12 ఏళ్ల తర్వాత సీబీఐకి చిక్కిన హంతకుడు
posted on Oct 14, 2025 9:27PM

యూఏఈలో భార్య హత్య కేసులో 12 ఏళ్లుగా పరారీలో ఉన్న నిందితుడనీ ఎట్టకేలకు సీబీఐ అరెస్ట్ చేసింది..ఓ వ్యక్తి యూఏఈలో తన భార్యను హత్య చేసి గత 12 ఏళ్లుగా పరారీలో ఉన్నాడు. అతని కోసం సీబీఐ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు హైదరాబాద్‌లో ఉన్నట్లుగా తెలుసుకున్న అధికారులు నిందితుడిని అరెస్ట్ చేశారు.. సత్తార్ ఖాన్ ( 52) అనే వ్యక్తి డ్రైవర్ గా పని చేస్తున్నాడు. 2013 నవంబర్ 14న యూఏఈలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇతను భార్యను హత్య చేసినట్లు ఆరోప ణలు ఉన్నాయి.
హత్య అనంతరం అతను ఇండియా కి పారిపోయి వచ్చి దాదాపు 12 ఏళ్లుగా అతని జాడ పోలీ సులకు తెలియ కుండా జాగ్రత్తప డ్డాడు...యూఏఈ అధికారుల విజ్ఞప్తి మేరకు సీబీఐ 2022 ఏప్రిల్‌లో కేసు నమోదు చేసింది. కేసు నమోదు అయిన తర్వాత సీబీఐ నిందితుడిపై లుక్ అవుట్ సర్క్యులర్ (LOC) జారీ చేసినప్పటికీ, అతను పోలీసులకు చిక్కలేదు.. తరువాత సత్తార్ మరో పాస్‌పోర్ట్ ఉపయోగిస్తున్నట్టు తెలిసి, దానిపై మరో లుక్ అవుట్ సర్క్యు లర్ జారీ చేశారు.
సాంకేతిక ఆధా రాలు, గూఢచార సమాచారం ఆధా రంగా చేసుకుని సీబీఐ అధికారులు రంగారెడ్డి జిల్లాలో అతను నివాసం ఉంటున్నట్లుగా కనుక్కున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న నిందితుడు సత్తార్ ఖాన్ దోహా వెంటనే అప్రమత్తమై పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా, సిబిఐ బృందం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మాటు వేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.అనంతరం అధి కారులు నిందితు డిని హైదరాబాద్ లోని మేజిస్ట్రేట్ ఎదుట హాజరుప రచగా, ఢిల్లీ న్యాయస్థానం ముందు హాజరు పరచడానికి ట్రాన్సిట్ రిమాండ్ మంజూరు చేశారు.
సీబీఐ అధికారులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.