బావ పొట్టిగా ఉన్నాడని హత్య చేసిన బామ్మర్ది

 

గుంటూరులో దారుణం చోటుచేసుకుంది. పెళ్ళైన పది రోజులకే బావను అతని బావమరిది నడిరోడ్డుపై కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు. బాపట్ల జిల్లా వేమూరు మండలం ఏడవురు గ్రామానికి చెందిన కుర్రా గణేష్ (25)కు తెనాలికి చెందిన కీర్తి అంజనీదేవికి సంబంధం చూడటానికి వెళ్లారు. గణేష్ పొట్టిగా ఉన్నాడని యువతి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. అయినప్పటికీ మొదటి చూపులోనే ఒకరినొకరు ఇష్టపడిన గణేష్, కీర్తి అంజనీదేవి పెద్దలను ఎదిరించి పది రోజుల క్రితం అమరావతి గుడిలో రహస్యంగా వివాహం చేసుకున్నారు. 

తన చెల్లెలికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడని ఆగ్రహంతో ఉన్న యువతి సోదరుడు దుర్గారావు తన బావ గణేష్ అంతు చూస్తానని హెచ్చరించాడు. తమకు ప్రాణహాని ఉందని గణేష్ నల్లపాడు పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. పెళ్లి రిసెప్షన్‌ కోసం బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకెళ్తున్న బావ గణేష్‌ను గుంటూరులో నడిరోడ్డుపై బామ్మర్ది దుర్గారావు తన స్నేహితులతో కలిసి కత్తితో పొడిచి దారుణంగా చంపాడు. పోలీసులు దుర్గారావు, అతని స్నేహితులను అరెస్ట్ చేశారు
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu