క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన సీఎం రేవంత్
posted on Oct 1, 2025 2:08AM

ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై అద్భుత ప్రదర్శన చేసి టీమ్ ఇండియాను విజయంలో కీలక పాత్ర పోషించి, మ్యాన్ ఆఫ్ ది ఫైనల్ గా నిలిచిన క్రికెటర్ తిలక్ వర్మ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంగళవారం (సెప్టెంబర్ 30) భేటీ అయ్యాడు. హైదరాబాద్ కు చెందిన తిలక్ వర్మ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ సందర్భంగా తిలక్ వర్మను అభినందించి సత్కరించారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా తిలక్ వర్మ తాను సంతకం చేసిన బ్యాట్ ను సీఎంకు బహూకరించాడు.
ఆసియాకప్ ఫైనల్ లో పాకిస్థాన్ పై టీమ్ ఇండియా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన తెలుగుతేజం తిలక్ వర్మపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ లు తిలక్ వర్మను అభినందిస్తూ సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే. మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ.. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌తో పిచ్‌ను పూర్తిగా తన కంట్రోల్‌లోకి తీసుకున్నాడనీ, ఒత్తిడిలోనూ అతని ప్రశాంతత, ప్రతిభ స్ఫూర్తిదాయకమనీ చంద్రబాబు ట్వీట్ చేశారు.