చదువు ఒక్కటే పేదిరికాన్ని పోగొడుతుంది : సీఎం రేవంత్‌

 

మాదాపూర్ శిల్పకళా వేదికలో కొలువుల పండుగ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. గ్రూప్-3లో అర్హత సాధించిన వారికి ముఖ్యమంత్రి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతు తాము రెండేళ్లలో 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం తెలిపారు. ప్ర‌భుత్వ టీచ‌ర్లు, గ్రూప్ 1,2,3 వంటి ఉద్యోగాల‌ను ఒక బాధ్య‌త‌తో ఎలాంటి త‌ప్పులు లేకుండా భ‌ర్తీ చేశామని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. 

గ‌త బీఆర్‌ఎస్ ప్ర‌భుత్వం ప‌రీక్ష‌ల‌ను స‌రిగా నిర్వ‌హించ‌లేదు.. ప్ర‌శ్నా ప‌త్రాల‌ను ప‌ల్లీ బ‌ఠానీల్లా అమ్మితే వారికి చీమ‌కుట్టిన‌ట్లైనా లేదని తెలిపారు. టీజీపీఎస్సీ ని స‌మూలంగా ప్ర‌క్షాళ‌న చేశాం....యూపీఎస్సీ ని స్వ‌యంగా ప‌రిశీలించి టీజీపీఎస్సీ ని ఏర్పాటు చేశామని సీఎం స్ఫష్టం చేశారు. నియామ‌క‌ప‌త్రాలు ఇవ్వొద్ద‌ని కుట్ర‌లు చేసినా కోర్టుల ముందు కొట్లాడి భ‌ర్తీ చేశామన్నారు. 

ఎల్బీ స్టేడియం, శిల్పారామం, సాగునీటి పారుదల శాఖ కార్యాల‌యం, అంబేద్క‌ర్ విగ్ర‌హం సాక్షి గా నియామ‌క ప‌త్రాల‌ను అంద‌జేశామని ఆయన తెలిపారు. తెలంగాణ నిరుద్యోగుల ప‌ట్ల గ‌త ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించింది.. పుట్టిన బిడ్డ ప్ర‌యోజ‌కుడు అయితే త‌ల్లిదండ్రుల ఆనందం అంతా ఇంతా కాదని.. కూలీ ప‌ని చేసి మ‌రీ త‌ల్లిదండ్రులు చ‌ద‌వించి పోటీ ప‌రీక్ష‌ల‌కు త‌యారు చేశారని ముఖ్యమంత్రి వెల్లడించారు.

ఉస్మానియా, కాక‌తీయ యూనివ‌ర్సిటీల్లో విద్యార్థులు ఉద్య‌మ‌కారుల‌య్యారు. విద్యార్థులు అవ‌స‌ర‌మైన సంద‌ర్భంలో ప్రాణ‌త్యాగాలు చేసి తెలంగాణ‌ను సాధించారని చెప్పారు. 10 ఏళ్ల‌లో రెండు సార్లు సీఎం అయిన వ్య‌క్తులు రాజ‌కీయ‌, కుటుంబ‌, పార్టీ ప్ర‌యోజనాల కోస‌మే ప‌నిచేశారు. ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీ పైన ఆలోచ‌న చేయ‌లేదని విమర్శించారు. విద్య ఒక్క‌టే జీవితాల్లో మార్పు, వెలుగులు తీసుకువ‌స్తుంది.. పేద‌ల మోహంలో త‌ల్లిదండ్రుల‌ను చూసుకుని  ప్ర‌భుత్వ ఉద్యోగులు సేవలు ల‌క్ష్యంగా అందించాలని సీఎం రేవంత్ తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu