LATEST NEWS
ఇంత కాలానికి అంబటి రాంబాబు జగన్ గుడ్ లుక్స్ లోకి వచ్చేశారు. అవును ఇప్పుడు వైసీపీలో ఇదే విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జగన్ కు ఎంతో ఇష్టమైన బూతుపురాణాన్నివినిపించిన అంబటికి ఇక ఇప్పుడు పార్టీలో పదోన్నతి, కీలక స్థానం ఖాయమన్న భావన పార్టీలో వినిపిస్తోంది. పైగా వైసీపీ ఎకో సిస్టమ్ లో జగన్ దృష్టిలో పడాలన్నా, ఆయన మెప్పు పొందాలన్న ప్రత్యర్థి పార్టీల నాయకులపై బూతులతో విరుచుకుపడాలి. లేదా వారి ఇళ్లపై దాడులకు పాల్పడాలీ, అదీ కాకపోతే ప్రత్యర్థి పార్టీల కార్యాలయాలను దగ్ధం చేయాలి.
వైసీపీ అధికారంలో ఉండగా దాదాపు ఇలాంటి పనులే చేసి జోగి రమేష్ మంత్రిపదవి పొందారు. కొడాలినాని, అనిల్ కుమార్ యాదవ్ వంటి వారు జగన్ కు అత్యంత నమ్మకస్తులుగా మారారు. తెలుగుదేశం నుంచి వలస వచ్చిన వల్లభనేని వంశీ జగన్ కు అస్మదీయుడయ్యారు. ఇక అంబటి రాంబాబు, పేర్ని నాని కూడా జగన్ అధికారంలో ఉన్నప్పటి నుంచీ ఆయన మెప్పు కోసం సొంత సామాజికవర్గాన్ని కూడా కించపరుస్తూ జనసేనాని పవన్ పై దూషణలతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. అందుకే వారిరువురికీ జగన్ కేబినెట్ లో స్థానం దక్కింది. ఇక నగరి మాజీ ఎమ్మెల్యే రోజా సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జగన్ వైసీపీ లో రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చేసి హద్దులు మీరి బూతులు, దాడులు, దౌర్జన్యాలతో ప్రత్యర్థులపై విరుచుకుపడిన వారందరికీ అందలాలు దక్కాయి. పదవుల తాయిలాలు అందాయి.
అధికారం కోల్పోయిన తరువాత అప్పట్లో హద్దులు మీరి చెలరేగిన వారిలో చాలా మంది జాగ్రత్తపడో, భయపడే నోటికి తాళాలు వేసేసుకున్నారు. కానీ అప్పటి కంటే ఎక్కువగా చెలరేగిపోతున్న అంబటి రాంబాబు ఇప్పుడు జగన్ మెప్పు పొదారనీ వైసీపీలో చర్చ జరుగుతోంది. ఆయనకు పార్టీలో కీలక స్థానం ఖాయమన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. అయితే తన బూతులతో అంబటి రాంబాబు జనం దృష్టిలో మరింత దిగజారిపోయారని పరిశీలకులు అంటున్నారు.
అయితే జగన్ మెప్పు ముందు ప్రజల దృష్టిలో దిగజారడం ఏమంత విషయం కాదని వైసీపీయులు అంటున్నారు. ఇప్పుడు పార్టీలో చర్చ అంతా అంబటికి పార్టీలో దక్కే కీలక స్థానం ఏమిటన్నదే అని అంటున్నారు. అన్నిటికీ మించి తెలుగుదేశం కూటమిలో చీలకలు తీసుకురావాలన్న లక్ష్యంతో ఉన్న జగన్ కు జనసేనాని పవన్ కల్యాణ్ సామాజిక వర్గానికి చెందిన అంబటికి పార్టీలో కీలక పదవి ఇవ్వడం కలిసొచ్చే అంశంగా మారుతున్నంద ఆశా ఉందని అంటున్నారు.
బూతులు, దూషణలు వైసీపీ ఎకో సిస్టమ్ లో భాగంగా మారిపోయాయి. అయితే అలా నోరు పారేసుకునే వారిలో చాలా మంది అనూహ్యంగా సైలెంటైపోయారు. వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత వైసీపీలో బ్యాడ్ మౌత్ లీడర్లలో చాలా మంది మౌనమే నా భాష అన్నట్టుగా మారిపోయారు. ఇందుకు కారణాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైసీపీ అధికారంలో ఉండగా నోరెట్టుకు పడిపోవడమే కాకుండా... ఇష్టారీతిగా దౌర్జన్యాలు, దాడులు, కబ్జాలకు పాల్పడిన నేపథ్యంలో వారిప్పుడు పీకల్లోతు కేసుల్లో మునిగిపోయి ఉండటమే. మౌనంగా ఉంటే మేలు.. బయటకు వచ్చి కేసుల చిక్కులను కోరి ఆహ్వానించడం ఎందుకన్న ధోరణి వారిలో కనిపిస్తోంది.
అయితే వైసీపీలో అంబటి రాంబాబురూటే సెపరేటు. ఆయనకు నోటిని అదుపులో పెట్టుకోవడం అన్న సంగతి తెలియదు. జగన్ మెప్పు కోసం, జగన్ ప్రశంస కోసం ఏమైనా చేస్తారన్న పేరుంది. గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అంబటి రాంబాబు జట్టుకు రంగు వేయించు కోకపోవ డానికి జగన్ కు నలుపు రంగు అంటే ఇష్టం లేకపోవడమే కారణమని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆయన ఇప్పుడు కూడా జుత్తుకు రంగు వేసుకోవడం లేదనుకోండి.. జగన్ కు అప్పుడు ఇష్టం లేని నల్ల రంగు ఇప్పుడు ఎందుకు ఇష్టం అవుతుందన్న అభిప్రాయం కావచ్చు. అది పక్కన పెడితే తాజాగా గత నాలుగు రోజులుగా ఏపీలో అంబటి వ్యవహారమే పెద్ద చర్చగా, రచ్చగా ఉంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై నోరు పారేసుకున్నందుకు ఆయనపై కేసులు నమోద య్యాయి. అరెస్టై రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అంబటి అరెస్టు నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ రోడ్డు మీదకు వచ్చారు. రాజమహేంద్రవరం వెళ్లి అంబటిని పరామర్శించలేదు కానీ, గుంటూరు వచ్చి అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించి, అండగా ఉంటానని చెప్పడమే కాకుండా... అంతకు అంతా బదులు తీర్చుకుంటామంటూ చంద్రబాబు, తెలుగుదేశంలకు వార్నింగ్ ఇచ్చి వెళ్లారు. ఇక్కడ వైసీపీయులలోనే ఒక సందేహం వ్యక్తం అవుతోంది. జగన్ సరే గుంటూరు వచ్చి అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించి రాజకీయమైలేజీ కోసం చేయగలిగినంత చేసి వెళ్లారు. మరి పార్టీలో మిగిలిన వారి సంగతేంటి? బూతుపురాణాల స్పెషలిస్టుగా పేరుపొందిన మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అంబటికి మద్దతుగా కనీసం గొంతు కూడా సవరించుకోలేదేంటి? అన్న ప్రశ్నలు వైసీపీ శ్రేణుల నుంచే వినవస్తున్నాయి. అలాగే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏమయ్యారు? కనీసం అంబటికి మద్దతుగా ఒక్క ప్రకటన చేయడానికి కూడా వారికి ఎందుకు మనసు రావడం లేదు?
సాక్షాత్తూ పార్టీ అధినేత గుంటూరు వచ్చి ర్యాలీ నిర్వహిస్తే కనీసం అటువైపు తొంగి చసేందుకు కూడా వారు ఎందుకు ధైర్యం చేయలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అధికారంలో ఉండగా హద్దూపద్దూ లేకుండా బూతుపురాణంతో రెచ్చిపోయిన ద్వారం పూడి చంద్రశేఖర్ రెడ్డి, జగన్ హయాంలో పార్టీలో, ప్రభుత్వంలో చక్రం తిప్పిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఇలా అధికారంలో ఉండగా రెచ్చిపోయిన వైసీపీ నేతలు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు, వినిపించడం లేదెందుకని అని వైసీపీలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఇప్పుడు వైసీపీలో గొంతు వినిపిస్తున్న వారు అంబటి, పేర్ని నాని, జోగి రమేష్ లు మాత్రమే. అంబటికి మద్దతుగా పేర్నినాని, జోగి రమేష్ లు మాత్రమే మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఇప్పుడు వీరే వైసీపీ ఎకో సిస్టమ్ లోని బూతుల పారాయణాన్ని కొనసాగిస్తున్నట్లు కనిపిస్తోందన్న చర్చ రాజకీయవర్గాలలో జరుగులోంది.
తెలుగువన్ వాస్తవ వేదిక పదకొండవ సంచికలో ఘాటైన చర్చ జరిగింది. తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ పాల్గొని సమకాలీన రాజకీయాలపై నిర్మోహమాటంగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
వైసీపీ అధినేత జగన్‌కు పాదయాత్ర చేయనిస్తారా? అనే ప్రశ్నను కంఠంనేని రవిశంకర్ లేవనెత్తారు. దీనికి స్పందించిన డోలేంద్ర ప్రసాద్, చంద్రబాబు డిక్టేటర్ కాదు… డెమోక్రాట్ అని వ్యాఖ్యానించారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేయలేదని గుర్తుచేశారు.
జగన్ బూచీ చూపిస్తే ఓట్లు పడతాయని చంద్రబాబు, లోకేశ్ భావిస్తున్నారని కొందరు అంటున్నారని పేర్కొన్నారు. అలాగే ఆర్గానిక్ నేతలకు ఇన్‌ఆర్గానిక్ పదవులు లేవని, జ్యోతీబసు, బుద్ధబట్టాచార్య వంటి వారు వేరే పార్టీలోకి వెళ్లలేదని డోలేంద్ర ప్రసాద్ తెలిపారు.
తెలుగుదేశం, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలకు స్పష్టమైన సిద్ధాంతాలు లేవని ఆయన విమర్శించారు. మరోవైపు, వైసీపీ నాయకులు మాయలో ఉన్నారని, ఇసుక దందాలు, గనుల వ్యవహారాల్లో.. దేశంలో ఒక రకం న్యాయం, పేదలకు మరో రకం న్యాయం ఉందా? అని రవిశంకర్ ప్రశ్నించారు.
ఎన్నికల ముందు అరెస్టులు చేస్తే ప్రజల్లో సానుభూతి కలుగుతుందని పార్టీలు భావిస్తున్నాయని కూడా చర్చలో ప్రస్తావన వచ్చింది. ఈ వంటి అంశాలపై కంఠంనేని రవిశంకర్, డోలేంద్ర ప్రసాద్‌ల మధ్య జరిగిన పూర్తి స్థాయి చర్చను తెలుగువన్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి.
ALSO ON TELUGUONE N E W S
తారాగణం: అభిషన్ జీవింత్, అనస్వర రాజన్, హరీష్ కుమార్, కావ్య అనిల్, సచిన్ నాచియప్పన్, థేని మురుగన్, శరవణన్, ఆర్జే అనంతి
డీఓపీ: శ్రేయాస్ కృష్ణ
ఎడిటింగ్: సురేష్ కుమార్
సంగీతం: షాన్ రోల్డాన్
కథ, దర్శకత్వం: మధన్
నిర్మాతలు: సౌందర్య రాజినీకాంత్, పసిలియన్ నజరత్, మగేష్ రాజ్ పసిలియన్
విడుదల తేదీ: ఫిబ్రవరి 6, 2026
‘టూరిస్ట్ ఫ్యామిలీ’ చిత్రంతో దర్శకుడిగా ప్రశంసలు పొందిన అభిషన్ జీవింత్, ఇప్పుడు హీరోగా ‘విత్ లవ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆయనకు జోడీగా మలయాళంలో మంచి పేరు తెచ్చుకున్న అనస్వర రాజన్ నటించింది. సౌందర్య రాజినీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ప్రేమ, జ్ఞాపకాలు, పాత క్రష్‌ల నేపథ్యంతో సాగే ఈ రొమాంటిక్ డ్రామా ఎలా ఉందో చూద్దాం. (With Love Movie Review)
కథ:
పెళ్ళిపై ఆసక్తి లేని సత్య( అభిషన్ జీవింత్), తన సోదరి కారణంగా అనుకోకుండా పెళ్ళి చూపుల కోసం మోనిషా (అనస్వర రాజన్)ను కలుస్తాడు. అలా కలిసిన తర్వాత వాళ్లిద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారని.. సీనియర్, జూనియర్ అని తెలుసుకుంటారు. అలా మాటల్లో స్కూల్ లవ్ స్టోరీలు షేర్ చేసుకుంటారు. స్కూల్ టైంలో తమ ప్రేమని వ్యక్తపరచలేకపోవడంతో ఆ క్రష్ లను ఇప్పుడు కలవాలి అనుకుంటారు. పాత జ్ఞాపకాలను వెలికితీస్తూ మొదలైన వీరి ప్రయాణం ఎలా సాగింది? పాత ప్రేమలు పట్టాలెక్కాయా లేక కొత్త ప్రేమలు చిగురించాయా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
నటుడిగా అభిషన్ జీవింత్ మంచి ప్రదర్శన ఇచ్చాడు. స్కూల్ బాయ్ లుక్‌లోనూ, పెళ్లికి సిద్ధమైన యువకుడి పాత్రలోనూ సహజంగా కనిపించాడు. అతని కళ్లలో భావాలు బాగా పలికాయి. ఈ ప్రేమకథలో అతని ప్రత్యేకమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంది.
అనస్వర రాజన్ పాత్ర తెలుగు, తమిళ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతి. మలయాళంలో చేసిన కొంత సీరియస్ పాత్రలకంటే, ఈ చిత్రంలో ఆమె బబ్లీ పాత్రలో ఎంతో చురుకుగా, సహజంగా కనిపించింది. సున్నితమైన భావోద్వేగాలను ఆమె చక్కగా పలికించింది. కొన్నిసార్లు అభిషన్ కంటే కూడా అనస్వర తనదైన చమత్కారం, చురుకుదనంతో సన్నివేశాలకు మరింత అందాన్ని తీసుకొచ్చింది.
అభిషన్-అనస్వర మధ్య కెమిస్ట్రీ ఈ సాధారణ కథనాన్ని కూడా తాజాగా, ఆసక్తికరంగా మార్చింది. అయితే కొన్ని చోట్ల కథను వేగంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో.. మరికొన్ని మధుర క్షణాలను నిర్మించే అవకాశమున్నా, అలాంటి ప్రయత్నం చేయకుండా.. వేరే సన్నివేశానికి తొందరపడుతున్నట్లు అనిపిస్తుంది.
సన్నివేశాల్లో ఆ తొందరపాటు చూపించకుండా మరిన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ క్రియేట్ చేసి ఉంటే సినిమా మరింత ప్రత్యేకంగా నిలిచేది. నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలు బాగున్నాయి. పెద్దగా కొత్తదనం లేకపోయినా, ఒక సరళమైన ప్రేమకథను సున్నితంగా చూపించడంలో చిత్ర బృందం విజయం సాధించింది.
ఇది సంచలనం సృష్టించగలిగే సినిమా కాకపోయినా, భారీ భావోద్వేగాలతో నిండిన సినిమా కాకపోయినా.. నిజాయితీగా, సహజంగా, సరదాగా అనిపించే క్షణాలను అందిస్తుంది. కథలోని మలుపులు ఊహించగలిగేవే అయినప్పటికీ, ప్రధాన తారాగణం మధ్య కెమిస్ట్రీ, సహజత్వం ఈ సినిమాను ప్రధాన బలంగా నిలిచాయి. తొలి ప్రయత్నమే అయినప్పటికీ దర్శకుడు మధన్ ఓ అందమైన చిత్రాన్ని అందించాడు.
ఫైనల్ గా..
కథాకథనాలు గొప్పగా లేకపోయినా నిజాయితీగా, సహజంగా సాగే రొమాంటిక్ డ్రామాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది.
రేటింగ్: 2.75/5
Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
నటీనటులు: సారా అర్జున్, భూమిక చావ్లా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, నాజర్,
రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, ఆదర్శ్ బాలకష్ణ తదితరులు
సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ కె.పోతన్
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
సంగీతం: కాలభైరవ
సమర్పణ: శ్రీమతి రాగిణి గుణ
నిర్మాతలు: నీలిమ గుణ, యుక్తా గుణ
బ్యానర్: గుణ హ్యాండ్‌మేడ్ ఫిలింస్
రచన, దర్శకత్వం: గుణశేఖర్
విడుదల తేదీ: 06.02.2026
సినిమా నిడివి: 162.54 నిమిషాలు
మారుతున్న కాలాన్ని బట్టి నేరాలు, వాటి తాలూకు ప్రభావాలు కూడా మారుతూ వస్తున్నాయి. ఒకప్ప్పుడు మైనర్లు నేరాలు చెయ్యడం, జైలుకు వెళ్లడం వంటివి చాలా తక్కువగా కనిపించేవి. ఇటీవలికాలంలో దాని తాలూకు శాతం బాగా పెరిగిందని చెప్పాలి. పిల్లలు ఇలా దారి తప్పి ప్రవర్తించడానికి, నేరాలు చేయడానికి కారణం ఎవరు అని ప్రశ్నించుకుంటే మొదట వారి తల్లిదండ్రులే కనిపిస్తారు. పిల్లల్ని బాధ్యత గల పౌరులుగా తీర్చి దిద్దాల్సిన బాధ్యత వారిదే అనే సమాధానం వస్తుంది. ఇదే పాయింట్‌తో డైరెక్టర్ గుణశేఖర్ ‘యుఫోరియా’ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పటికే గాడి తప్పిన అతని కెరీర్‌ని మళ్లీ ట్రాక్‌లోకి తెచ్చుకునేందుకు ఓ కొత్త ప్రయత్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మరి ఈ సినిమాతో గుణశేఖర్ తన పూర్వ వైభవాన్ని తెచ్చుకోగలిగారా? సినిమాని ప్రేక్షకులకు కనెక్ట్ చెయ్యడంలో సక్సెస్ అయ్యారా? అనేది చూద్దాం.
కథ:
చైత్ర(సారా అర్జున్) 18 ఏళ్ళు కూడా నిండని ఓ అమ్మాయి. ఐఎఎస్ ఆఫీసర్ అవ్వాలన్నది ఆమె కల. ఈకాలం టీనేజర్స్‌కి ఉండే కొన్ని లక్షణాలు ఆ అమ్మాయి దగ్గర లేవు. తన లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం ఎప్ప్పుడూ చదువు మీదే ధ్యాస పెడుతుంది. ఒకరోజు మధ్యాహ్నం స్నేహితురాలి ఆహ్వానం మేరకు ‘ఆంబ్రోసియా’ అనే పబ్‌లో జరుగుతున్న ‘యుఫోరియా’ ఈవెంట్‌కి వెళుతుంది. ఆ స్నేహితురాలి ద్వారా ఐదుగురు హైఫై కుర్రాళ్లు పరిచయమవుతారు. పార్టీ తర్వాత చైత్రను కారులో ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యడానికి బయల్దేరతారు. దారిలో ఆమెకు డ్రగ్స్ ఇచ్చి ఆ ఐదుగురు ఫ్రెండ్స్ ఆమెను దారుణంగా రేప్ చేస్తారు. ఆ తర్వాత పోలీస్ కేసు, కోర్టు తదితర ప్రాసెస్ అంతా జరుగుతుంది. ధనవంతుల కుటుంబాలకు చెందిన ఆ కుర్రాళ్లు చేసిన నేరం ప్రూవ్ అయ్యిందా? వారిని కోర్టు శిక్షించిందా? తర్వాత జరిగిన పరిణామాలేంటి? అనేది మిగతా కథ.
విశ్లేషణ:
ఒక అమ్మాయిని రేప్ చేయడం, ఆ తర్వాత పోలీసులు, కోర్టు, శిక్షలు.. ఇది చాలా సినిమాల్లో మనం చూసిన కథే. యదార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు ముందే చెప్పాడు. అయితే దాన్ని ఈ సినిమాలో కొత్తగా ఎలా చెప్పారు? ఇందులో తీసుకున్న కొత్త పాయింట్ ఏమిటి? అంటే.. పిల్లలు నేరం చేస్తే వారి తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఉంటుంది అనే పాయింట్‌పైన ఈ కేసులో ప్రధాన నిందితుడైన వికాస్(విఘ్నేష్ గవిరెడ్డి) తల్లి వింధ్య(భూమిక చావ్లా) తను నేరం చేశానని, తనని శిక్షించమని కోర్టుకెక్కుతుంది. ఈ అంశంతోనే సినిమా ప్రారంభమవుతుంది. నేరం జరిగిన తర్వాత చైత్ర ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు జరిగిన దారుణాన్ని చెప్పిన విధానం, దాన్ని చూపించిన తీరు ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతుంది, నేరస్తులపై విపరీతమైన కోపం తెప్పిస్తుంది. ఎక్కువ సమయం తీసుకోకుండా కొన్ని నిమిషాల్లోనే అసలు కథలోకి వెళ్లిపోయాడు డైరెక్టర్. అక్కడి నుంచి ఫస్ట్‌హాఫ్ వరకు నెక్స్‌ట్ ఏం జరగబోతోంది అనే క్యూరియాసిటీ కలిగించడంలో సక్సెస్ అయ్యాడు. ఒక విధంగా నేరస్తులకు శిక్ష పడడంతో సినిమా అయిపోయిందా అనిపిస్తుంది. కానీ, అది ఫస్ట్‌హాఫ్. ఇక సెకండాఫ్‌కి వచ్చేసరికి ఫస్ట్‌హాఫ్‌లో ఉన్నంత స్టఫ్ సెకండాఫ్‌లో కనిపించదు. డ్రగ్స్, జైలు సన్నివేశాలు, కొడుకుని పెరోల్‌పై తీసుకొచ్చి ఎగ్జామ్ రాయించాలనుకున్న భూమిక అందులో ఫెయిల్ అయి మందుకు బానిస కావడం, జైల్లోనే వికాస్‌పై పగ పెంచుకున్న ఒక సైకో కిల్లర్ వికాస్‌ని చంపాలని ప్రయత్నించడం.. ఇవన్నీ అసలు కథను మరింత పెంచడానికి చేసిన సీన్స్‌లా అనిపిస్తాయి తప్ప ఏమాత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకోవు. ఇక ప్రీ క్లెíమాక్స్, క్లెíమాక్స్ మాత్రం అద్భుతంగా రాసుకున్నారు. అంతేకాదు, విజువల్‌గా కూడా ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యేలా, ఎమోషనల్ అయ్యేలా చూపించారు. ఎలాంటి వారికైనా క్లెíమాక్స్ కంటతడి పెట్టిస్తుంది.
నటీనటులు:
ఈ సినిమాలో ప్రధానంగా కనిపించే క్యారెక్టర్లు వికాస్, వింధ్య, చైత్ర. ఈ పాత్రలు పోషించిన విఘ్నేష్, భూమిక, సారా అర్జున్.. వారి వారి క్యారెక్టర్స్‌కి పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా అందరి కంటే విఘ్నేష్ తన క్యారెక్టర్‌లో జీవించాడని చెప్పాలి. ఈ సినిమా ద్వారా దాదాపు 10 మంది కొత్తవారిని పరిచయం చేశారు గుణశేఖర్. అయితే పెర్‌ఫార్మెన్స్ పరంగా అందరికీ మంచి మార్కులు పడతాయి. ప్రతి ఒక్కరూ మంచి పెర్‌ఫార్మెన్స్ ఇచ్చారు. పోలీస్ ఆఫీసర్ జయదేవ్‌గా గౌతమ్ మీనన్ కూడా ఎంతో డిగ్నిఫైడ్‌గా కనిపించారు.
సాంకేతిక నిపుణులు:
టెక్నికల్‌గా ఈ సినిమాకి ఫోటోగ్రఫీ పెద్ద ప్లస్ అని చెప్పాలి. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ప్రవీణ్ పోతన్ కెమెరా వర్క్ చాలా బాగుంది. అందులో కొన్ని రిస్కీ షాట్స్ కూడా ఉన్నాయి. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే.. పార్టీకి సంబంధించిన సీన్స్, ఛేజింగ్ సీన్స్ కళ్లకు ఇబ్బంది కలిగించేలా ఎడిట్ చేశారు. కాల భైరవ సంగీతం ఆకట్టుకోలేకపోయింది. పాటల విషయం పక్కన పెట్టేస్తే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్నిచోట్ల బాగుంది అనిపించినా, చాలాచోట్ల రణగొణ ధ్వనులతో నిండిపోయింది. ఇక డైరెక్టర్ గురించి చెప్పాలంటే.. ఫ్లాపుల నుంచి బయట పడేందుకు నానా తిప్పలు పడుతున్న గుణశేఖర్.. సొంతంగా నిర్మించిన ఈ సినిమాతో మరోసారి వార్తల్లోకి వచ్చినప్పటికీ కమర్షియల్‌గా ఆశించిన స్థాయి ఫలితం దక్కే అవకాశం లేదు. సినిమాలోని కొన్ని సీన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. మరికొన్ని సీన్స్ పేలవంగా ఉన్నాయి. తల్లిదండ్రుల్ని బాధ్యుల్ని చేస్తూ చేసిన ఈ సినిమాలో పేరెంట్స్ కూడా చూడలేని సీన్స్ కొన్ని పెట్టారు గుణశేఖర్. వాటి వల్ల వారు కూడా సినిమా చూసే అవకాశం తక్కువ.
ఫైనల్‌గా చెప్పాలంటే..
పాయింట్ మంచిదే. కానీ, తెరపై దాన్ని చూపించిన విధానంలో ఎన్నో లొసుగులు ఉన్నాయి. ఫస్ట్‌హాఫ్ ఎంతో ఎంగేజింగ్‌గా అనిపిస్తుంది. సెకండాఫ్ విషయానికి వస్తే ప్రీ క్లెíమాక్స్, క్లెíమాక్స్ వచ్చే వరకు ఆడియన్స్ బోర్ ఫీలవ్వక తప్పదు. పాత కథనే కొత్తగా చెప్పాలనుకున్న గుణశేఖర్ పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వలేదని చెప్పాలి.
రేటింగ్: 2.5/5
- జి.హరా
Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
Cast: Abishan Jeevinth, Anaswara Rajan, Harish Kumar, Kavya Anil, Sacchin Nachiappan, Theni Murugan, Saravanan, RJ Ananthi
Crew:
Cinematography by Shreyaas Krishna
Edited by Suresh Kumar
Music by Sean Roldan
Written & Directed by Madhan
Produced by Soundarya Rajinikanth, Pasilian Nazerath, Magesh Raj Pasilian
Abishan Jeevinth debuted with a highly appreciated and sucessful blockbuster Tourist Family as a director. Now, he debuted as an actor with his film, With Love, alongside a seasoned Malayalam sensational actress, Anaswara Rajan. Soundarya Rajinikanth has produced the film and it released, yesterday. Let's discuss about the film, in detail.
Plot:
Sathyaa (Abishan Jeevinth) is a well-performing designer, who is reclusive from his family and doesn't want to marry even when his sister forces him. But his elder sister makes him meet Monisha (Anaswara Rajan) without giving any details or a chance to refuse to meet her. He meets her and after a miscommunication with another girl, they start a cool conversation.
They understand that they are some same school and he is her senior. Both talk about their serious school crushes Anisha and Balaji, respectively. Monisha is a successful influencer but Sathyaa doesn't have any idea about it. She proposes to him a plan to meet their old school mates, track their crushes. What happens next? Will they unite or find their crushes as better life partners? Watch the movie to know more.
Analysis:
Abishan Jeevinth is good as a performer. He is believable in young school boy look and as a matured person ready for marriage. His eyes speak volumes and his expressions are spot on at all places. He has his own charm and screen presence that is pleasant to watch in this love story.
Anaswara Rajan is a revelation for Telugu and Tamil audiences who did not see her Malayalam films. She is charming in this bubbly role away from her slightly serious ones in Malayalam and effortless. She carries the dynamics of relationship on her shoulders with absolute ease. At times, more than Abishan, it is Anaswara who adds necessary intricate wit to the scenes.
We can say that both of them complicated each other well in many scenes and their chemistry makes this slightly routine plotline, a fresh and enjoyable film. We see how their journey progresses but at places it feels like there is a rush to other scene to keep the audiences interested rather than building few more moments among the leads.
This could have made the movie much better and even more special with such lively characters at play. Production values and technical standards are good enough for the film without much innovation. Still, the basics have been perfectly well executed for the film to showcase a love story to audiences With Love.
It is not a groundbreaking film or a considerably emotion heavy film about nostalgia but it offers moments that feels honest, realistic and fun to watch. While many story beats are predictable still, the chemistry, realism and believability presents the movie as a good watch from Debutant Madhan.
Bottomline:
An enjoyable rom-com that offers simple and heartfelt moments.
Rating: 2.75/5
Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
-అభిమానులకి బాధని కలిగిస్తున్న ప్రియాంక మాటలు
-ఎందుకు అలా జరిగిందంటూ కామెంట్స్
-వారణాసి పై భారీ అంచనాలు
పాన్ ఇండియా యాక్ట్రస్ అనే స్థాయి దాటి పాన్ వరల్డ్ యాక్ట్రస్ అనే స్థాయికి ఎదిగిన 'ప్రియాంక చోప్రా(Priyanka Chopra)సినీ జర్నీ తెలిసిందే. ప్రెజంట్ మహేష్ బాబు(Mahesh Babu) రాజమౌళి(ss Rajamouli)ల 'వారణాసి'(Varanasi)తో బిజీగా ఉంది. ఆ ఇద్దరు ఏరి కోరి మందాకినీ అనే క్యారక్టర్ కి ప్రియాంక ని సెలక్ట్ చేసారు. అంటే తన వల్ల వారణాసి విజయ నాదానికి ఎంత లాభం జరగబోతుందో అర్ధం చేసుకోవచ్చు. వరల్డ్ సిల్వర్ స్క్రీన్ వద్ద కూడా ప్రియాంక మాయాజాలం వారణాసి కి అదనపు ఆకర్షణ అని చెప్పుకోవడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు. రీసెంట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆమె చెప్పిన విషయాలు అభిమానులనే కాకుండా ప్రతి ఒక్కర్ని ఎంతో ఆవేదనకి గురి చేస్తున్నాయి. మరి అవేంటో చూద్దాం.
ప్రియాంక మాట్లాడుతు నా పాప పేరు మాల్తీ మేరీ. నెలలు నిండకుండానే మూడు నెలల ముందుగానే మాల్తీ జన్మించింది. ఆ సమయంలో తను 765 గ్రాముల బరువు మాత్రమే ఉండటంతో కొన్ని నెలలపాటు హాస్పిటల్ లోనే ఉండాల్సి వచ్చింది. పైగా అప్పుడు కరోనా సమయం. దాంతో చావు బతుకల మధ్య మాల్తీ హాస్పిటల్ లోనే పోరాటం చేసింది. మూడు నెలల్లో ఆరు సార్లు రక్తం మార్చారు. ఆ టైంలో చాలా భయంగా బతికాం. చివరకి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుని మాల్తీ క్షేమంగా బయటపడిందని ప్రియాంక చెప్పుకొచ్చింది. ఇంటర్వ్యూ సమయంలో తన భర్త నిక్ జోనస్ కూడా ప్రియాంక పక్కనే ఉన్నాడు.
Also read: Epstein files: ఎప్ స్టీన్ కుంభకోణంలో బాలీవుడ్ ప్రముఖుల పేర్లు!
అమెరికా పాప్ సింగర్ నిక్ జోనస్(Nick Jonas)ప్రియాంక కి 2018 లో వివాహం జరిగింది. ప్రియాంక కి కన్నా పదేళ్ల చిన్నవాడు. సరోగసి ద్వారా మాల్తీ మేరీ కి జన్మనిచ్చారు. అమెరికాలోనే సెటిల్ అయిన ప్రియాంక వారణాసి షూటింగ్ కోసమే ఇండియాలో ఉంది.
-ఇంటి నుంచి గెంటి వెయ్యవల్సిన పరిస్థితి ఏంటి
-మాధవన్ కి ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది
-అసలు మాధవన్ చేసిన నేరం ఏంటి
-ఆ ఇద్దరికి పెళ్లి ఎప్పుడు జరిగింది
ఆర్ మాధవన్(R Madhavan)ఈ పేరుకి సిల్వర్ స్క్రీన్ కి, సినీ ప్రియులకి ఉన్న అనుబంధం రెండున్నర దశాబ్దాలపైనే. అంతలా హీరోగా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా మెప్పిస్తూ వస్తున్నాడు. మెప్పిస్తుండటమే కాదు తన చరిష్మా కి సంబంధించి ఎక్స్ పైరీ డేట్ కి నో ఛాన్స్ అంటు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. రీసెంట్ గా ఇండియన్ సినిమా గొప్పతనాన్ని చాటుతూ 1300 కోట్ల క్లబ్ లోకి చేరిన ధురంధర్(Dhurandhar)లో ఐబీ ఆఫీసర్ అజయ్ సన్యాల్ గా చేసి ప్రేక్షకులు ధురంధర్ లో లీనమయ్యేలా చేసాడు. రియల్ గా మన దేశపు ఎన్ ఎస్ ఏ ఆఫీసర్ అజిత్ దోవల్ అనే నిజమైన క్యారక్టర్ లో అత్యద్భుతంగా చేసి మాధవన్ కి ఎక్స్ పైరీ డేట్ అనేది లేదని ప్రేక్షకులు కూడా అనేలా చేస్తున్నాడు. అలాంటి మాధవన్ ని భార్య ఇంట్లో నుంచి పంపించేసిన సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.
మాధవన్ రీసెంట్ గా ఒక ఆంగ్ల మీడియాకి ఇంటర్వ్యూలో మాట్లాడుతు కరోనా సమయంలో ఇంట్లో ఖాళీగా ఉన్నాను. అప్పుడు నా భార్య నాతో మాట్లాడుతు నువ్వెప్పుడూ ఖాళీగా ఇంట్లోనే కూర్చోకుండా సినిమాలు, ఓటిటి ప్రాజెక్ట్స్ తో బిజీ గా ఉంటుంటావు. కానీ ఇప్పుడు బయటకి వెళ్లినా త్వరగా వచ్చేస్తున్నావు.గతంలో ఉన్నంత ఉత్సాహం నీలో కనిపించడం లేదు. అసలు నువ్వు బాగానే ఉన్నావా! లేదా! ఎప్పటిలాగానే బయటకి వెళ్లి డబ్బు సంపాదించు అని మా ఆవిడ చెప్పింది. ఆ మాటలు నాలో ఆలోచనలు కలిగించడంతో పాటు నాపై ఎంతో ప్రభావం చూపించాయని చెప్పుకొచ్చాడు. అయితే ఇదే ఇంటర్వ్యూ లో టోటల్ గా అవే మాటల సారాంశం మొత్తాన్ని'నా భార్య కోవిడ్ సమయంలో డబ్బు సంపాదించమని ఇంట్లో నుంచి గెంటివేసిందనిగా సరదాగా చెప్పడంతో మాటలు వైరల్ గా నిలిచాయి.
Also read: 25 రోజులకి గాను ఒరిజినల్ కలెక్షన్స్ ఇవే.. బుక్ మై షో నే సాక్ష్యం
మాధవన్ వైఫ్ పేరు సరితా బిర్జే(Sarita Birje).. 1999 లో ఆ ఇద్దరి వివాహం జరగగా మాధవన్ ఫిలిం ఇనిస్టిట్యూట్ లో కోచింగ్ తీసుకుంటున్నాడు.పెళ్లి తర్వాతనే లెజండ్రీ మేకర్ మణిరత్నం డైరెక్షన్ లో సఖి మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. జార్ఖండ్ కి చెందిన మాధవన్ కి అదే తొలి చిత్రం. ఇక అక్కడుంచి తన ప్రభావాన్ని చాటుతూ వస్తున్నాడు. ఇటివల 2026 కి సంబంధించి ప్రకటించిన ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారానికి మాధవన్ ఎంపికైన విషయం తెలిసిందే. ఎంపిక కావడం కంటే పద్మశ్రీ నే వెతుక్కుంటూ వచ్చిందని చెప్ప్పవచ్చు. అప్ కమింగ్ సినిమాల విషయానికి వస్తే ధురంధర్ పార్ట్ 2(Dhurandhar 2)తో ఈ సారి పాకిస్థాన్ లో జరపబోయే తన ఆపరేషన్ ఏ రేంజ్ లో ఉండబోతుందో మార్చి 19 న తెలియబోతుంది.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు.
టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.
జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి.
చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది.
"ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు.
సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు.
గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.
*నిశ్శబ్ద.
ఏదయినా ఒక వస్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధగా వుంటుంది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువు చేజారి పడి పగిలిపోయినా, దొంగతనం జరిగినా, ఎక్కడో మర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొందలేమని దిగులు పట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్టమయిన పెయింటింగ్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దూరమయింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడగలి గింది.
అదంటే మరి ఆమెకు ప్రాణ సమానం. చాలా కాలం దొరుకుతుందని, తర్వాత ఇక దొరకదేమో అనీ ఎంతో బాధపడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గతేడాది ఆమెను చేరింది. ఆమెది నెదర్లాండ్స్. ఆమె తండ్రి నెదర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్నపిల్లల ఆస్పత్రి డైరెక్టర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విషయానికి వస్తే.. అది 1683లో కాస్పర్ నెషర్ వేసిన స్టీవెన్ ఓల్టర్స్ పెయింటింగ్.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల ఆదేశాలను చార్లెట్ తండ్రి వ్యతిరేకించారు. ఆయన రహస్య జీవనం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం తన నగరంలోని ఒక బ్యాంక్‌లో భద్ర పరచమని ఇచ్చారట. 1940లో నాజీలు నెదర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద పడి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన తర్వాత ఈ పెయింటింగ్ ఎక్కడున్నదీ ఎవరికీ తెలియలేదు. చిత్రంగా 1950ల్లో డసల్‌డార్ష్ ఆర్ట్ గ్యాలరీలో అది ప్రత్యక్షమయింది. 1969లో ఆమ్‌స్టర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాలరీలో వుందని చూసినవారు చెప్పారు. వేలంపాట తర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక కళాపిపాసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.
మొత్తానికి వూహించని విధంగా ఎంతో కాలం దూరమయిన గొప్ప కళాఖండం తిరిగి తన వద్దకు చేరడంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే కదా.. పోయిందనుకున్న గొప్ప వస్తువు తిరిగి చేరితే ఆ ఆనందమే వేరు! అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భద్రంగా చూసుకునే ఆసక్తి వున్నప్పటికీ శక్తి సామర్ధ్యాలు లేవు. అందుకనే త్వరలో ఎవరికయినా అమ్మేసీ వచ్చిన సొమ్మును పిల్లలకు పంచుదామనుకుంటోందిట! చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు వున్నారు. అలాగే ఇరవై మంది పిల్లలు ఉన్నారు. అందరూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అందరం ఒకే కుటుంబం, చాలాకాలం తర్వాత ఇల్లు చేరిన కళాఖండం మా కుటుంబానిది అన్నది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు.
చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్ విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది.
ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.
అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి 15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్ పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు.
అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో, ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది.
మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.
అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు ఒకే సారి ఆయన మీద విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.
రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .
దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.
ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు. వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .
దేశ చరిత్రను, ప్రపంచ చరిత్రను గమనిస్తే ఎన్నో విప్లవాత్మక మార్పులు, మరెన్నో గొప్ప ప్రణాళికలు, వ్యూహాలు కనిపిస్తాయి. నేటికాలంలో స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ పుణ్యమా అని ఎవరికైనా ఫోన్ చేయాలన్నా, మెసెజ్ చేయాలన్నా, మెయిల్ పంపాలన్నా కేవలం సెకెండ్లు, నిమిషాల వ్యవధిలో జరిగిపోతూ ఉంటుంది. కానీ మూడు దశాబ్దాల క్రితం ఈ వెసులుబాట్లు ఉండేవి కాదు.. మరీ ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకు సమాచారాన్ని అందించడం చాలా కష్టంగా ఉండేది. ఈ అడ్డంకిని అధిగమించడానికి, పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఆకాశాన్నే తమ మార్గంగా ఎంచుకుని హెలికాప్టర్ పోస్టల్ సర్వీస్‌ను ప్రారంభించింది. అప్పట్లో కమ్యూనికేషన్ రంగంలో ఈ సర్వీస్ చరిత్ర సృష్టించింది. ఎంతో ఆసక్తికరమైన ఈ సర్వీస్ గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..
భారత్ హెలికాప్టర్ మెయిల్ సర్వీస్..
ఎంతో విప్లవాత్మకమైన భారత్ హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ ను భారతదేశంలో జనవరి 27వ తేదీ, 1988లో ప్రారంభించారు. భారతదేశం ద్వీప సమూహాలతో కూడుకుని ఉంటుంది. ముఖ్యంగా అండమాన్ నికోబార్ దీవులకు ఏదైనా సమాచారాన్ని అందించడం చాలా కష్టంగా ఉండేది. ఈ చారిత్రాత్మక హెలికాప్టర్ పోస్టల్ సర్వీస్ కు ఈ దీవులే ప్రారంభ వేదికగా నిలిచాయి. మొదటి విమానం పోర్ట్ బ్లెయిర్ నుండి హేవ్‌లాక్ ద్వీపానికి సమాచారాన్ని చేరవేసేది.
హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ ప్రాధమిక ఉద్దేశ్యం మారుమూల ప్రాంతాలకు కూడా మెయిల్ ను డెలివరీ చేయడం. గతంలో మెయిల్ చేరుకోవడానికి రెండు నుండి మూడు రోజులు పట్టే ప్రాంతాలు కాస్తా హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ వచ్చాక ఆ దూరం, సమయం చాలా తగ్గాయి.
భారత తపాలా శాఖ..
హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ ను విజయవంతం చేయడానికి బారత తపాలా శాఖ పవన్ హన్స్ లిమిటెడ్ తో కలిసి పనిచేసింది. ఈ సేవలో ప్రధానంగా డౌఫిన్ హెలికాప్టర్ ను ఉపయోగించారు. తొలి విమాన ప్రయాణ గుర్తుగా ఫస్ట్ డే కవర్లు జారీ చేయబడ్డాయి. వీటిలో చాలా స్పెషల్ గా పిలువబడే హెలికాప్టర్ మెయిల్ స్టాంప్ కూడా ఉంది. ఇది నేటికీ తపాలా చరిత్రలో విలువైన రికార్టు కావడం విశేషం.
ప్రపంచంలో హెలికాప్టర్ మెయిల్ సర్వీస్..
ప్రపంచంలో మొట్టమొదటి హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ అక్టోబర్ 1, 1947న అమెరికాలో ప్రారంభమైంది. US పోస్టల్ సర్వీస్, లాస్ ఏంజిల్స్ ఎయిర్‌వేస్‌తో కలిసి, సికోర్స్కీ S-51 రోటరీ-వింగ్ హెలికాప్టర్‌ను ఉపయోగించి ఈ సర్వీస్ ను నడిపింది.
అమెరికా విజయం సాధించిన ఒక సంవత్సరం తర్వాత, యునైటెడ్ కింగ్‌డమ్ కూడా 1948లో తన సొంత హెలికాప్టర్ పోస్టల్ సర్వీస్‌ను ప్రారంభించింది.
ఇదీ భారతదేశంలో జరిగిన హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ గురించి ఆసక్తికరమైన సమాచారం.
*రూపశ్రీ.
క్యాన్సర్.. ప్రపంచ వ్యాప్తంగా అదిక శాతం జనాభాను కుదిపేస్తున్న ఆరోగ్య సమస్య. క్యాన్సర్ వచ్చింది అంటే ఇక చావు ఖాయం అని అనుకుంటారు. ఒక వేళ ట్రీట్మెంట్ తీసుకోవాలన్న.. దీని చికిత్స చాలా ఖర్చుతో కూడుకున్నది కావడంతో మధ్యతరగతి, దిగువ తరగతి కుటుంబాలు మనుషుల మీద ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. క్యాన్సర్ గురించి అవగాహన పెంచేందుకు, ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రతి ఏటా ఫిబ్రవరి 4వ తేదీన క్యాన్సర్ దినోత్సవం జరుపుకుంటారు. ఈ క్యాన్సర్ దినోత్సవం సందర్బంగా ఒక షాకింగ్ నిజం బయటపడింది. 2045 నాటికి భారతదేశంలో కొత్త క్యాన్సర్ కేసుల సంఖ్య ప్రతి ఏటా 1.5 మిలియన్ల నుండి 2.45 మిలియన్లకు పెరుగుతుందని అంచనా. భారతదేశంలో క్యాన్సర్ అనేది ప్రధానమైన, తీవ్రమైన ఆరోగ్య సమస్యగా పరిణమిస్తోందని నిపుణులు చెబుతున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..
భారతదేశంలో క్యాన్సర్ ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతోందని నిపుణులు, పరిశోధకులు చెబుతున్నారు. 2045 నాటికి ప్రతి ఏడాది నమోదు అయ్యే క్యాన్సర్ కేసులు 15 లక్షల నుండి 24 లక్షలా 50వేల వరకు పెరుగుతాయని అంచనాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి క్యాన్సర్ ఎంత ఉదృతంగా పెరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. దీని గురించి ఆరోగ్య నిపుణులు, ప్రభుత్వాలు కూడా ఆలోచనలో పడ్డాయి.
ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు..
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చాలామంది క్యాన్సర్ ఉందని తెలిసిన తరువాత లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోవడం అనే విషయం మీదే ఎక్కువగా ఆలోచిస్తుంటారు అని చెబుతున్నారు. కానీ క్యాన్సర్ వచ్చిన తరువాత వైద్యం గురించి ఆలోచించడం కంటే.. క్యాన్సర్ ను ముందుగానే గుర్తించే దిశగా ఉండటం మంచిదని చెబుతున్నారు.
క్యాన్సర్ కు చికిత్స మాత్రమే సరైన మార్గం కాదు.. దీని కోసం ముందస్తు స్క్రీనింగ్ కు హాజరు కావడం, జీవనశైలి మార్చుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని మెయింటైన్ చేయడం, క్యాన్సర్ గురించి అవగాహన పెంచుకోవడం, శరీరంలో ఏదైనా అసౌకర్యం అనిపించినా, ఎక్కడైనా అసాధారణంగా గడ్డలు, చర్మం రంగు మారడం, శరీరంలో మార్పులు వంటివి జరిగినప్పుడు నిర్లక్ష్యం వహించకుండా వైద్యులను సంప్రదించడం వంటివి చేయాలని అంటున్నారు. ఇవన్నీ చేయడం వల్ల క్యాన్సర్ కు ఖరీదైన చికిత్స అనే వరకు వెళ్లకుండా దాన్ని విత్తనం దశలోనే నిర్మూలించేందుకు వీలవుతుంది. పైగా ఇలాంటి పరిస్థితిలో క్యాన్సర్ ను నయం చేయడం కూడా తక్కువ ఖర్చులోనే జరిగిపోతుంది.
ప్రభుత్వ విధానాలు..
తాజాగా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్ లో క్యాన్సర్ చికిత్సను తక్కువ ఖర్చుతో, అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రకటించింది. క్యాన్సర్ మందులపై కస్టమ్ డ్యూటీ మినహాయింపులు, దేశీయ బయోపార్మాస్యూటికల్ ఉత్పత్తిని ప్రోత్సహించడం వంటివి బడ్జెట్ లో ఉన్నాయి.
ప్రజలు చేయాల్సినది..
క్యాన్సర్ అనేది భారతదేశంలో ఎవరికైనా రావచ్చు. ఇది అంటువ్యాధి కాదు.. కానీ కుటుంబ చరిత్ర ఉన్నవారిలో ఇది వచ్చే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతారు. క్యాన్సర్ గురించి ప్రతి వ్యక్తి తనకు తాను జాగ్రత్తలు తీసుకోవాలి. స్క్రీనింగ్ కు హాజరు కావాలి, శరీరంలో ఏ మార్పును నిర్లక్ష్యం చేయకూడదు, ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వీలైనంత వరకు ప్రకృతికి దగ్గరగా గడపడం వంటివి చేయాలి. ఇలా చేస్తే ఎవరికి వారు క్యాన్సర్ నుండి దూరంగా ఉండవచ్చు.
*రూపశ్రీ.
అమ్మాయిలకు అయినా, అబ్బాయిలకు అయినా జీవితంలో ఒక్కసారి జరిగే వేడుక పెళ్లి. ముఖ్యంగా ఆడపిల్లల పెళ్లి విషయంలో తల్లిదండ్రులు చాలా ఆలోచన చేస్తారు. అబ్బాయి ఉద్యోగం, సొంతిల్లు , సంపాదన, ఆస్తిపాస్తులు, అబ్బాయి అలవాట్లు.. ఇవి మాత్రమే కాకుండా కొందరు తల్లిదండ్రులు తమ కూతురిని తమకు ఎంత దగ్గర ప్రాంతంలో వీలైతే అంత దగ్గరలో ఇవ్వాలని అనుకుంటారు. మరీ ముఖ్యంగా ఉద్యోగం లేని అమ్మాయిల విషయంలో అయితే ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. కేవలం కొన్ని గంటలు ప్రయాణం చేయగానే ఒకరిని ఒకరు చేరుకునేట్టుగా ఉండే ప్రాంతాలకు ఇవ్వాలని ఆశిస్తారు. దీని వెనుక చాలా విషయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే..
చేరుకోవడం తేలిక..
దగ్గరగా నివసించడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఒకరినొకరు కలవడానికి అడ్డంకులు తక్కువగా ఉండటం. ఎప్పుడు కావాలంటే అప్పుడు తల్లిదండ్రులు కూతురిని చూడవచ్చు, కూతురు తల్లిదండ్రుల వద్దకు వెళ్లవచ్చు.
చిన్న, పెద్ద సమస్యలు, అపార్థాలను వెంటనే పరిష్కరించవచ్చు. ఇది సంబంధంలో పారదర్శకతను తెస్తుంది, పరస్పర విశ్వాసాన్ని బలపరుస్తుంది.
దగ్గరగా ఉండటం వల్ల, రెండు కుటుంబాలు ఒకరి మనస్తత్వాన్ని, వారి అవసరాలను సులభంగా అర్థం చేసుకోగలవు, ఇది సంబంధంలో సామరస్యాన్ని పెంచుతుంది.
సమయం, ఖర్చు..
కూతురిని దూరంగా ఇచ్చినప్పుడు ఆమెను చూసి రావడానికి తరచుగా ఎక్కువ సమయం, డబ్బు ఖర్చవుతుంది. ప్రయాణాలు, ఫోన్ కాల్స్,వాహన సదుపాయం మాత్రమే కాకుండా ప్రయాణానికే ఉన్న సమయం అంతా గడిపోతుంటుంది. దీని వల్ల సంబంధాలకు సమయం కేటాయించడంలో ఒత్తిడిని కలిగిస్తుంది.
దగ్గర ఉన్న సంబంధాలకు ఇాలాంటి సమస్యలు ఉండవు. చిన్న చిన్న పండుగలు,శుభ సందర్భాలను కూడా కుటుంబంతో పంచుకోవచ్చు. ఇది సంబంధాన్ని బలపరుస్తుంది. అంతేకాదు.. ఆర్థిక, మానసకి భారాన్ని తగ్గిస్తుంది.
వాతావరణం..
దగ్గరి ప్రాంతంలోనే అమ్మాయిని ఇవ్వడం వల్ల ప్రాంతీయత, అలవాట్ల సమస్య ఉండదు. ఆహారపు అలవాట్లు, పద్దతులు కూడా తెలిసి ఉంటాయి. ఇది మనుషుల్లో కలిసిపోవడానికి బాగా సహాయపడుతుంది.
సామాజిక-సాంస్కృతిక నేపథ్యంలో పెద్దగా తేడా లేకపోతే, రెండు కుటుంబాలకు ఒకరితో ఒకరు సర్దుకుపోవడంలో ఎటువంటి సమస్య ఉండదు.
ఈ ఉమ్మడి పునాది సంబంధాన్ని దీర్ఘకాలికంగా స్థిరంగా, బలంగా ఉంచడానికి సహాయపడుతుంది.
పిల్లల పెంపకం..
తల్లిదండ్రుల ఇల్లు, అత్తమామల ఇల్లు కొన్ని మైళ్ల దూరంలో ఉన్నప్పుడు, పిల్లలను పెంచడంలో మంచి సపోర్ట్ లభిస్తుంది. ఉద్యోగం కారణంగా నేటి కాలంలో వారు పిల్లల విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదే దగ్గరలోనే రెండు కుటుంబాలు ఉంటే పిల్లల విషయంలో మంచి సపోర్ట్ దొరుకుతుంది. పిల్లలకు రెండు కుటుంబాల ప్రేమ, మద్దతు కూడా లభిస్తుంది.
ప్రతికూలతలు..
కుటుంబాలు దగ్గరలో ఉండటం వల్ల ప్రయోజనాలే కాదు.. ప్రతికూలతలు కూడా ఉంచాయి. రెండు కుటుంబాలు ఆరోగ్యకరమైనవి అయితే సమస్య లేదు. కానీ కేవలం అమ్మాయి మాత్రమే కావాలని, ఆమె తల్లిదండ్రులు వారి కుటుంబం మాకు అవసరం లేదని అనుకునే అత్తింటి వారితో ఇలా దగ్గరగా ఉండటం వల్ల అటు ఆడపిల్ల తల్లిదండ్రులు, ఆ అమ్మాయి కూడా చాలా బాధపడాల్సి ఉంటుంది.
తల్లిదండ్రులు దగ్గర ఉంటే ఏ చిన్న గొడవ జరిగినా ఆడపిల్ల తమ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లడానికి ఇష్టపడుతుంది. ఇది అత్తింటితో అనుబంధాన్ని నాశనం చేసే అవకాశం ఉంటుంది.
ఆడపిల్ల తల్లిదండ్రులు తమ కూతురు అల్లుడి వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకోవడం, ఆడపిల్లకు చెడు మాటలు నేర్పి కుటుంబాన్ని విచ్చిన్నం చేసే దిశగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది వారి విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది.
అయితే.. దూరం సంబంధం అయినా, దగ్గరి సంబందం అయినా.. రెండు కుటుంబాలు ఆరోగ్యకరంగా ఉండే విదానం మీదనే సంబంధాలు నిలబడతాయి, సంతోషంగా ఉంటాయి.
*రూపశ్రీ.
ఇంత కాలానికి అంబటి రాంబాబు జగన్ గుడ్ లుక్స్ లోకి వచ్చేశారు. అవును ఇప్పుడు వైసీపీలో ఇదే విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జగన్ కు ఎంతో ఇష్టమైన బూతుపురాణాన్నివినిపించిన అంబటికి ఇక ఇప్పుడు పార్టీలో పదోన్నతి, కీలక స్థానం ఖాయమన్న భావన పార్టీలో వినిపిస్తోంది. పైగా వైసీపీ ఎకో సిస్టమ్ లో జగన్ దృష్టిలో పడాలన్నా, ఆయన మెప్పు పొందాలన్న ప్రత్యర్థి పార్టీల నాయకులపై బూతులతో విరుచుకుపడాలి. లేదా వారి ఇళ్లపై దాడులకు పాల్పడాలీ, అదీ కాకపోతే ప్రత్యర్థి పార్టీల కార్యాలయాలను దగ్ధం చేయాలి.
వైసీపీ అధికారంలో ఉండగా దాదాపు ఇలాంటి పనులే చేసి జోగి రమేష్ మంత్రిపదవి పొందారు. కొడాలినాని, అనిల్ కుమార్ యాదవ్ వంటి వారు జగన్ కు అత్యంత నమ్మకస్తులుగా మారారు. తెలుగుదేశం నుంచి వలస వచ్చిన వల్లభనేని వంశీ జగన్ కు అస్మదీయుడయ్యారు. ఇక అంబటి రాంబాబు, పేర్ని నాని కూడా జగన్ అధికారంలో ఉన్నప్పటి నుంచీ ఆయన మెప్పు కోసం సొంత సామాజికవర్గాన్ని కూడా కించపరుస్తూ జనసేనాని పవన్ పై దూషణలతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. అందుకే వారిరువురికీ జగన్ కేబినెట్ లో స్థానం దక్కింది. ఇక నగరి మాజీ ఎమ్మెల్యే రోజా సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జగన్ వైసీపీ లో రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చేసి హద్దులు మీరి బూతులు, దాడులు, దౌర్జన్యాలతో ప్రత్యర్థులపై విరుచుకుపడిన వారందరికీ అందలాలు దక్కాయి. పదవుల తాయిలాలు అందాయి.
అధికారం కోల్పోయిన తరువాత అప్పట్లో హద్దులు మీరి చెలరేగిన వారిలో చాలా మంది జాగ్రత్తపడో, భయపడే నోటికి తాళాలు వేసేసుకున్నారు. కానీ అప్పటి కంటే ఎక్కువగా చెలరేగిపోతున్న అంబటి రాంబాబు ఇప్పుడు జగన్ మెప్పు పొదారనీ వైసీపీలో చర్చ జరుగుతోంది. ఆయనకు పార్టీలో కీలక స్థానం ఖాయమన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. అయితే తన బూతులతో అంబటి రాంబాబు జనం దృష్టిలో మరింత దిగజారిపోయారని పరిశీలకులు అంటున్నారు.
అయితే జగన్ మెప్పు ముందు ప్రజల దృష్టిలో దిగజారడం ఏమంత విషయం కాదని వైసీపీయులు అంటున్నారు. ఇప్పుడు పార్టీలో చర్చ అంతా అంబటికి పార్టీలో దక్కే కీలక స్థానం ఏమిటన్నదే అని అంటున్నారు. అన్నిటికీ మించి తెలుగుదేశం కూటమిలో చీలకలు తీసుకురావాలన్న లక్ష్యంతో ఉన్న జగన్ కు జనసేనాని పవన్ కల్యాణ్ సామాజిక వర్గానికి చెందిన అంబటికి పార్టీలో కీలక పదవి ఇవ్వడం కలిసొచ్చే అంశంగా మారుతున్నంద ఆశా ఉందని అంటున్నారు.
బూతులు, దూషణలు వైసీపీ ఎకో సిస్టమ్ లో భాగంగా మారిపోయాయి. అయితే అలా నోరు పారేసుకునే వారిలో చాలా మంది అనూహ్యంగా సైలెంటైపోయారు. వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత వైసీపీలో బ్యాడ్ మౌత్ లీడర్లలో చాలా మంది మౌనమే నా భాష అన్నట్టుగా మారిపోయారు. ఇందుకు కారణాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైసీపీ అధికారంలో ఉండగా నోరెట్టుకు పడిపోవడమే కాకుండా... ఇష్టారీతిగా దౌర్జన్యాలు, దాడులు, కబ్జాలకు పాల్పడిన నేపథ్యంలో వారిప్పుడు పీకల్లోతు కేసుల్లో మునిగిపోయి ఉండటమే. మౌనంగా ఉంటే మేలు.. బయటకు వచ్చి కేసుల చిక్కులను కోరి ఆహ్వానించడం ఎందుకన్న ధోరణి వారిలో కనిపిస్తోంది.
అయితే వైసీపీలో అంబటి రాంబాబురూటే సెపరేటు. ఆయనకు నోటిని అదుపులో పెట్టుకోవడం అన్న సంగతి తెలియదు. జగన్ మెప్పు కోసం, జగన్ ప్రశంస కోసం ఏమైనా చేస్తారన్న పేరుంది. గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అంబటి రాంబాబు జట్టుకు రంగు వేయించు కోకపోవ డానికి జగన్ కు నలుపు రంగు అంటే ఇష్టం లేకపోవడమే కారణమని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆయన ఇప్పుడు కూడా జుత్తుకు రంగు వేసుకోవడం లేదనుకోండి.. జగన్ కు అప్పుడు ఇష్టం లేని నల్ల రంగు ఇప్పుడు ఎందుకు ఇష్టం అవుతుందన్న అభిప్రాయం కావచ్చు. అది పక్కన పెడితే తాజాగా గత నాలుగు రోజులుగా ఏపీలో అంబటి వ్యవహారమే పెద్ద చర్చగా, రచ్చగా ఉంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై నోరు పారేసుకున్నందుకు ఆయనపై కేసులు నమోద య్యాయి. అరెస్టై రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అంబటి అరెస్టు నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ రోడ్డు మీదకు వచ్చారు. రాజమహేంద్రవరం వెళ్లి అంబటిని పరామర్శించలేదు కానీ, గుంటూరు వచ్చి అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించి, అండగా ఉంటానని చెప్పడమే కాకుండా... అంతకు అంతా బదులు తీర్చుకుంటామంటూ చంద్రబాబు, తెలుగుదేశంలకు వార్నింగ్ ఇచ్చి వెళ్లారు. ఇక్కడ వైసీపీయులలోనే ఒక సందేహం వ్యక్తం అవుతోంది. జగన్ సరే గుంటూరు వచ్చి అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించి రాజకీయమైలేజీ కోసం చేయగలిగినంత చేసి వెళ్లారు. మరి పార్టీలో మిగిలిన వారి సంగతేంటి? బూతుపురాణాల స్పెషలిస్టుగా పేరుపొందిన మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అంబటికి మద్దతుగా కనీసం గొంతు కూడా సవరించుకోలేదేంటి? అన్న ప్రశ్నలు వైసీపీ శ్రేణుల నుంచే వినవస్తున్నాయి. అలాగే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏమయ్యారు? కనీసం అంబటికి మద్దతుగా ఒక్క ప్రకటన చేయడానికి కూడా వారికి ఎందుకు మనసు రావడం లేదు?
సాక్షాత్తూ పార్టీ అధినేత గుంటూరు వచ్చి ర్యాలీ నిర్వహిస్తే కనీసం అటువైపు తొంగి చసేందుకు కూడా వారు ఎందుకు ధైర్యం చేయలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అధికారంలో ఉండగా హద్దూపద్దూ లేకుండా బూతుపురాణంతో రెచ్చిపోయిన ద్వారం పూడి చంద్రశేఖర్ రెడ్డి, జగన్ హయాంలో పార్టీలో, ప్రభుత్వంలో చక్రం తిప్పిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఇలా అధికారంలో ఉండగా రెచ్చిపోయిన వైసీపీ నేతలు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు, వినిపించడం లేదెందుకని అని వైసీపీలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఇప్పుడు వైసీపీలో గొంతు వినిపిస్తున్న వారు అంబటి, పేర్ని నాని, జోగి రమేష్ లు మాత్రమే. అంబటికి మద్దతుగా పేర్నినాని, జోగి రమేష్ లు మాత్రమే మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఇప్పుడు వీరే వైసీపీ ఎకో సిస్టమ్ లోని బూతుల పారాయణాన్ని కొనసాగిస్తున్నట్లు కనిపిస్తోందన్న చర్చ రాజకీయవర్గాలలో జరుగులోంది.
తెలుగువన్ వాస్తవ వేదిక పదకొండవ సంచికలో ఘాటైన చర్చ జరిగింది. తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ పాల్గొని సమకాలీన రాజకీయాలపై నిర్మోహమాటంగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
వైసీపీ అధినేత జగన్‌కు పాదయాత్ర చేయనిస్తారా? అనే ప్రశ్నను కంఠంనేని రవిశంకర్ లేవనెత్తారు. దీనికి స్పందించిన డోలేంద్ర ప్రసాద్, చంద్రబాబు డిక్టేటర్ కాదు… డెమోక్రాట్ అని వ్యాఖ్యానించారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేయలేదని గుర్తుచేశారు.
జగన్ బూచీ చూపిస్తే ఓట్లు పడతాయని చంద్రబాబు, లోకేశ్ భావిస్తున్నారని కొందరు అంటున్నారని పేర్కొన్నారు. అలాగే ఆర్గానిక్ నేతలకు ఇన్‌ఆర్గానిక్ పదవులు లేవని, జ్యోతీబసు, బుద్ధబట్టాచార్య వంటి వారు వేరే పార్టీలోకి వెళ్లలేదని డోలేంద్ర ప్రసాద్ తెలిపారు.
తెలుగుదేశం, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలకు స్పష్టమైన సిద్ధాంతాలు లేవని ఆయన విమర్శించారు. మరోవైపు, వైసీపీ నాయకులు మాయలో ఉన్నారని, ఇసుక దందాలు, గనుల వ్యవహారాల్లో.. దేశంలో ఒక రకం న్యాయం, పేదలకు మరో రకం న్యాయం ఉందా? అని రవిశంకర్ ప్రశ్నించారు.
ఎన్నికల ముందు అరెస్టులు చేస్తే ప్రజల్లో సానుభూతి కలుగుతుందని పార్టీలు భావిస్తున్నాయని కూడా చర్చలో ప్రస్తావన వచ్చింది. ఈ వంటి అంశాలపై కంఠంనేని రవిశంకర్, డోలేంద్ర ప్రసాద్‌ల మధ్య జరిగిన పూర్తి స్థాయి చర్చను తెలుగువన్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి.
ఆహారం ప్రతి జీవికి శక్తివనరు. ప్రాణం లేని వాహనాలు కూడా వాటికి ఇంధనం ఉంటేనే పని చేస్తాయి. అలాంటి ప్రాణం ఉన్న జీవులకు ఆహారం చాలా ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రాణం ఉన్న జీవులలో ఈ ప్రపంచంలో మనిషి చాలా ప్రత్యేకం. అయితే మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటే సమతుల ఆహారం తీసుకోవాలి. ఇందులో ఫైబర్ కూడా ముఖ్యమైనది. చాలామంది ఆహారంలో కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ప్రోటీన్ వంటివి ఉన్నాయా లేదా అని చూస్తారు. కానీ ఫైబర్ గురించి ఆలోచించే వారు తక్కువ. ఆహారంలో ఫైబర్ లోపిస్తే చాలా రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. పైబర్ గురించి నిర్లక్ష్యంగా ఉండేవారు తప్పకుండా తెలుసుకోవలసిన నిజాలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే..
పేగు ఆరోగ్యం..
ఫైబర్ లేకపోవడం వల్ల మన గట్ లైనింగ్ నేరుగా దెబ్బతింటుంది, ఇది జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల పేగులు దెబ్బతినే అవకాశాలు క్రమంగా పెరుగుతాయి.
షుగర్ లెవల్స్..
ఫైబర్ లేకపోవడం వల్ల శరీరంలో షుగర్ లెవల్స్ పెరుగుదల మరింత తీవ్రమవుతుందని. ఆహారంలో ఫైబర్ ఉన్నప్పుడు, అది చక్కెర శోషణను నెమ్మదిస్తుంది. ఫైబర్ లేకపోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఇది ఇన్సులిన్ నిరోధకత, టైప్ 2 డయాబెటిస్‌కు దారితీస్తుంది.
కొలెస్ట్రాల్.. గుండె ఆరోగ్యం..
ఫైబర్ శరీరంలో చీపురులా పనిచేస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తుడిచిపెడుతుంది. ఆహారంలో ఫైబర్ తక్కువగా ఉంటే, ఈ చెడు కొవ్వు ధమనులలో పేరుకుపోతుంది. గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.
ఫ్యాటీ లివర్..
ఫైబర్ లేకపోవడం కొవ్వు కాలేయం ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. దీనివల్ల శరీరం ప్రధాన వడపోత అవయవమైన లివర్ పనితీరు మందగిస్తుంది. ఆరోగ్యకరమైన వ్యక్తి ప్రతిరోజూ 25-30 గ్రాముల ఫైబర్ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
క్యాన్సర్..
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఫైబర్ లేకపోవడం వల్ల శరీరం బ్యూటిరేట్ అనే ముఖ్యమైన షార్ట్-చైన్ ఫ్యాటీ యాసిడ్ ఉత్పత్తి తగ్గుతుంది. బ్యూటిరేట్ పేగు కణాలకు శక్తిని అందిస్తుంది, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుండి వాటిని రక్షిస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం లేకపోవడం వల్ల పెద్దప్రేగు క్యాన్సర్, ఇతర శోథ వ్యాధుల ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని, ఇది దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఎక్కువ ముప్పును కలిగిస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.
హార్మోన్ల అసమతుల్యత.. అకాల వృద్దాప్యం..
ఫైబర్ లేకపోవడం వల్ల అంతర్గత అవయవాలు మాత్రమే కాకుండా చిన్న వయసులోనే వయస్సు పెరిగినట్టు (అకాల వృద్ధాప్యం) కూడా ప్రభావితమవుతుంది. ఇది హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది, అకాల వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుంది.
ఫైబర్ తగినంతగా తీసుకోకపోవడం ముడతలు, శరీరంలో ఎనర్జీ నష్టానికి దారితీస్తుంది. అందువల్ల, ఆహారంలో తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, కాలానుగుణ కూరగాయలను చేర్చడం చాలా ముఖ్యం.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
ఒకప్పుడు సొంపు చాలా మందికి తెలియదు. జీలకర్రను పోలిన సొంపు చాలా మంచి సువాసనతో ఉంటుంది. కొన్నిరకాల వంటల్లో సొంపును వాడతారు. మరికొందరు సొంపును భోజనం తర్వాత జీర్ణశక్తి కోసం తీసుకుంటారు. రెస్టారెంట్లలో భారీ భోజనం తిన్న తరువాత సొంపు ఇవ్వడం వెనుక కారణం.. కడుపు ఉబ్బరం, అజీర్తి ఉండకూడదనే.. అయితే ఆయుర్వేదం సొంపుతో మరింత గొప్ప ప్రయోజనాలు ఉన్నాయని చెబుతుంది. చాలామంది రాత్రి నీటిలో సొంపును నానబెట్టి ఉదయాన్నే తాగుతూ ఉంటారు. కానీ రాత్రి పడుకునే ముందు సొంపు నీరు తాగితే అద్భుతాలు జరుగుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఇంతకూ రాత్రి పడుకునే ముందు సొంపు నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఆయుర్వేద వైద్యులు ఏం చెప్పారు? తెలుసుకుంటే..
మనం తినే, త్రాగే ఆహారాలు మన చర్మంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయని చెబుతారు. అందుకే మనం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. కడుపును శుభ్రంగా ఉంచుకోవడం వల్ల సహజమైన మెరుపు వస్తుంది. సొంపు నీరు కూడా ఇలాంటిదే..
డిటాక్స్ డ్రింక్..
రోజూ డీటాక్స్ డ్రింక్ తాగడం వల్ల శరీరం నుండి టాక్సిన్స్ బయటకు పోతాయి. ఇది చర్మాన్ని హైడ్రేటెడ్ గా, ప్రకాశవంతంగా, యవ్వనంగా ఉంచుతుంది. డిటాక్స్ డ్రింక్ తాగడం వల్ల మొటిమలు , మంట, మచ్చలు వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.
సొంపు నీటిని ఎలా చేసుకోవాలి..
1 కప్పు నీరు
1 టీస్పూన్ సోంపు..
1 టీస్పూన్ జీలకర్ర..
1 టీస్పూన్ క్యారమ్ విత్తనాలు..
తయారు విధానం..
పైన పేర్కొన్నవన్నీ ఒక పాన్‌లో లేదా గిన్నెలో వేయాలి. అందులో ఒక కప్పు నీరు పోయాలి. దీన్ని తక్కువ మంట మీద మరిగించాలి. 5 నుండి 10 నిమిషాలు ఉడకబెట్టండి. ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. డిటాక్స్ డ్రింక్ రెడీగా ఉన్నట్టే ప్రతి రాత్రి పడుకునే ముందు దీన్ని తయారు చేసుకుని తాగమని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
ప్రయోజనాలు..
ఈ డిటాక్స్ డ్రింక్ తాగడం వల్ల మొటిమలు తగ్గుతాయి, చర్మం మెరుస్తుంది, కడుపు శుభ్రంగా ఉంటుంది, శరీరం డీటాక్స్ అవుతుంది
సొంపు చేసే మ్యాజిక్..
పైన పేర్కొన్న డిటాక్స్ డ్రింక్ లో సొంపు ఉంటుంది. ఇది చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఎ, సి, ఇ తో పాటు అనేక ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని శుద్ది చేస్తాయి. ఇది మొటిమలు, ముడతలను తగ్గిస్తుంది, ముఖానికి సహజమైన మెరుపును ఇస్తుంది . ఇది మంటను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
మహిళలు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మూత్రం లీకేజ్ వంటి అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఇలాంటి సందర్బాలలో మహిళలు తమ మూత్రవిసర్జనను నియంత్రించుకోలేకపోతారు. దీనివల్ల అసౌకర్యం, ఇబ్బంది కలుగుతాయి. 40 ఏళ్ల తర్వాత మహిళల్లో దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మూత్రం లీకేజ్ కావడానికి అనేక కారణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. వయస్సు పెరిగే కొద్దీ కటి కండరాలు క్రమంగా బలహీనపడటం జరుగుతాయని, ఇది మాత్రమే కాకుండా వైద్యుల పర్యవేక్షణ లేకుండా డెలివరీ వంటివి జరగడం కూడా ఈ సమస్యకు కారణం కావచ్చని మహిళా వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి కొన్ని చిట్కాలను వైద్యులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుంటే..
మూత్రం లీకేజి ఇందుకే..
వయసు పెరిగే కొద్దీ కటి కండరాలు క్రమంగా బలహీనపడతాయి . ఇది గర్భాశయం, మూత్రాశయం, పురీషనాళం (ప్రేగు మార్గం) కు ఇచ్చే సపోర్ట్ ను బలహీనపరుస్తుంది. ఈ సపోర్ట్ బలహీనపడినప్పుడు, ఈ అవయవాలు వాటి స్థానం నుండి పక్కకు వెళ్లడం జరుగుతుంది. ఇది దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మూత్రం లీకేజ్ వంటి సమస్యలకు దారితీస్తుంది.
ఈ సమస్యకు మరో కారణం ఎక్కువ ప్రసవాలు జరగడం. ప్రతి ప్రసవంతో కటి కండరాలు బలహీనంగా, వదులుగా మారుతాయి. దీనివల్ల అవయవాలు సరైన సపోర్ట్ ను కోల్పోతాయి, మూత్రం లీకేజ్ వంటి సమస్యలకు దారితీయవచ్చు.
మూత్రం లీకేజి కాకూడదంటే ఇలా చేయాలి..
మహిళలు తమను తాము జాగ్రత్తగా చూసుకోవాలి. పోషకాహారం గురించి నిర్లక్ష్యంగా ఉండకూడదు. మల్టీవిటమిన్లు, కాల్షియం తీసుకోవడానికి ముందు వైద్యుల సలహా లేదా విటమిన్ల లోపాన్ని నిర్ధారించుకున్న తర్వాతే తీసుకోవాలి. ఆహారంలో ప్రోటీన్‌ను బాగా ఉండేలా చూసుకోవాలి. మరీ ముఖ్యంగా కెగెల్ వ్యాయామాలు చేయాలి. సమస్య తీవ్రంగా ఉంట వైద్యులను కలిసి చికిత్స తీసుకోవాలి.
ఇలా చేయడం వల్ల మూత్రం లీకేజీ సమస్య పరిష్కారం చేసుకోవచ్చు. లేదంటే మూత్రాన్ని నియంత్రించుకోలేక చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ముఖ్యంగా బయటకు వెళ్లినప్పుడు, గుడులకు వెళ్లినప్పుడు , శుభకార్యాలు వంటివి జరుగుతున్నప్పుడు, ప్రయాణాలలో ఉన్నప్పుడు ఇది చాలా దారుణమైన అనుభవాన్ని మిగులుస్తుంది.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
