కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి సోదరులు

పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో  పిన్నెల్లి సోదరులు గురువారం (డిసెంబర్ 11) మాచర్ల కోర్టులో లొంగిపోయారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి లకు లొంగిపోవడానికి సర్వోన్నత న్యాయస్థానం   ఇచ్చిన గడువు ముగుస్తున్న తరుణంలో మాచర్చ కోర్టుకు హాజరై సరెండర్ పిటిషన్ దాఖలు చేసి లొంగిపోయారు. 

ఈ ఏడాది మే 24న పల్నాడు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు జె. వెంకటేశ్వర్లు, జె. కోటేశ్వరరావు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో పిన్నెల్లి సోదరులు నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు వారు ముందస్తు బెయిల్ కోసం తొలుత ఏపీ హైకోర్టును, ఆ తరువాత సుప్రీం కోర్టునూ ఆశ్రయించారు. రెండు చోట్లా వారికి చుక్కెదురైంది.  

సుప్రీం కోర్టు వారి ముందస్తు బెయిలు పిటిషన్ ను కొట్టివేస్తూ రెండు వారాల్లోగా సంబంధిత కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. సుప్రీం కోర్టు విధించిన గడువు ముగుస్తుండటంతో వారు కోర్టులో లొంగిపోయారు. ఈ సందర్భంగా కోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  అలాగే గురజాల సబ్‌ డివిజన్‌ పరిధిలో 144 సెక్షన్‌ విధించడంతో  పాటు పోలీస్‌ యాక్ట్‌ 30ను అమలు చేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా పలువురు వైసీపీ నాయకులకు   హౌజ్‌ అరెస్టు చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu