మావోయిస్టు పార్టీలో విభేదాలు...ముగ్గురు లొంగుబాటు
posted on Oct 10, 2025 7:03PM

తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీలో కీలకస్థానా ల్లో ఉన్న ముగ్గురు నేతలు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో చందు–సోని దంపతులు, వికాస్ అనే మరో నేత ఉన్నారు. లొంగిపో యిన నాయకులు తమ అనుభవాలు, పార్టీ అంతర్గత పరిస్థితులను మీడియా ముందుంచారు.లొంగిపోయిన వికాస్ మాట్లాడుతూ మావోయిస్టు పార్టీలో విభేదాలు వాస్తవమే. అగ్రనా యకుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆయు ధాలు వదిలేయాలా లేదా అనే దానిపై చాలా కాలంగా చర్చ కొనసాగు తోంది.
మల్లోజులా జగన్ మధ్య కూడా ఈ అంశంపై చర్చలు జరుగుతు న్నాయని వెల్లడించారు.
వికాస్ సిద్దిపేట జిల్లాకు చెందిన వాడు. ఇతను 1990లో మావో యిస్టు ఉద్యమంలో చేరి 35 ఏళ్ల పాటు చురుకుగా కార్యకలాపాలు నిర్వహించాడు. చందు (45) చిన్న వయసులోనే విప్లవ సాహిత్యానికి ఆకర్షితుడై, 1993లో నర్సంపేట దళంలో చేరాడు. సోని అతని జీవిత భాగస్వామి.తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ మావోయిస్టు పార్టీలో ఆధిపత్య పోరు సహజమే. ఈ విభేదాల కారణం గానే పలువురు సభ్యులు దళాన్ని వీడుతున్నారు.
ఇప్పటి వరకు 412 మంది మావోయి స్టులు లొంగిపో యారు. వారిలో 72 మంది తెలంగాణకు చెందినవారు. వీరిలో 8 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారని వివరించారు.మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలవా లని పిలుపుని చ్చారు. ప్రస్తుతం పార్టీలో సెక్రటరీ పదవి ఖాళీగా ఉందని, మల్లోజులా జగన్ ఎక్కడు న్నారో సమాచారం అందుబాటులో లేదని చెప్పారు.కోల్డ్ బెల్ట్ ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాలను మళ్లీ చురుకుగా చేయాలనే ప్రయత్నం చేసినా, నాయకుల లొంగుబాటుతో ఆ యోచనలు దెబ్బతిన్నాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి.ఈ లొంగుబాటుతో మావోయిస్టు పార్టీ లో అంతర్గత భిన్నాభిప్రాయాలు మరింత బహిర్గతం అవుతున్నాయి