జూబ్లీ ఉప ఎన్నికల్లో రెండో రోజు 11 నామినేషన్లు

 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రెండో రోజు 11 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మంగళవారం పీఏటీఏ పార్టీ అభ్యర్థి మాచర్ల వెంకట్ రెడ్డి  రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. అధికారులు అన్ని ప్రకియలను ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం సజావుగా నిర్వహించారు. మొదటి రోజు 10 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా నేడు రెండో రోజు 11 నామినేషన్లు సమర్పించారు. 

రెండు రోజుల్లో మొత్తంగా 22 నామినేషన్‌లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. రేపు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ  చేస్తున్న  మాగంటి సునీత గోపీనాథ్‌  నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నేడు పార్టీ అధినేత కేసీఆర్ బీఫామ్ అందజేసి ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ తరఫున రూ.40 లక్షల రూపాయలు చెక్కును అందించారు. నామినేషన్ల ప్రక్రియ ఈనెల 13 నుంచి 21 వరకు కొనసాగనుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu