వంద మందికి పైగా నక్సల్స్ లొంగుబాటు
posted on Oct 2, 2025 12:54AM

దేశంలో నక్సలిజాన్ని అణచివేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ సత్ఫలితాలను ఇస్తున్నది. ఇప్పటికే పలు ఎన్ కౌంటర్ లలో మావోయిస్టు అగ్రనేతలు పలువురు హతం కాగా, అనేక మంది లొంగిపోయారు. తాజాగా ఛత్తీస్ గఢ్ లో ఏకంగా వంద మందికి పైగా మావోయిస్టులు ఆయుధాలను వదిలి లొంగిపోయారు. గాంధీ జయంతి రోజు (అక్టోబర్ 2) వీరంతా హింసామార్గాన్ని వీడి శాంతియుత మార్గంలోకి అడుగుపెట్టారు.
బీజాపూర్ జిల్లాలో పోలీసు, పారామిలటరీ ఉన్నతాధికారుల సమక్షంలో వీరంతా ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. అలా లొంగిపోయిన వారిలో 49 మందిపైన రూ. కోటి రూపాయల రివార్డులు ఉంది. అలాగే లొంగిపోయిన వారిలో డివిజనల్, ఏరియా కమిటీల సభ్యులు, మిలీషియా కమాండర్లు కూడా ఉన్నారు. చత్తీస్ గఢ్ ప్రభుత్వం చేపట్టిన నవ జీవన మార్గం అనే పునరావాస కార్యక్రమంలో భాగంగా ఈ లొంగుబాట్లు జరిగాయి.