గిన్నిస్ రికార్డులకెక్కిన బెజవాడ దసరా కార్నివాల్
posted on Oct 2, 2025 12:33AM

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన విజయవాడ దసరా ఉత్సవ్ అద్భుత విజయం సాధించింది. మైఃసూరు దరసా ఉత్సవాలను తలదన్నెలా బెజవాడ దసరా ఉత్సవ్ ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన విజయవాడ దసరా కార్నివాల్-2025 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్వ్స్ లో స్థానం లభించింది. విజయదశమి పర్వదినం సందర్భంగా గురువారం (అక్టోబర్ 2) నిర్వహించిన విజయవాడ దసరా కార్నివాల్ లో అత్యధిక సంఖ్యలో డప్పు కళాకారులు ఒకే చోట ప్రదర్శన ఇచ్చారు. దీనితో ఈ కార్నివాల్ కు గిన్నిస్ బుక్ లో స్థానం లభించింది.
మహాత్మాగాంధీ రోడ్డులో నిర్వహించిన ఈ భారీ కార్నివాల్ ర్యాలీలో వేలాది మంది కళాకారులు తమ సంప్రదాయ కళారూపాలను ప్రదర్శించి సభికులను మంత్రముగ్ధుల్ని చేశారు. ఈ అద్భుత ప్రదర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కు ఎక్కింది. దీనిని అధికారికంగా ధృవీకరించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందుకు సంబంధించిన సర్టిఫికెట్‌ను అందజేశారు. ఈ సందర్భంగాచంద్రబాబు మాట్లాడుతూ, ఈ రికార్డు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక ఔన్నత్యానికి, , ప్రభుత్వ ఆశయాలకు సాక్ష్యంగా అభివర్ణించారు.