విజయదశమి రోజున విషాదం.. మధ్యప్రదేశ్ లో 11 మంది మృతి
posted on Oct 2, 2025 12:44AM
.webp)
విజయదశమి పర్వదినం రోజున మధ్య ప్రదేశ్ లో మహా విషాదం సంభవించింది. శరన్నవరాత్రులలో భక్తి శక్తలతో పూజలు చేసి విజయదశమి రోజున అమ్మవారి విగ్రహ నిమజ్జనం సమయంలో ఘోర ప్రమాదం జరిగింది. ఖండ్వా జిల్లా జమ్లి గ్రామంలో భక్తులు దుర్గామాత విగ్రహాన్ని ట్రాక్టర్-ట్రాలీపై నిమజ్జనం కోసం తీసుకు వెడుతుండగా, ఓ కల్వర్టును దాటుతుండగా ట్రాక్టర్ అదుపుతప్పి పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది.
ఈ ఘటనలో ఇప్పటివరకు 11 మంది మరణించారు. మృతులలో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నారు. కాగా ఈ ప్రమాదంలో మరి కొందరు గల్లంతయ్యారు. వారి కోసం గజఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దుర్ఘటనపై మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.