వివాదలను చర్చించేందుకు  కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఆహ్వానం పంపించింది. ఈ భేటీ కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో జులై 16న జరగనుంది. రెండు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జల వివాదానికి ఫుల్‌స్టాఫ్ పడాలంటే ముఖ్యమంత్రుల భేటీ అనివార్యమని కేంద్రం భావించింది. ఈ మేరకు వారిని భేటీ కావాలని కోరింది. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని భేటీకి ఆహ్వానించింది. ఈ మేరకు కేంద్రం సర్క్యులర్ ఒకటి విడుదల చేసింది.  భేటీ హాజరవడం వీలవుతుందా లేదా అనేది తెలపాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కోరింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు. పోలవరం ఎడమ, కుడి కాలువల నిర్మాణానికి చేసిన ఖర్చును రీయింబర్స్ చేయాలని, పోలవరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరుతూనే పోలవరం- బనకచర్ల లింక్ ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌‌కు వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీల వరద నీరు గోదావరిలోని పోలవరం నుంచి బనకచర్లకు పంపేందుకు లింక్ కెనాల్ ఏర్పాటుపై చర్చించారు.  ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఏపీ కరువు రహితంగా మారడంతో పాటు 80 లక్షల మందికి తాగునీరు అందిస్తుందని వివరించారు. మరోవైపు ఢిల్లీ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు కూడా సిద్ధమవుతున్నారు. మంగళవారం ఆయన ఢిల్లీ పర్యటించనున్నారు. కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు. పలు కీలక అంశాలపై వారితో చర్చించనున్నారు. ఇదే మంచి అవకాశం భావించిన కేంద్రం.. ఇద్దరు ముఖ్యమంత్రులను భేటీ కావాలని, జల వివాదాలకు ముగింపు పెట్టించాలని భావిస్తోంది.  
 తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ..జల వివాదం సద్దుమణిగేనా? Publish Date: Jul 14, 2025 7:58PM

షూటింగ్‌లో పల్టీలు కొట్టిన కారు..ఫైట్ మాస్టర్ మృతి

  సినిమా షూటింగ్‌లో కార్ టాప్లింగ్ స్టంట్ చేస్తూ ప్రముఖ ఫైట్ మాస్టర్ రాజు ప్రమాదంలో మృతి చెందారు.. హీరో ఆర్య, డైరెక్టర్ పా. రంజిత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌లో ఈ దుర్ఘటన జరిగింది. చెన్నైలోని నాగపట్నం సమీపంలో కారుతో స్టంట్స్ చేస్తుండగా రాజు గుండెపోటుకు గురయ్యారు. వెంటనే చిత్ర బృందం ఆయనను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. స్టంట్ మాస్టర్ రాజు మృతి పట్ల హీరో విశాల్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రాజు ధైర్యవంతుడని కొనియాడిన విశాల్, తాను నటించిన అనేక చిత్రాల్లో ఆయన సాహసోపేతమైన స్టంట్స్ చేశారని గుర్తు చేసుకున్నారు. అయితే, కారుతో స్టంట్స్‌ చేస్తుండగా రాజుకు హార్ట్ అటాక్ వచ్చిందని మరికొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఈ విషయంపై వెట్టువన్‌ మూవీ మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
షూటింగ్‌లో పల్టీలు కొట్టిన కారు..ఫైట్ మాస్టర్ మృతి Publish Date: Jul 14, 2025 7:26PM

ప్రమోషన్ పేరుతో రీల్స్... ఆపై కాపురంలో చిచ్చు

  ఇద్దరు యువ వైద్యుల మధ్య ఘర్షణ... చివరకు రీల్స్ అమ్మాయి యువ వైద్యుడి ప్రేమ తో మనస్థాపానికి గురై వైద్యుడు భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. హనుమకొండ జిల్లా హసన్ పర్తి వద్ద ఓ విల్లా లో కార్డియాలజీ వైద్యుడు డాక్టర్ సృజన్ అతని భార్య డెంటల్ సర్జన్ డాక్టర్ ప్రత్యూష నివాసం ఉంటున్నారు. ఈ మధ్యనే మెడి కవర్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో కార్డియాలజీ  విభాగంలో విధుల్లో చేరిన సృజన్ కు రీల్స్ మరియు ప్రమోషన్స్ చేస్తానంటూ బానోతు శృతి అలియాస్ బుట్ట  బొమ్మ పరిచయమైంది. ఇద్దరి మధ్య స్నేహం పెరగడంతో డాక్టర్ సృజన్ కు మరియు భార్య ప్రత్యూష మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి.  గొడవలు కాస్త తీవ్రం కావడంతో సుజన్ భార్యకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు ఈ క్రమంలో మాట మాట పెరిగి నిన్న ఉదయం ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది దీంతో మనసు స్థాపానికి చెందిన ప్రత్యూష ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బుట్ట బొమ్మ అలియాస్ బానోతు శృతి వల్లే తన కూతురు జీవితం ఆగమైందని, దీంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని తన కూతురు మృతి పై అనుమానాలు ఉన్నాయని మృతురాలు డాక్టర్ ప్రత్యూష తండ్రి రామ్ కిషన్ ఆరోపించారు. తల్లి ప్రత్యూష మృతితో ఇద్దరు అమ్మాయిలు అనాధలయ్యారు అందులో 7 నెలల పసిపాప ఉండడం పలువురి బాధ 
ప్రమోషన్ పేరుతో రీల్స్... ఆపై కాపురంలో చిచ్చు Publish Date: Jul 14, 2025 7:06PM

సుప్రీం చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ అస్వ‌స్థ‌త‌

  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. తీవ్ర ఇన్ఫ్‌క్షన్ కారణంగా ఢిల్లీలోని ఓ ఆస్ప‌త్రిలో చేరినట్లు అధికారిక వర్గలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన చికిత్సకు స్పందిస్తున్నట్లు తెలిపారు.  శ‌నివారం ఆయ‌న హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించిన విష‌యం తెలిసిందే. నాల్స‌ర్ న్యాయ విద్యాల‌యంలో జ‌రిగిన స్నాత‌కోత్స‌వంలో ఆయ‌న పాల్గొన్నారు. ఒక‌టి లేదా రెండు రోజుల్లో ఆయ‌న కోలుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు అధికారి తెలిపారు. జూలై 12వ తేదీన సీజేఐ హైద‌రాబాద్ వ‌చ్చారు. హైద‌రాబాద్ టూర్ స‌మ‌యంలో ఆయ‌న స్పెష‌ల్ పోస్ట‌ల్ క‌వ‌ర్‌ను కూడా రిలీజ్ చేశారు.
సుప్రీం చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్  అస్వ‌స్థ‌త‌ Publish Date: Jul 14, 2025 5:26PM

రామోజీ ఫిలిం సిటీ తెలంగాణలో ఉండటం గర్వంగా ఉంది : సీఎం రేవంత్ రెడ్డి

  సాగర్ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో ఆకాశ్ సాగర్ చోప్రా నిర్మాణ సారథ్యంలో  శ్రీమద్ భాగవత్ం పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాటు చేసిన సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రామోజీ ఫిల్మ్ సిటీలో శ్రీమద్ భాగవతం చిత్రీకరణ జరగడం రాష్ట్రానికే గర్వకారణం అన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ.. దేశంలోనే యూనిక్ స్టూడియో అని చెప్పారు. రామాయణం, మహా భారతం, భాగవతం మన జీవితాల్లో భాగం అయిపోయాయని అన్నారు.  ఇలాంటి గొప్ప కథను మరోసారి ప్రజలను అందించాలనే నిర్ణయం తీసుకున్న నిర్మాతలను అభినందించారు. తరం మారుతున్న సందర్భంగా దృశ్యకావ్యం తీయడం గొప్ప విషయం అని ప్రశంసించారు.  40 ఏళ్ల క్రితం టీవీల్లో రామాయణం సీరియల్ వస్తుందంటే.. బయట రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉండేవని గుర్తుచేశారు. ఒక్కరు లేకుండా అందరూ టెలివిజన్‌ల ముందు ఉండేదని అన్నారు. అంతేకాదు.. రామోజీ ఫిల్మ్ సిటీ అనే ఒక గొప్ప స్టూడియో తెలంగాణలో ఉందని చెప్పేందుకు గర్వపడుతున్నానని కొనియాడారు. కాగా, శ్రీమద్ భాగవతం సినిమాన్ని ఆకాష్ సాగర్, సాగర్​పిక్చర్​ఎంటర్​టైన్​మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.  
రామోజీ ఫిలిం సిటీ తెలంగాణలో ఉండటం గర్వంగా ఉంది : సీఎం రేవంత్ రెడ్డి Publish Date: Jul 14, 2025 5:06PM

కడప ఆర్డీవో కార్యాలయం ఎదుట ఉద్రిక్తత

  కడప ఆర్డీవో కార్యాలయం ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు ఆందోళన కారుల మధ్య నెలకొన్న పెనుగులాట, అరెస్ట్ లు ఉద్రిక్తత వాతావరణానికి దారితీశాయి . దళితులు తమ భూములను ఇతరులు కబ్జా చేశారని గత నెల రోజులుగా ఆర్డీవో  కార్యాలయం ఎదుట దీక్షలు చేస్తున్నారు. వీరికి రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ మద్దతు ఇచ్చింది. ఎందుకూ  సమస్య పరిష్కారం కాకపోవడం, అధికారులు స్పందించక పోవడం తో రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులు  ఆర్డీఓ కార్యాలయం ముట్టడించారు. దీంతో  పోలీసులు ముట్టడిని బలవంతంగా బగ్నం చేసి రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులతో పాటు ఆందోళనకాలను బలవంతంగా లాక్కెళ్లి అరెస్ట్ చేశారు. ఈ పరిస్థితి అక్కడ ఉద్రిక్తత వాతావరణాన్ని కల్పించింది. పోలీసులు అరెస్టులతో ఆగకుండా నెల రోజులుగా  ఆందోళన చేపట్టిన దీక్ష శిబిరాన్ని కూల్చేశారు. దీంతో  రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులు, బాధిత దళితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కబ్జా కోరనుండి మా‌భూములకు విముక్తి కల్పించకపోగా తమను అరెస్ట్ చేయడం,చేయడం దీక్షా శిబిరం కూల్చివేయడం కారణమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. *అరెస్టులతో ఆపలేరు: రవిశంకర్ రెడ్డి దళితులు చేస్తున్న న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని, గత 29 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తూఉంటే అధికారులు స్పందించకపోవడం , పోలీసులతో ఉద్యమాలను అణిచివేయాలని, టెంట్ ను తొలగించి దళితులను భయబ్రాంతులకు గిరిచేయడం  తగదని, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి మండి పడ్డారు.అరెస్ లో పై ఆయన  మాట్లాడుతూ, పేదలైన దళితుల సమస్యలను పరిష్కరించాలని అడిగితే పోలీసులను పెట్టి అరెస్టు చేయడం సరైన పద్దతి కాదన్నారు. సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు ప్రభుత్వాలు వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా న్యాయం అడుగుతున్న  దళితులపై పోలీసుల ఉక్కు పాదాలను మోపడం ఏమిటని అయన ప్రశ్నించారు, సమస్యలను అధికారులు  పరిష్కరించకుండా ఉద్యమాలను అరెస్టులతో ఆపుతామనుకోవడం అవివేకమని అన్నారు.  దళితుల ఆందోళనలను అణచివేయటానికి పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరింపచేసి గంటల తరబడి అరెస్టుకు ప్రణాళికలు చేసేబదులు పదినిమిషాలలో అధికారులు కూర్చుని సమస్యను పరిష్కరించవచ్చునని ఆయన అన్నారు. పాత కడప దళితుల భూమి సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేస్తే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. అరెస్ట్ అయిన వారు ఏఐసీసీ కోఆర్డినేటర్ ఎస్ ఎ సత్తార్, దళిత గిరిజన హక్కుల పోరాట సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు మడగలం ప్రసాద్, వెంకటేష్, రాయలసీమ మహిళా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మీదేవి, తస్లిమ్  రమేష్ బాబు, దివాకర్, గోపాల్, వీరయ్య, బాబు చిన్న సుబ్బయ్య, కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి ఓబయ్య, ఓబులేసు, సిపిఐ యం యల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి బ్ల్యూ రాము, ఎమ్మార్పీఎస్ నాయకులు బీసీ గంగులు, ఆంజనేయులు, సుబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు.  
కడప ఆర్డీవో కార్యాలయం ఎదుట ఉద్రిక్తత Publish Date: Jul 14, 2025 4:31PM

అశోక్ గజపతిరాజుకు అభినందనలు చెప్పిన సీఎం చంద్రబాబు

  తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్ గా నియమితులవడం పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. గోవా గవర్నర్ గా నియమితులైన పి.అశోక్ గజపతిరాజుకు హృదయపూర్వక శుభాభినందనలు. ఏపీ ప్రజలకు ఇది గర్వకారణం. అశోక్ గజపతిరాజుకు ఇంతటి గౌరవనీయ పదవిని ఇచ్చిన సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి, ప్రధాని నరేంద్ర మోదీకి  కేంద్ర మంత్రి వర్గంకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ విశిష్ట పదవిలో అశోక్ గజపతిరాజు  విజయవంతం అవ్వాలని, పదవీకాలాన్ని పరిపూర్ణంగా నిర్వర్తిస్తారని ఆకాంక్షిస్తున్నాను" అంటూ   సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.  హరియాణా గవర్నర్‌గా ప్రొఫెసర్‌ ఆషిమ్‌కుమార్‌ ఘోష్‌, లద్దాఖ్‌ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవీందర్‌ గుప్తాను నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు హరియాణా గవర్నర్‌గా పనిచేసిన బండారు దత్తాత్రేయ పదవీకాలం ముగిసింది. అశోక్ గజపతిరాజు 1951 జూన్ 26న జన్మించారు. గ్వాలియర్‌లోని సింధియా, హైదరాబాద్‌ పబ్లిక్ స్కూల్‌, విశాఖలోని ప్రభుత్వ కృష్ణా కళాశాలలో ఆయన చదువుకున్నారు. పుట్టింది రాజవంశంలోనే అయినా సామ్యవాద భావాలను ఆయన చిన్నప్పటి నుంచే పుణికి పుచ్చుకున్నారు. విద్యార్థి దశలో కూడా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు.  ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ ఆయన ప్రత్యక్ష రాజకీయ అరంగేట్రానికి తెరతీశారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటివరకూ మొత్తం 20 మంది వివిధ రాష్ట్రాలకు గవర్నర్లుగా పనిచేశారు. అలాగే ఒడిశా, తమళినాడులోని తెలుగు కుటుంబాల్లో జన్మించిన ఇద్దరితోపాటు తెలుగింటి కోడలుగా వచ్చి ఒకరు కూడా గవర్నర్లుగా పనిచేశారు. అంతేకాకుండా వీరిలో పలువురు ఏకకాలంలో వివిధ రాష్ట్రాల్లో గవర్నర్లుగా ఉన్నారు  
అశోక్ గజపతిరాజుకు అభినందనలు  చెప్పిన సీఎం చంద్రబాబు Publish Date: Jul 14, 2025 3:58PM

తిరుపతి రైల్వే స్టేషన్ లో ప్రమాదం.. ఆగి ఉన్న రెండు రైళ్లలో మంటలు

తిరుపతి రైల్వేస్టేషన్ లో  ఆగి ఉన్న రైలు బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో తీవ్ర రైల్వే స్టేషన్ లో ఉన్న ప్రయాణీకులు, సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.  తిరుపతి హిసార్ ఎక్స్ ప్రెస్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రైలు బోగి పూర్తిగా కాలిపోయింది. అప్రమత్తమైన ఫైర్ అధికారులు మంటలు వచ్చిన బోగీని  రైలు నుంచి వేరు చేయడంతో పెద్ద ప్రమాదం  తప్పింది. రైల్వే స్టేషన్ నుంచి గ్యారేజీని తీసుకెళ్తుండగా ప్రమాదం  జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైలు బోగీని వేరు చేయడంతో పెను ప్రమాదం తప్పిందని తెలిపారు. అదే విధంగా తిరుపతి రైల్వే స్టేషన్ లోని లూప్ లైన్ లో ఆగి ఉన్న ప్యాసింజర్ రైలులోని బోగీలో కూడా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో రైలులో ప్రయాణీకులు ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభఢవించలేదు. రైల్వేసిబ్బంది, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. దాదాపు ఒకే సమయంలో రెండు రైళ్లలోని బోగీలలో మంటలు చెలరేగడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక బోగీలలో మంటలు చెలరేగడానికి కారణాలు ఏంటి అన్నదానిపై శాఖాపరమైన విచారణ జరుగుతోంది. 
తిరుపతి రైల్వే స్టేషన్ లో ప్రమాదం.. ఆగి ఉన్న రెండు రైళ్లలో మంటలు Publish Date: Jul 14, 2025 3:38PM

రేణిగుంట ఫ్యాక్టరీలో పేలిన రియాక్టర్

  తిరుపతి జిల్లా రేణిగుంటలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. క్రోమో మెడికేర్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. కంపెనీ సిబ్బంది సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్నా ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.  రియాక్టర్ పేలుడుకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. సంగారెడ్డి జిల్లా  పాశమైలారం సిగాచి కంపెనీలో రియాక్టర్ పేలి సుమారు 40 మంది మరణించిన విషాద ఘటన ఇంకా మరిచిపోకముందే ఏపీలో అలాంటి ప్రమాదమే జరగడం అందరినీ కలవరపెడుతోంది. ఫ్యాక్టరీలు కనీస నాణ్యతా ప్రమాణాలు, జాగ్రత్త చర్యలు పాటించకుండా కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  
రేణిగుంట ఫ్యాక్టరీలో పేలిన రియాక్టర్ Publish Date: Jul 14, 2025 3:14PM

ఇండోనేషియాలో భారీ భూకంపం

ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.7గా నమోదైంది. తనింబర్ దీవుల ప్రాంతంలో భూకంపం వచ్చినట్టు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అయితే.. సునామీ వచ్చే అవకాశం లేదని ఆ దేశ జియోఫిజిక్స్ ఏజెన్సీ తెలిపింది. ఈ భూకంపకేంద్రం భూమికి  98 కిలో మీటర్లు అంటే  60.89 మైళ్ళు  లోతులో ఉందని తెలిపింది. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ భూకంపం 6.7 తీవ్రతతో, 10 కి.మీ (6.21 మైళ్ళు) లోతులో నమోదైందని నివేదించింది. తూర్పు ఇండోనేషియాలోని అనేక చిన్న పట్టణాల్లో ప్రకంపనలు సంభవించాయని ఏజెన్సీ పేర్కొంది. అయితే, ఈ భూకంపంలో నష్టం జరిగినట్లు తక్షణ నివేదికలు రాలేదని డిసాస్టర్ మేనేజ్మెంట్ తెలిపింది. ఇండోనేషియా.. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలవబడే ప్రాంతంలో ఉంది. ఇది అత్యంత భూకంపాలు సంభవించడానికి అవకాశం ఉన్న మండలం. ఇక్కడ భూమి.. క్రస్ట్‌లోని వివిధ ప్లేట్లు కలుస్తాయి. కాబట్టి, ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో భూకంపాలు సంభవించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇండోనేషియాలో భారీ భూకంపం Publish Date: Jul 14, 2025 2:58PM

రఫేల్ అంపైరింగ్‌లో ఇండియా గెలవడం కష్టమే అంటున్న అశ్విన్

ఇండియా, ఇంగ్లాండ్ మూడో టెస్టు రసవత్తరంగా మారింది. ఇండియా విజయం సాధించాలంటే చివరి రోజు ఆటలో 135 పరుగులు చేస్తు చాలు. చేతిలో ఇంకా ఆరు వికెట్లు ఉన్నాయి. అద్భుత ఫామ్ లో ఉన్న రాహుల్ క్రీజ్ లో ఉన్నాడు. ఫామ్ కొనసాగిస్తున్న రిషభ్ పంత్, సిరీస్ లో ఇప్పటికే మూడు హాఫ్ సెంచరీలతో చెలరేగిన జడేజా బ్యాటింగ్ చేయాల్సి ఉంది. పరిస్థితులలో టీమ్ ఇండియా విజయం నల్లేరు మీద బండినడే అని ఎవరైనా భావిస్తారు. అయితే టీమ్ ఇండియా మాజీ ఆటగాడు, స్టార్ స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ మాత్రం ఇండియా విజయం సాధించడం అంత వీజీకాదు.. చాలా చాలా కష్టం అంటున్నాడు. అందుకు ఇంగ్లాండ్ బౌలర్ల లైన్ అండ్ లెంగ్త్, కచ్చితత్వంతో కూడుకున్న బౌలింగ్ ఇవేవీ కారణం కాదంటున్నారు. ఇంతకీ టీమ్ ఇండియాకు విజయం ఎందుకు కష్టమంటే.. ఈ మ్యాచ్ లో అంపైరింగ్ చేస్తున్న  పౌల్ రఫేద్ వ్యవహరిస్తున్న తీరు కారణమంటున్నాడు. నిజమే మూడో టెస్టులో రఫేల్ అంపైరింగ్, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. రఫేల్ ఉద్దేశపూర్వకంగా ఇంగ్లాండ్‌కు సహకరిస్తున్నారని టీమ్ ఇండియా స్టార్ స్పిన్నర్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలే అందుకు ప్రత్యక్ష నిదర్శనగా నిలుస్తున్నాయి. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇప్పటికే చెరో టెస్ట్ మ్యాచ్ గెలిచి సమానంగా ఉన్న టీమ్ ఇండియా, ఇంగ్లండ జట్లు మూడో టెస్ట్ మ్యాచ్‌ను చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి . దీంతో లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతోంది. ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలో తీవ్ర భావోద్వేగాలకు గురవుతున్నారు. కాగా.. తాజా మ్యాచ్‌లో అంపైర్ పౌల్ రఫెల్  వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా ఉంది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అవుట్ విషయంలో రఫెల్ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. సిరాజ్ బౌలింగ్‌లో బంతి నేరుగా వెళ్లి స్టోక్స్ ప్యాడ్స్‌ను తాకింది. అప్పీల్ చేయగా రఫెల్ నాటౌట్ అని ప్రకటించాడు. దీంతో టీమిండియా ఆటగాళ్లు డీఆర్‌ఎస్ తీసుకున్నారు. అయితే రివ్యూలో అంపైర్స్ కాల్ ప్రకారం నాటౌట్ అని ప్రకటించారు. ఈ విషయంపై మాజీ ఆటగాడు ఆశ్విన్ స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అంపైర్ రఫెల్‌పై ఆరోపణలు చేశాడు. రఫెల్ అంపైరింగ్ చేస్తున్న మ్యాచ్‌లో గెలవడం టీమిండియాకు కాస్త కష్టమేనని వ్యాఖ్యానించాడు. 'పౌల్ రఫెల్‌తో నాకున్న అనుభవం ప్రకారం ఎప్పుడూ అతడితో వాదిస్తూ ఉండాలి. టీమిండియా బౌలింగ్ చేస్తున్నప్పుడు అతడికి ఏదైనా నాటౌట్‌లాగానే కనిపిస్తుంది. అదే టీమిండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మాత్రం ఏదైనా అవుట్‌లా అనిపిస్తుంది. ఇతర జట్లతో కూడా రఫెల్ ఇలాగే వ్యవహరిస్తున్నాడో, లేదో తెలియదు. ఈ విషయంపై ఐసీసీ ఒకసారి దృష్టి సారించాలి. పౌల్ రఫెల్ మైదానంలో ఉంటే ఇండియా గెలవదు అని మా నాన్న అంటుంటారు' అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో వ్యాఖ్యానించాడు.
రఫేల్ అంపైరింగ్‌లో ఇండియా గెలవడం కష్టమే అంటున్న అశ్విన్ Publish Date: Jul 14, 2025 2:46PM

వైసీపీ నేతల పుష్ఫ డైలాగ్‌లు.. జగన్ మెహర్బానీ కోసమేగా?

రప్పా.. రప్పా.. డైలాగ్‌పై పేటెంట్ తీసుకున్నట్లు దాన్నే స్లోగన్‌గా మార్చేసుకుంటున్నారు వైసీపీ నేతలు ... జగన్ సైతం ఆ డైలాగ్‌‌ వాడకాన్ని సమర్ధించడంతో ఆయనతో వీరతాళ్లు వేయించుకోవడానికి ఎవరికి వారు ఆ పుష్ఫ డైలాగ్ తెగ రిపీట్ చేస్తున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని దగ్గర నుంచి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కొడుకు వరకు ఆ డైలాగ్ వాడుతూ కార్యకర్తలను రెచ్చ గొడుతూ.. పోలీసులకు వార్నింగులిస్తున్నారు. కృష్ణాజిల్లాలో బాబు ష్యూరిటీ మోసం కార్యక్రమాల్లో పాల్గొంటున్న మాజీ మంత్రి పేర్ని నాని రప్పా.. రప్పా..డైలాగ్ పై చేసిన కామెంట్స్‌ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. లోకేష్‌ రెడ్ బుక్ అంటున్నాడు.. మీరు కూడా రప్పా.. రప్పా అంటున్నారు.. ఏదైనా పని చేయాలంటే రప్పా రప్పా అనడం కాదు.. చీకట్లో కన్నుకొడితే పని అయిపోవాలని పేర్నినాని వ్యాఖ్యానించడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. మూడు నాలుగు రోజులుగా పేర్ని నాని ఎక్కడకు వెళ్లినా అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో వైసీపీ కార్యకర్తల విస్తృత  సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కాటాసాని రామిరెడ్డి కొడుకు ఓబుల్ రెడ్డి కూడా  సినిమా స్టైల్లో డైలాగులు వల్లె వేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచకాలు సృష్టిస్తున్నారని..  కూటమి నాయకులకు వత్తాసు పలుకుతున్న అధికారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని భారీ వార్నింగ్ ఇచ్చారు.  వైసిపి 2.0 అంటే జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే టిడిపి నాయకుల  తుకులు ఎలా ఉంటాయో చూస్తాం.. అంటూ అనుచిత బాషలో చెలరేగిపోయారు ఓబుల్‌రెడ్డి. మరోవైపు  విద్యాశాఖ మాజీమంత్రి ఆదిమూలపు సురేష్‌కు సైతం రప్పా..రప్పా.. పూనకం రావడం విశేషం. ప్రకాశం జిల్లా కొండేపి వైసీపీ ఇంచార్జ్ ఆదిమూలపు సురేష్ పార్టీ  సమావేశంలో పాల్గొన్న కార్యకర్తలని రెచ్చగొడుతూ  చేసిన వాఖ్యలు సంచలనంగా మారాయి. ఇప్పటివరకు ఒక లెక్క ఇకనుండి కొండేపి నియోజకవర్గంలో మరో లెక్క అంటూ కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడి కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మాజీమంత్రి పినిపే విశ్వరూప్ కూడా అదే మంత్రం ఎత్తుకున్నారు.. ఆ ఫ్లోలో రూరల్ సిఐ ప్రశాంత్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ధ్వజమెత్తిన ఆయన.. రాబోయేది  వైసీపీ ప్రభుత్వమని సిఐని విఆర్ లో  పెట్టిస్తానని.. జైల్లో పెట్టించి, ఊచలు లెక్కిపెట్టిస్తానని హెచ్చరించారు . ఒకవైపు కూటమి ప్రభుత్వం సంవత్సర పాలనపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు కార్యక్రమాలు నిర్వహస్తోంది. సంవత్సర కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ఎంతవరకు అమలు జరిగాయో తెలుసుకొని, అర్హత కలిగి ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల లబ్ది పొందలేని వారికి సంక్షేమ పథకాలను అందజేసేందుకు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే,  మంత్రులు వాడవాడకు,ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాల అమలు తో పాటు స్థానిక సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించే పనిలో పడ్డారు. గెలిచిన తరువాత ఏసీ గదులకు, సొంత కార్యాలయాలకు ... దూరపు నగరాలకు పరిమితం అయిన నేతలు ప్రజల్లోకి వెళ్లటం మొదలు పెట్టారు. దీంతో ప్రజల్లో కూటమి నేతలకు మంచి ఆదరణ లభిస్తోందంటున్నారు. అది గమనించిన వైసీపీ అధిష్టానం టీడీపీ మ్యానిఫెస్టోలో పెట్టిన సూపర్ సిక్స్ పథకాల లో కొన్ని పథకాలను అమలు చెయ్యలేదని దానిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించింది. దీంతో విద్రోహ దినం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినా ఆశించిన ఫలితం రాలేదు.  ఆ క్రమంలో వైసీపీ అధిష్టానం వెంటనే .. బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ .. పేరుతో కార్యక్రమానికి పిలుపునిచ్చి నేతలను ప్రజల్లోకి వెళ్లాలని తీర్మానించింది. దీంతో ప్రజల్లోకి వెళ్లేందుకు వారు ఏ మార్గం దొరక్క  కార్యకర్తలను రెచ్చగొడుతున్నారంట.  వైసీపీ అధ్యక్షుడి కార్యక్రమాల్లో కూడా అదే ఉద్దేశ్యంతో కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ప్లెక్సీలు కూడా ఏర్పాటు చేయిస్తుండటం, వాటిని జగన్ సమర్ధిస్తుండటం అందులో భాగమే అంటున్నారు. జగన్ ఎక్కడకు వెళ్లినా అక్కడ భారీ జనసమీకరణతో పాటు ఏదో ఒక గొడవ సృష్టిస్తూ చర్చల్లో నిలవడడమే పనిగా పెట్టుకున్నారు.  పేర్ని నాని రెచ్చగొట్టే వ్యాఖ్యలపై ఉమ్మడి క‌ృష్ణా జిల్లాలో ఇప్పటికే నాలుగైదు కేసులు నమోదయ్యాయి. పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన కాటసాని ఓబుల్ రెడ్డిపై బనగానపల్లె స్టేషన్లో కేసు నమోదు అయింది. కూటమి నేతలు, పోలీసులను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తానంటున్న పినిపే విశ్వరూప్ వంటి వారిపై కూడా కేసు పెట్టడానికి కూటమి శ్రేణులు సిద్దమవుతున్నాయి. మొత్తమ్మీద ఈ రప్పా.. రప్పా.. రాజకీయం ఏ మలుపులు తిరుగుతుందో
వైసీపీ నేతల పుష్ఫ డైలాగ్‌లు.. జగన్ మెహర్బానీ కోసమేగా? Publish Date: Jul 14, 2025 2:40PM

వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి క్యాబినెట్ బెర్త్?

కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై ఇటీవల అదే నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు నల్లపరెడ్డి ప్రశన్నకుమార్ రెడ్డి చేసిన దారుణ వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై ఈ విషయంలో కేసు కూడా నమోదైంది. అయితే ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలూ లేవు. అయితే.. రాజకీయాలతో సంబంధం లేకుండా సర్వత్రా నల్లపరెడ్డి ప్రసన్నకుమారరెడ్డి వ్యాఖ్యలపై ఖండనలు వెల్లువెత్తాయి. మహిళా నేతపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని సామాన్యజనం కూడా గర్హించారు. సరే ఈ వ్యాఖ్యల తరువాత ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంపై దాడి జరిగిందనుకోండి అది వేరే విషయం.  నెల్లూరు జిల్లాపై వేమిరెడ్డి కుటుంబానికి మంచి పట్టుంది. అన్నిటికీ మించి ఎమ్మెల్యేగా ప్రశాంతి రెడ్డి ప్రజలలో మమేకమై సమస్యల పరిష్కారంలో, నియోజకవర్గ అభివృద్ధిలో దూసుకుపోతున్నారు.   కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి మంచి పేరుంది. ఎమ్మెల్యేగా ఆమె ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా వ్యవహరిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ప్రభుత్వ సహకారం కోసం వేచి చూడకుండా నియోజకవర్గంలో తన సొంత ఫౌండేషన్ నిధుల ద్వారా నియోజకవర్గ సమస్యలను పరిష్కరించడం ద్వారా ఆమె ప్రజలలో మరీ ముఖ్యంగా మహిళలకు బాగా చేరువయ్యారు.  ఈ పరిస్థితుల్లో ఆమెకు ప్రజలలో పెరుగుతున్న పలుకుబడిని జీర్ణించుకోలేక, ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేందుకే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని జనం కూడా నమ్ముతున్నారు. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం కూటమి పార్టీల నేతలంతా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి సంఘీభావం ప్రకటించారు. ఆమెకు బాసటగా నిలిచారు. ఇప్పుడు ఆమెను తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కేబినెట్ లోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. త్వరలో చంద్రబాబు తన కేబినెట్ ను విస్తరించనున్నారు. ఈ విస్తరణలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి కేబినెట్ లో చోటు కల్పించడం ద్వారా తెలుగుదేశం మహిళలకు అండగా, బాసటగా నిలుస్తుందన్న సందేశం ఇచ్చినట్లుగా ఉంటుందని తెలుగుదేశం అధినాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు.  అలాగే వేమిరెడ్డి కుటుంబానికి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మంచి పట్టు ఉంది. ఆమె భర్త, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డికి కూడా బలమైన నేత. ప్రజలలో మంచి పట్టున్న నాయకుడు.   వాస్తవానికి గత ఏడాది ఎన్నికలలో తెలుగుదేశం కూటమి విజయం సాధించి చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరిన సమయంలోనే తన భార్య వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి మంత్రి పదవి వస్తుందని ఆయన ఆశించారు. అయితే అప్పుడు అది జరగలేదు.   అయితే ఇప్పుడు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని క్యాబినెట్ లోకి తీసుకోవడం ద్వారా వైసీపీకి గట్టి పట్టున్న కోవూరు నియోజరకవర్గంలో  తెలుగుదేశం పార్టీని పటిష్టం చేయడానికి దోహదం చేస్తుందని తెలుగుదేశం అధినాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు.    రాష్ట్ర విభజన తరువాత 2014లో జరిగిన ఎన్నికలలో రాష్ట్రంలో తెలుగుదేశం విజయం సాధించి అధికారంలోకి వచ్చినప్పటికీ నెల్లూరు జిల్లాలో మాత్రం మొత్తం పది స్థానాలలో సైకిల్ పార్టీ కేవలం మూడు స్థానాలలో మాత్రమే విజయం సాధించింది. ఇక 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లాలో కనీసం ఒక్కటంటే ఒక్క స్థానం కూడా గెలవ లేకపోయింది. అయితే 2024 ఎన్నికలలో వైసీపీని కూటమి హవా జీరో స్థానాలకు పరిమితం కావడంలో వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి పాత్ర కీలకమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి గత ఎన్నికలలో వైసీపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిని నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ,  ఆ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థుల విషయంతో తనను జగన్ విశ్వాసంలోకి  తీసుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తికి గురైన వేమిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం గూటికి చేరారు. ఈ చేరిక జిల్లా రాజకీయాలపై ప్రభావం చూపిందనీ, జిల్లాలో జగన్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలడానికి కారణమైందని అంటున్నారు.  ఈ నేపథ్యంలోనే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని తెలుగుదేశం కూటమి కేబినెట్ లోకి తీసుకోవడం  జిల్లాలో వైసీపీ కోలుకోలేని విధంగా  దెబ్బకొట్టినట్లు అవుతుందని భావిస్తున్నారు. 
వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి క్యాబినెట్ బెర్త్? Publish Date: Jul 14, 2025 11:02AM

పెట్టుబడులు, ఉద్యోగ ఉఫాధి అవకాశాలే లక్ష్యంగా స్పేస్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటు!

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్పేస్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేయనుంది. వచ్చే ఐదేళ్ల కాలానికి కొత్త  అంతరిక్ష విధానాన్ని ప్రకటించిన చంద్రబాబు సర్కార్.. ఈ విధానం అమలుకు ఏపీ స్పేస్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది.  స్పేస్ పాలసీ ద్వారా పెట్టుబడుల ఆకర్షణ, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్, అలాగే స్టార్టప్ లను నిధులు వంటివి లక్ష్యాలుగా పెట్టుకుంది. ఇందు కోసం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లను భాగస్వాములుగా ఆహ్వానించనుంది. ఇక స్పేస్ సిటీ కార్పొరేషన్ ద్వారా అంతరిక్ష ప్రాజెక్టుల అమలు పర్యవేక్షించనుంది.  సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో  స్పేస్ సిటీలను ఏర్పాటు చేయడానికి నిర్ణయించిన ప్రభుత్వం, ఇందు కోసం అవసరమైన భూకేటాయింపులపై దృష్టి సారించింది.  భూ కేటాయింపులు మరియు దరఖాస్తుల పరిశీలన వంటి ప్రక్రియల కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయనుంది.  అంతరిక్ష రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడంతో పాటు పాతిక వేల కోట్ల పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఈ విధానాన్ని రూపొందించారు.  ఈ లక్ష్యం నెరవేరితో   ప్రత్యక్షంగా 5 వేల మందికి, పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి కలుగుతుందని అంచనా వేస్తున్నారు.  
పెట్టుబడులు, ఉద్యోగ ఉఫాధి అవకాశాలే లక్ష్యంగా స్పేస్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటు! Publish Date: Jul 14, 2025 9:51AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటన.. ఎందుకు? ఎప్పుడు?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ లో పర్యటించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా ఈ నెల 26 నుంచి ఐదు రోజుల పాటు చంద్రబాబునాయుడు సింగపూర్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో చంద్రబాబుతో పాటు మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్ కూడా ఉంటారు. ఉన్నతాధికారుల బృందం కూడా ఈ పర్యటనలో పాల్గొంటుంది.   ఈ పర్యటనలో చంద్రబాబు బృందం సింగపూర్ లో ప్రభుత్వ పెద్దలతో పాటు,  పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ అవుతుంది.  ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను వారికి వివరిస్తుంది. అలాగే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారికి ఏపీ సర్కార్ అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరిస్తుంది. ప్రధానంగా  ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెనెవబుల్ ఎనర్జీ రంగాలలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా చంద్రబాబు సింగపూర్ పర్యటన సాగనుంది.  
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటన.. ఎందుకు? ఎప్పుడు? Publish Date: Jul 14, 2025 9:32AM

వర్షాకాలంలో రాగి పాత్రలో నీరు తాగితే అద్భుతమే..!

  రుతుపవనాలు వచ్చాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. అయితే, వర్షాకాలం వచ్చిన వెంటనే, ఆరోగ్య సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది. ఈ వర్షాకాలంలో ఆరోగ్య రక్షణ కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.  వాటిలో రాగి పాత్రలో నిల్వ చేసిన నీరు తాగడం ఒకటని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  రాగి పాత్రలో ఉంచిన నీరు ఈ సీజన్‌లో ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రాగి నీరు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, అనేక వ్యాధుల నుండి కూడా రక్షిస్తుంది. ఇది అమృతం లాంటిది. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. వర్షాకాలంలో నీటి కాలుష్యం ప్రమాదం పెరుగుతుంది, ఇది ఇన్ఫెక్షన్ లకు దారితీస్తుంది. ఇలాంటి పరిస్థితిలో, రాగి నీరు సురక్షితమైన ఆయుర్వేద నివారణ. రాగి యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది నీటిలో ఉన్న హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది,  నీటిని శుద్ధి చేస్తుంది. రాగి పాత్రలోని నీరు స్వచ్ఛమైనది.  శరీరం నుండి విషాన్ని బయటకు పంపి, శరీరాన్ని ఆరోగ్యంగా,  మనస్సును ఉల్లాసంగా ఉంచడంలో సహాయపడుతుంది. రాగి పాత్రలో నీరు త్రాగడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా బలపడుతుంది. ఇది ఆహారాన్ని బాగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది.  మలబద్ధకం, అపానవాయువు,  అజీర్ణం వంటి కడుపు సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. దీనితో పాటు ఈ నీరు మూత్రపిండాల ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.  మూత్రపిండాలు సజావుగా పనిచేయడానికి సహాయపడుతుంది. రాగి పాత్రలోని  నీరు రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది. ఇది వర్షాకాలంలో వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. రాగి నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మానికి కూడా మేలు జరుగుతుంది. ఇది చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది,  ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఆయుర్వేదం కూడా రాగి పాత్రలో నీరు త్రాగమని సిఫార్సు చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం రాగి నీరు శరీరంలోని త్రిదోషాలను (వాత, పిత్త, కఫ) సమతుల్యం చేస్తుంది. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రాగి పాత్రలో నీటిని రాత్రంతా ఉంచి ఉదయం ఖాళీ కడుపుతో త్రాగడం ఉత్తమం.  కానీ పాత్ర తుప్పు పట్టకుండా ఉండటానికి దానిని క్రమం తప్పకుండా శుభ్రపరచడం అవసరం. ఈ చిన్న మార్పుతో వర్షాకాలంలో కూడా నీరు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.                                   *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..  
వర్షాకాలంలో రాగి పాత్రలో నీరు తాగితే అద్భుతమే..! Publish Date: Jul 14, 2025 9:30AM

పాలసీల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు!

ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇప్పుడు పాలసీ అనేది కామన్ అయిపోయింది. ఏ రోజు సంపాదన ఆరోజు సరిపోయి ఏదో జీవితం అట్లా సాగుతున్నవాళ్ళు తప్ప పేదల నుండి, మధ్యతరగతి, ధనవంతుల వరకు ఈ పాలసీలలో మునిగి తేలుతున్నారు. ఇంకా చెప్పాలంటే మధ్యతరగతి వారి మీదనే ఈ పాలసీ సంస్థలు కూడా నడుస్తున్నాయంటే కాస్త ఆశ్చర్యం వేస్తుంది. ధనవంతులకు ఈ పాలసీలు ఉన్నా లేకపోయినా ఏమి సమస్య లేదు. పెద్దలు వెనుకేసిన ఆస్తులు, బ్యాంక్ బ్యాలెన్సులు, వ్యాపార లాభాలు వంటివి సమృద్ధిగా ఉండటం వల్ల వారికి పాలసీల గురించి పెద్ద ఆసక్తి కూడా తక్కువే.  అయితే వ్యక్తి నుండి వాహనాలకు, వస్తువులకు, ఇళ్లకు, సంస్థలకు ఇన్సూరెన్స్ చేయించడం అనేది మొదలయ్యాక ఈ ధనవంతులు కూడా వీటితో బాగానే ప్రయోజనాలు పొందుతున్నారు. ఇకపోతే చాలా చోట్ల చాలా కుటుంబాలలో కనిపించే అతి సాధారణ సమస్య ఒకటుంది. శ్రీరామ్ చిట్స్ ఎల్.ఐ.సి హెచ్.డి.ఎఫ్.సి ఇంకా ఇంకా వివిధరకాల బోలెడు సంస్థలు ఎన్నో ఇన్సూరెన్స్ లు అందిస్తున్నాయి. వీటిలో పాలసీలు తీసుకుని వాటిని కడుతున్న వారిలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు అధికంగా ఉంటాయి. అయితే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు ఎదుర్కొనే సమస్య పాలసీ చెల్లింపు గడువు రాగానే పైసల కోసం వెతుక్కోవడం. నిజానికి ఈ పాలసీలు కట్టడం మొదలుపెట్టినప్పుడు తప్ప మిగిలిన సందర్భాలలో డబ్బు సమకూర్చుకోవడం కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనిక్కారణం సరైన ప్లానింగ్ లేకపోవడమే అనేది చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. సగటు మధ్యతరగతి వ్యక్తి ఆరు నెలలకు ఒకసారి మూడువేల రూపాయల పాలసీ కట్టడానికి నిర్ణయించుకుంటే అతడి నెలవారీ సంపాదనలో ఐదువందల రూపాయలను పక్కన పెడుతుండాలి. ఆ ఆరు నెలల మొత్తం పాలసీ చెల్లింపును ఎలాంటి ఆందోళన లేకుండా చేస్తుంది. కానీ మధ్యతరగతి వాళ్ళు ఈ విషయం గూర్చి ఎక్కువ ఆలోచించరు. తీరా చెల్లింపు గడువు ముందుకొచ్చినప్పుడు అప్పు చేసో లేక వేరే చెల్లింపుల నుండి దీనికి డబ్బు మరల్చడమో చేస్తుంటారు. ఫలితంగానే ఒకవైపు ఇన్సూరెన్స్ లు కడుతూ మరోవైపు అప్పులు చేస్తూ ఉంటారు. ఇదీ సగటు మధ్యతరగతి పాలసీదారుని పితలాటకం. హెల్త్ ఇన్సూరెన్స్ లు వచ్చినప్పటి నుండి ఓ ఆలోచన పురుగులా మెదడును తొలిచేది. చావుకు అగ్రిమెంట్ రాసుకున్నట్టు చస్తే ఆ ఇన్సూరెన్స్ తాలూకూ డబ్బులు బోల్డు వస్తాయని కదా ఇవన్నీ అని. కానీ నిజానికి  పేద, మధ్యతరగతి వ్యక్తులు ఎప్పుడూ ఇంతే కదా కుటుంబచట్రంలో ఇరుక్కుపోయిన జీవులు కదా అనిపిస్తుంది. ఇకపోతే ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఇలాంటి ఆలోచనలు చేసే మధ్యతరగతి జీవుల వల్ల హాయిగా తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నాయి.  సంవత్సరంలో ఈ పాలసీలు కట్టాలనే కోణంలో తమ సంతోషాలు కూడా వధులుకుంటున్న మధ్యతరగతి కుటుంబాలు కోకొల్లలు ఉన్నాయి. మనిషికోక పాలసీ, కానీ సంపాదన ఒకే ఒకరిది. ఇబ్బందులున్నా కట్టడానికే ముందుకు వెళ్తారు. కారణం భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉండటమే.  పాలసీలతో జాగ్రత్త! కొందరుంటారు. ఈ పాలసీ సంస్థలలో పనిచేసే ఎంజెంట్లు. వీళ్ళు పాలసీలు తీయించడం, డబ్బులు వసూలు చేయడం పనిగా చేస్తుంటారు. అదే వారి ఉద్యోగం కూడా. అయితే పాలసీ తీయించేటప్పుడు 90% మంది ఆ పాలసీ వల్ల లాభాలు మాత్రమే చెబుతారు. కానీ దాని వల్ల వచ్చే నష్టాలు ఎవరూ ఏమీ చెప్పరు. చివరకు దానివల్ల ఏదో ఒక నష్టం ఎదురయ్యే దాకా దాని గురించి పాలసీదారుడికి తెలియదు కూడ. ఇలాంటి సంఘటనలు బోలెడు జరుగుతూ ఉంటాయి. సగటు మధ్యతరగతి ఒక సంస్థమీద ఎంతకని పోరాడతాడు. కాబట్టి ఒకటికి బట్టి నాలుగైదు సార్లు తిరుగుతాడు, ఆ తరువాత మోసం చేసిన వాడి నాశనం వాడిదే  అనుకుని కొన్నిరోజులు బాధపడి తిరిగి జీవితమనే పోరాటంలో పడిపోతాడు. కానీ నిజానికి ఆ సంస్థవాడు హాయిగా తన వ్యాపారాన్ని పెంచుకుంటూ ఉంటాడు. కాబట్టి పాలసీ తీసుకునేటప్పుడు అందులో ప్లస్ పాయింట్స్ మాత్రమే కాదు మైనస్ పాయింట్స్ ఏంటి అనేది మొదట అందరూ తెలుసుకోవాలి. పైన చెప్పుకున్న విషయమంతా చదివాక పాలసీ అంటే భరోసా ఇవ్వాలి కానీ అది చిరాకు పెట్టించేదిగా ఉండకూడదని అందరికీ ఆర్గమయ్యే ఉంటుందనుకుంటా! ◆ వెంకటేష్ పువ్వాడ  
పాలసీల విషయంలో తీసుకోవలసిన  జాగ్రత్తలు! Publish Date: Jul 14, 2025 9:30AM

సైనా, కాశ్యప్ వివాహబంధానికి ఎండ్ కార్ట్.. విడాకులు తీసుకోనున్న స్టార్ షట్లర్లు

బ్యాడ్మింట్ స్టార్ కపుల్ సైనా నెహ్వాల్,  పారుపల్లి కశ్యప్ తమ వివాహ బంధం నుంచి విడిపోవడానికి నిర్ణయించుకున్నారు. తాము విడాకులు తీసుకుంటున్న విషయాన్ని సైనా నెహ్వాల్ సామాజిక మాధ్యమ వేదికగా ప్రకటించారు. తాము విడిపోవాలన్న నిర్ణయం తీసుకున్నామనీ, అన్నీఆలోచాంచిన తరువాతే కాశ్యప్ తో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సైనా నెహ్వాల్ పేర్కొన్నారు.  ఇద్దరం కలిసి అన్ని చర్చించుకుని ఈ నిర్ణయం తీసుకున్నామనీ, జీవితంలో వేరువేరుగా ముందుకు సాగాలని భావించామని తెలిపిన సైనా.. ఈ విషయంలో తమ ప్రైవసీకి భంగం కలిగించవద్దని కోరుతున్నామన్నారు.   సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ ఇరువురూ కూడా  హైదరాబాద్ లోని గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందిన వారే. అక్కడే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. తమ ప్రేమ బంధాన్ని పెళ్లిబంధంగా మార్చుకున్నారు.   2018 డిసెంబర్ లో సైనా, కశ్యప్ ల వివాహం జరిగింది. ఇప్పుడు తాజాగా ఆదివారం (జులై 13) తమ ఏడేళ్ల వివాహబంధానికి ముగింపు పలుకుతున్నట్లుగా సైనా నెహ్వాల్ సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రకటన క్రీడా వర్గాల్లో సంచలనం సృష్టించింది.   సైనా నెహ్వాల్ 2008 లో బిడబ్ల్యుఎఫ్ ప్రపంచ జూనియర్ ఛాంపియన్ షిప్ విజయంతో  ఒక్క సారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. అదే ఏడాది ఆమె ఒలింపిక్స్ లో ఆడింది. తొలి ప్రయత్నంలోనే క్వార్టర్ ఫైనల్ వరకూ వెళ్లి ఆ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా షట్లర్ గా నిలిచింది.  ఆ తరువాత నాలుగేళ్లకు  తొలి ఒలింపిక్ పతకం సాధించింది.  2012 ఒలింపిక్స్ లో సైనా నెహ్వాల్ బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకుంది. సైనాకు 2009లో అర్జున, 2010లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారాలు దక్కాయి. ఇక పారుపల్లి కశ్యప్ విషయానికి వస్తే 2014 కామన్వెల్త్ గేమ్స్ లో అతడు స్వర్ణపతకం సాధించాడు. 32 ఏళ్ల తరువాత కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణం సాధించిన తొలి షట్లర్ గా రికార్డు సాధించాడు. అలాగే ఒలింపిక్స్ లో క్వార్టర్ పైనల్ కు చేరిన తొలి ఇండియన్ షట్లర్ గా నిలిచాడు. 2024లో షటిల్ బ్యాడ్మింటన్ నుంచి రిటైర్ అయిన కాశ్యమ్ ఇప్పుడు కోచ్ గా వ్యవహరిస్తున్నాడు.  
సైనా, కాశ్యప్ వివాహబంధానికి ఎండ్ కార్ట్.. విడాకులు తీసుకోనున్న స్టార్ షట్లర్లు Publish Date: Jul 14, 2025 9:19AM

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం..తొమ్మండుగురు మృతి

అన్నమయ్య జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు. జిల్లాలోని పుల్లంపేట మండలం రెడ్డి పల్లె కట్టపస మామిడికాయల లోడ్ తో వెడుతున్న లారీ బోల్తాపడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలంలోనే ఆరుగురు మరణించారు. పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని రాజంపేట, తిరుపతి ఆస్పత్రులకు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మరణించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన  వ్యక్తం అవుతోంది.  ప్రమాదం జరిగిన సమయంలో లారీలో 18 మంది ఉన్నారు.  మృతులూ, క్షతగాత్రులు కూడా మామాడి కోసే  ఈ ప్రమాదంతో కడప, తిరుపతి మార్గంలో ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది. బోల్తాపడిన లారీని క్రేన్ సాయంతో పక్కకు తీసి పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు.  పుల్లంపేట పోలీసులు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం..తొమ్మండుగురు మృతి Publish Date: Jul 14, 2025 8:59AM

మోదీ @75.. వాట్ నెక్స్ట్?

సెప్టెంబర్ 17.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు.  దేశ విదేశీ ప్రముఖులు, అయన తమ కుటుంబంగా భావించే 140 కోట్ల మంది భారతీయులు శుభాకాంక్షలు చెపుతారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాని జన్మదినాన్ని పురస్కరించుకుని, ప్రత్యేక  కార్యక్రమాలు నిర్వహిస్తే నిర్వహించవచ్చు.  ప్రత్యేక పథకాలు ప్రకటిస్తే ప్రకటించవచ్చు. అలాగే బీజేపీ రక్తదాన శిబిరాల వంటి  సేవా కార్యక్రమాలు నిర్వహించినా నిర్వహించవచ్చు. అంతేనా అంటే బీజేపీ ముఖ్యనాయకుల నుంచి అంతే అనే సమాధానం వస్తోంది.  నిజంగా అంతే పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.  కానీ..  మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ.. అంటే గత పదేళ్లుగా జరుగుతున్నది అంతే కావచ్చు. కానీ..  ప్రధానిగా మోదీ జరుపుకునే  11వ పుట్టిన రోజుకు అంతకు మించిన ప్రత్యేకత, ప్రాధాన్యతా ఉంది. 1950 సెప్టెంబర్ 17న జన్మించిన మోదీకి, 2025 సెప్టెంబర్ 17న 75 వంతాలు నిండుతాయి. ఆయన 76వ  వసంతంలోకి అడుగు పెడతారు. అంటేజజ  బీజేపీ అప్రకటిత  పదవీ విరమణ వయోపరిమితి  నియమం ప్రకారం అదే రోజున ప్రధాని మోదీ పదవీ విరమణ చేయవలసి ఉంటుంది.  అంటే రాజీనామా చేయవలసి ఉంటుంది.   అయితే.. బీజేపీ నాయకత్వం ఇప్పటికే  పార్టీ రాజ్యాంగంలో వయో పరిమితి నియమం ఏదీ లేదని ఒకటికి పది సార్లు స్పష్టం చేసింది. అలాగే.. మోదీ ఈ ఐదేళ్లే కాదు ఆ పై ఐదేళ్ళు (2029-2034) కూడా పదవిలో కొనసాగుతారని అమిత్ షా  సహా సీనియర్ నాయకులు వేర్వేరు సందర్భాలలో స్పష్టం చేస్తూనే ఉన్నారు. అయితే, పార్టీ అగ్ర నేతలు  అద్వానీ, మురళీ మనోహర్ జోషి, జస్వంత్ సింగ్, యశ్వంత్ సిన్హా.. వయోపరిమితి కారణంగానే క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారని.. నిజానికి, అప్పట్లో 75 ఏళ్ల వయోపరిమితిని నిర్ణయించింది కూడా  మోదీనే కదా అని కొందరు గుర్తు చేస్తున్నారు. స్వయంగా ఆయనే తీసుకువచ్చిన నియమాన్ని, నిబంధనను ఆయనే ఉల్లంగిస్తే ఎలా అనే ప్రశ్న కూడా   తెరపైకి వస్తూనే వుంది. అయినా..  పార్టీలో కానీ, ప్రభుత్వంలో కానీ, ఇంత వరకు మోదీ రిటైర్మెంట్  గురించి సీరియస్  చర్చ జరిగిన సందర్భాలు లేవు. నిజానికి, ఇంతవరకు   ప్రధాని  మార్పు   సంకేతాలు రాజకీయ వాతావరణంలో  సంకేత మాత్రంగా అయినా కనిపించడం లేదు.  కానీ..  వారో వీరో ఇంకెవరో కాకుండా..  ఏకంగా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్  ఆర్ఎస్ఎస్  సర్ సంఘ చాలక్ మోహన్‌ భాగవత్‌’ వయోపరిమితి అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఈ నెల 9న  నాగాపూర్ లో సంఘ్ ప్రచారక్  మోరో పంత్ పింగ్లే  జీవిత చరిత్ర, పుస్తకావిష్కరణ సభలో మాట్లాడుతూ..  భాగవత్  రిటైర్మెంట్  ప్రస్తావన తెచ్చారు. ఎప్పుడో, మోరో పంత్ పింగ్లే  తన 75 వ పుట్టిన రోజు నాడు నాకు 75 సంవత్సరాలు నిండినందుకు గాను మీరంతా నన్ను సత్కరించారు. కానీ దాని అర్థం నాకు తెలుసు. 75 సంవత్సరాల వయసులో శాలువా కప్పారంటే.. ఇక నీకు వయసైపోయింది, కాస్త పక్కకు జరుగు, మమ్మల్ని చేయనివ్వు అనే దాని అర్థం  అంటూ చేసిన సరదా వ్యాఖ్యను, మోహన్‌ భాగవత్‌  తనదైన శైలిలో ప్రముఖంగా ప్రస్తావించారు.  75 ఏళ్లు ఒంటిమీదకు వచ్చి శాలువా కప్పించుకున్నామంటేనే.. వయసు మీరిందనీ,  బాధ్యతల నుంచి తప్పుకొని మరొకరికి అవకాశం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం చేసుకోవాలి  అని పింగ్లే అనేవారని చెప్పారు.  నిజానికి, మోదీ కంటే ఓ ఆరు రోజులు ముందే అంటే సెప్టెంబర్ 11న తన  75 పుట్టినరోజు జరుపుకుంటున్న మోహన్‌ భాగవత్‌ తన  రిటైర్మెంట్  గురించే వ్యాఖ్య చేశారో.. లేక మోదీకి రిటైర్మెంట్   సమయం దగ్గర పడిందని గుర్తు చేయడానికే ఆయన ఆ వ్యాఖ్య చేశారో తెలియదు కానీ ఆర్ఎస్ఎస్ అధినేత చేసిన వ్యాఖ్య  రాజకీయ, మీడియా వర్గాల్లో   సంచలనంగా మారింది.  ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు  ఆర్ఎస్ఎస్ అధినేత  ప్రధాని మోడీ పదవి నుంచి దిగిపోవలసిన సమయం వచ్చేసిందని పరోక్ష సంకేతం అందించారని వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో అద్వానీ, జోషీ, జస్వంత్‌ సింగ్‌లకు వర్తించిన నియమం  మోదీ కి ఎందుకు వర్తించదని ప్రశ్నిస్తున్నారు.  అయితే..  విపక్షాల విషయం ఎలా ఉన్నా మోదీ రిటైర్మెంట్  తీసుకునే అవకాశం ఉందా  అంటే..  అలాంటి ఆలోచనే లేదని, బీజేపీ  వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.  ప్రధానమంత్రి నరేంద్రమోదీకి 75 సంవత్సరాలు అనే నిబంధన వర్తించబోదని ఆర్‌ఎ్‌సఎస్‌  కీలక నేత దిలీప్‌ దేవధర్‌ కూడా అన్నారు. బీజేపీలోని మార్గదర్శక మండలి సభ్యులకు మాత్రమే 75 ఏళ్లు అనే నిబంధన వర్తిస్తుందని ఐదేళ్ల క్రితమే మోహన్‌ భాగవత్‌ వివరణ ఇచ్చారని దిలీప్‌ దేవధర్‌ గుర్తుచేశారు.  అయితే..  కొద్ది నెలల క్రితం ప్రధాని మోదీ, పదేళ్ళలో తొలిసారిగా నాగపూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాని కార్యాలయానికి వెళ్లి  మోహన్ భాగవత్ సహా సంఘ్ పెద్దలతో ఏకాంత సమావేశాలు నిర్వహించారు. అప్పట్లోనే మోదీ రిటైర్మెంట్ అంశం ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. ఈ నేపధ్యంలో, మోహన్ భాగవత్ చేసిన తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే..  సెప్టెంబర్ 17 తర్వాత, ఏమి జరుగుతుంది,అంటే.. సంఘ్ వర్గాలతో సన్నిహిత సంబంధాలున్న సీనియర్ జర్నలిస్ట్ మిత్రుడు ఒకరు  సెప్టెంబర్ 17 తర్వాత ఏమి జరుగుతుంది ..సెప్టెంబర్ 18 వస్తుంది.. అంతకు మించి మరో మార్పు ఉండదని సెటైర్ వేశారు.  అయినా, సెప్టెంబర్ 17 వచ్చి పోయేవరకు  ఈ సస్పెన్స్ కొనసాగేలానే వుందని అంటున్నారు.
మోదీ @75..  వాట్ నెక్స్ట్? Publish Date: Jul 14, 2025 6:41AM

కడప మునిసిపల్ పాఠశాలలో స్మార్ట్ కిచెన్.. పవన్ కల్యాణ్ సొంత నిధులతో ఏర్పాటు

కడపలో మధ్యాహ్న భోజన పథకం కోసం దేశంలో మొట్టమొదటి స్మార్ట్ కిచెన్ ఏర్పాటైంది. కడపమునిసిపల్(మెయిన్ )హైస్కూల్ ల్లో ఈ స్మార్ట్ కిచెన్ ను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన సొంత నిధులతో ఏర్పాటైంి.  డొక్కా మాణిక్యమ్మ మధ్యాహ్నా బడి  భోజనం పథకంలో భాగంగా ఈ స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేశారు.   ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుండి స్మార్ట్ కిచెన్  ద్వారా రుచికరమైన,శుబ్రమైన భోజనం విద్యార్థులకు అందించేందుకు ఇది ఎంతగానో దోహదపడుతోంది.  మొదటి మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాలలో భాగంగా కడప మునిసిపల్ హైస్కూలులో జరిగిన కార్యక్రమానికి వచ్చిన డిప్యూటీ సీఎం  పవన్ కళ్యాణ్   విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే  విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.  ఈ పాఠశాలలో కట్టెల పొయ్యి మీద భోజనాలు చేసి పిల్లలకు వడ్డించడాన్నిగమనించిన డిప్యూటీ సీఎం మధ్యాహ్న భోజనాన్ని  శుభ్రమైన ఆరోగ్యకరమైన వాతావరణంలో వండించాలన్న ఉద్యేశంతో  తన సొంత నిధులు అందించారు.ఆ నిధులతో స్మార్ట్ కిచెన్ ఏర్పాటైంది.    ఈ ఆధునిక వంటశాల ద్వారా ప్రస్తుతం 12 పాఠశాల లోని దాదాపుగా 2,200 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేస్తున్నారు. మధ్యాహ్న భోజన మెనూ ప్రకారం అత్యంత పరిశుభ్రం గా రుచికరంగా, నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందిస్తున్నారు.   స్టార్ హోటల్ కిచెన్ తరహాలో  ఏర్పాటైన ఈ స్మార్ట్ కిచెన్ లో  పని చేస్తున్న వంట కార్మికులు, డ్రెస్ కోడ్ తో పాటు వంట వార్పులలో పరిశుభ్రతా చర్యలు పాటిస్తున్నారు. స్మార్ట్ కిచెన్ పరికరాలు, ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్, ఆటోమేషన్ ద్వారా ఆధునిక పద్ధతిలో వంటకాల తయారీ చేపడుతున్నారు. ఆహార రవాణా వాహన ట్రాకింగ్ లను మొబైల్ ఫోన్ ద్వారా నియంత్రిస్తున్నారు.స్మార్ట్ కిచెన్ లో బల్క్ కుకింగ్ ఏరియా,స్టోరేజ్  రూమ్, గ్రైండింగ్ ఏరియా, వెజిటబుల్ కటింగ్ ఏరియా, ఫ్రూట్ ఆనియన్ స్టోర్ , పాట్ వాష్ స్టార్ హోటల్లో ఉండే సదుపాయాలతో పాటు స్మార్ట్ కిచెన్ భద్రత కట్టు దిట్టంగా ఏర్పాటు చేశారు. ప్రతి కిచెన్ కు నుండి 3 కిలో వాట్ల సోలార్ పవర్ జనరేషన్ యూనిట్లు ఏర్పాటు చేశారు.  .మిగిలిపోయిన భోజన పదార్థాలు మరియు కూరగాయల వ్యర్థాలను  బయో డిగ్రేషన్ ద్వారా మిథైన్ గ్యాస్ గా మార్చి వంటకు ఉపయోగిస్తున్నారు. వంట వండే సిబ్బందికి న్యూట్రిషనలిస్టు ద్వారా శిక్షణ ఇప్పిచ్చి వంట వండే విధానం లో న్యూట్రిషన్ విలువలు పోకుండా చర్యలు తీసుకుంటున్నారు విద్యార్థులకు ఒక్కోరోజు ఒక్కో రకమైన మెనూలో కూడిన బోజనాలు అందిస్తున్నారు.  సోమవారం తెల్లన్నం, కూరగాయల కూర, ఉడకబెట్టిన గుడ్డు, చిక్కి అందిస్తున్నారు. మంగళవారం: పులగం,నిమ్మకాయల/ చింతపండు పులిహోర, పల్లి చట్నీ, గుడ్లు, రాగిజావ,   ఇక బుధవారం  తెల్లన్నం, కూరగాయల సాంబార్, ఉడకపెట్టిన గుడ్లు, చిక్కి అందిస్తున్నారు.  గురువారం  కూరగాయల అన్నం, గుడ్ల కూర, రాగిజావ, అలాగే శుక్రవారం  తెల్లన్నం ఆకుకూర పప్పు ఉడకపెట్టిన గుడ్లు, చిక్కిఅందిస్తున్నారు. ఇక శనివారం  తెల్లన్నం, కందిపప్పు చారు, బెల్లం పొంగలి రాగి జావ  అందిస్తున్నారు
కడప మునిసిపల్ పాఠశాలలో స్మార్ట్ కిచెన్.. పవన్ కల్యాణ్ సొంత నిధులతో ఏర్పాటు Publish Date: Jul 14, 2025 6:09AM

ముఖ్యమంత్రి నివాసానికి బాంబు బెదిరింపు

  కేరళ సీఎం పినరయి విజయన్ అధికారిక నివాసానికి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.  క్లిఫ్‌ హౌస్‌ వద్ద బాంబు పేలుళ్లు జరగబోతున్నాయంటూ ఇ-మెయిల్‌లో పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయన నివాసంలో విస్తృతంగా తనిఖీలు చేసి.. అది నకిలీ ఇ-మెయిల్‌గా తేల్చారు. బాంబు బెదిరింపు తర్వాత సీఎం నివాసాన్ని డాగ్‌ స్క్వాడ్‌, బాంబు స్క్వాడ్‌లతో క్షుణ్నంగా తనిఖీలు నిర్వహించాం.   కానీ ఎక్కడా అనుమానాస్పదంగా కనబడలేదు’’ అని పోలీసులు వెల్లడించారు. తనిఖీల సమయంలో ముఖ్యమంత్రి, ఆయన కుటుంబం విదేశాల్లో ఉన్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కీలక సంస్థలను లక్ష్యంగా చేసుకుని ఇటీవల వచ్చిన బాంబు బెదిరింపుల వ్యవహారంతో తాజాగా వచ్చిన ఇ-మెయిల్‌కు సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు  
 ముఖ్యమంత్రి నివాసానికి బాంబు బెదిరింపు Publish Date: Jul 13, 2025 6:16PM

పామ్ ఆయిల్ మంత్రి

  రాష్ట్రంలో రెవెన్యూ మంత్రి, ఇరిగేషన్ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి వంటి శాఖల మంత్రులను మనం ఇప్పటి వరకు చూశాం.. కాని  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగా పామ్ ఆయిల్ మంత్రి వచ్చారు..జిల్లాలో ఆయన పామ్ ఆయిల్ సాగుపై దృష్టి సారించారు. ఏ కార్యక్రమాని హాజరైనా పామ్ ఆయిల్ సాగుపై అవగాహన కల్పిస్తూ వస్తున్నారు. దీంతో ఆయనను జిల్లా రైతులు ముద్దుగా పామ్ ఆయిల్ మంత్రి గా పిలుచుకుంటున్నారు.. ఆయన ఎవరో కాదు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు… స్వతహాగా రైతు అయిన తుమ్మలకు వ్యవసాయ రంగంలో మంచి పట్టుంది. గతంలో కూడా ఆయన ఏ శాఖ మంత్రిగా పనిచేసినా జిల్లాలో నీటి వనరుల అభివృద్ధి, వ్యవసాయ విస్తరణ పైనే ఎక్కువగా శ్రద్ధ చూపేవారు.  తన స్వగ్రామం గండుగుల పల్లిలో వందల ఎకరాల్లో వాణిజ్య పంటలను సాగుచేస్తున్నారు. మిర్చి, పత్తి వంటి సాంప్రదాయక పంటలను వదిలేసి పామ్ ఆయిల్ , కొబ్బరి, వక్క, మిరియాలు, కోకో సాగు చేస్తున్నారు. రాష్ట్ర మంత్రిగా ఎంత తీరికలేని పనులు ఉన్నా ఏ మాత్రం సమయం దొరికినా స్వగ్రామం వైపు పరుగులు తీస్తారు. అర్ధరాత్రి సమయంలో కూడా గ్రామానికి చేరుకుని ఉదయాన్నే పంట పొలాల్లో ప్రత్యక్షం అవుతారు. అక్కడ పొలం పనిచేసే కార్మికులకు సలహాలు సూచనలు ఇస్తారు. ఈ రకంగా వ్యవసాయం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఇదే ఒరవడిని జిల్లాలో రైతాంగం కూడా అలవర్చుకోవాలని ఆయన తాపత్రయ పడుతున్నారు. జిల్లాలో పత్తి, మిర్చి పంటలు సాగుచేసే ఆరుగాలం కష్టపడినా పెట్టుబడి ఖర్చులు కూడా రాక రైతులు అప్పుల పాలు అవుతున్నారు.  ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ మంత్రి గా బాధ్యతలను స్వీకరించిన వెంటనే ఆయన పామ్ ఆయిల్ సాగుపై ప్రత్యేక దృష్టిసారించారు. జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కూడా రైతులు పామ్ ఆయిల్ సాగుచేయాలని ప్రోత్సహిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే సుమారు 40 వేల ఎకరాల్లో రైతులు పామ్ ఆయిల్ సాగుచేస్తున్నారు. ఈ జిల్లాలో మరో 7,500 ఎకరాల్లో సాగు లక్ష్యం నిర్దేశించారు. ఇప్పటికే 4,500 ఎకరాల్లో కొత్తగా సాగు చేస్తున్నారు.. మరో 3000 ఎకరాల్లో సాగు లక్ష్యంగా అధికార్లను పరుగులు పెట్టిస్తున్నారు. జిల్లాలో తాను పాల్గనే ఏ కార్యక్రమం అయినా ఓ ఐదు నిమిషాలు పామ్ ఆయిల్ సాగు గురించి మాట్లాడటం  ఆనవాయితీ మార్చుకున్నారు. దీంతో ఆయను ఇప్పటి వరకు ఇరిగేషన్ మంత్రిగా, ఆర్ అండ్ బీ మంత్రిగా పిలుచుకున్న అభిమానులు ఇప్పుడు పామ్ అయిల్ మంత్రిగా నామకరణం చేశారు
పామ్ ఆయిల్ మంత్రి Publish Date: Jul 13, 2025 5:24PM

విడాకులు మంజూరవ్వడంతో.. పాలతో స్నానం చేసిన యువకుడు

  ప్రియుడితో పారిపోయిన భార్యతో విడాకులు మంజూరవ్వడంతో పునర్జన్మ లభించిందని 40 లీటర్ల పాలతో స్నానం చేశాడు భర్త. అస్సాం రాష్ట్రం నల్బాడీ జిల్లా ముకుల్మువా గ్రామంలో భార్యతో విడాకులు మంజూరైన ఆనందంలో భర్త మాణిక్ అలీ  వేడుక చేసుకున్నారు. భార్యతో విభేదాల నేపథ్యంలో కోర్టుకెక్కిన ఓ జంటకు విడాకులు మంజూరయ్యాయి. కోర్టు తీర్పు విన్నాక ఇంటికి చేరుకున్న భర్త.. 40 లీటర్ల పాలతో స్నానం చేసి తాను ఇక స్వేచ్ఛాజీవినని సంతోషం వ్యక్తం చేశాడు.   తన భార్య కు ఓ ప్రియుడు ఉన్నాడని మాణిక్ అలీ చెప్పాడు. తనతో పెళ్లియి ఓ బిడ్డ పుట్టినా ఆమె తన లవర్ తో బంధం కొనసాగించిందని ఆరోపించాడు. తనను, తన బిడ్డను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయిందని చెప్పాడు. ఒక్కసారి కాదు రెండుసార్లు అలాగే వెళ్లిపోయిందన్నాడు. మొదటిసారి తప్పు చేసినప్పుడు బిడ్డ కోసం తాను ఆమెను క్షమించానని చెప్పాడు. మళ్లీ మళ్లీ అదే తప్పు చేయడంతో భరించలేక విడాకులు తీసుకున్నానని వివరించాడు. విడాకులు పొందాక కొత్త జన్మ ఎత్తినట్లుగా ఉందని, కొత్త జీవితం ప్రారంభానికి గుర్తుగా పాలతో స్నానం చేశానని మాణిక్ అలీ చెప్పాడు.  
విడాకులు మంజూరవ్వడంతో.. పాలతో స్నానం చేసిన యువకుడు Publish Date: Jul 13, 2025 5:11PM