ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాల దారి మళ్లింపు

సంక్రాంతి పండగను పురస్కరించుకుని ఆంధ్ర ప్రదేశ్ వెళ్లిన వారు తిరిగి వచ్చే క్రమంలో విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీ రద్దీ ఏర్పడింది. ఏపీ నుంచి    పండగ పూర్తి చేసుకొని   హైదరాబాద్ నగరానికి భారీగా వాహనాలు వస్తున్నాయి. శని, ఆది (జనవరి 17, 18) వారాలలో ఈ రద్దీ మరింత అధికంగా ఉంటుందన్న అంచనాలు ఓ పక్క,  జాతీయ రహదారిపై  పై చిట్యాల, పెద్ద కాపర్తి వద్ద ప్లై ఓవర్ నిర్మాణ పనులు మరో పక్క ఉండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే  నల్గొండ జిల్లా పోలీసు శాఖ ట్రాఫిక్ మళ్లింపు చేపట్టింది. ఈ మేరకు నల్గొండ జిల్లా ఎస్పీ ట్రాఫిక్ మళ్లింపు వివరాలను ప్రకటించారు.

 గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు గుంటూరు, మిర్యాలగూడ, హాలియా, కొండమల్లేపల్లి, చింతపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్ కు వెళ్లాల్సి ఉంటుంది. ఇక మాచర్ల నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలను  మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు  మాచర్ల , నాగార్జునసాగర్ , పెద్దవూర , కొండపల్లేపల్లి, చింతపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్ చేరుకునేలా ట్రాఫిక్ ను మళ్లిస్తారు.  అదే విధంగా నల్లగొండ నుంచి  హైదరాబాద్   వెళ్లే వాహనాలను నల్లగొండ , మార్రిగూడ బై పాస్ , మునుగోడు, నారా యణపూర్, చౌటుప్పల్  మీదుగా హైదరాబాద్ కు చేరుకోవలసి ఉంటుంది.  ఇక విజయవాడ నుంచివి  హైదరాబాద్ వెళ్లే వాహనాలను కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ, హాలియా, చింతపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్ కు మళ్లిస్తారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu