పెళ్లికి నిరాకరణ...మరదలను గొంతు కోసి హత్య చేసిన బావ

 

హైదరాబాద్ నగరంలో రెండు వేరు వేరు చోట్ల ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురికావడంతో ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గుర వుతున్నారు.  ఈరోజు ఉదయం తన పాపను స్కూల్ దగ్గర వదిలి పెట్టి వెళుతుండగా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన మరువక ముందే ముషీరాబాద్ పరిధిలో ఓ దుండగుడు ఏకంగా ఇంట్లోకి చొరబడి మైనర్ బాలికను అతి దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది.

సికింద్రాబాద్ పరిధిలోని ముషీరాబాద్ డివిజన్‌కు చెందిన బాపూజీ నగర్ బస్తీలో ఈరోజు సోమవారం మధ్యాహ్నం సమయంలో ఒక అగంతకుడు ఇంట్లో ఒంటరిగా ఉన్న 17 ఏళ్ల మైనర్ బాలికను కత్తితో విచక్షణా రహితంగా పొడిచి హతమార్చిన ఘటన స్థానికులను భయబ్రాం తులకు గురిచేసింది. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా పలసకు చెందిన పవిత్ర కుటుంబం హైదరాబాదు నగరానికి వచ్చి ముషారాబాద్ పరిధిలో నివాసానికి జీవనం కొనసాగిస్తున్నారు.

అయితే వరసకు  మేనత్త కొడుకు ఉమా శంకర్  అమ్మాయి పవిత్ర ఇంటికి వచ్చి పెళ్లి చేయాలని ఇంట్లో గొడవ చేశాడు... అబ్బాయి పవర్తన బాగోలేదని తెలిసిన పవిత్ర కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. వాళ్ళు నిరాకరించడంతో ఆగ్రహంతో  మేన బావ ఉమా శంకర్ వెంటనే పక్కనే ఉన్న కిచెన్ లోకి వెళ్లి చాకు తీసుకువచ్చి  అమ్మాయి పవిత్ర తల్లిదండ్రుల ముందే పవిత్ర  గొంతు కోసి... పలుమార్లు పొడిచి.. అనంతరం అక్కడి నుండి పారిపోయాడు.. తీవ్ర గాయాలు కావడంతో అధిక రక్తస్రావమై పవిత్ర అక్కడి కక్కడే మృతి చెందింది. 

సంఘటన జరిగిన వెంటనే బోద్ధనగర్, వారాసిగూడ SHOలు సహా పోలీసు సిబ్బంది తో పాటు క్లూస్ టీం అక్కడికి చేరుకుని ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. పెళ్లికి నిరాకరించినందుకు కోపంతో పవిత్ర మేనబావ ఉమాశంకర్ ఈ దారుణానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం నిందితుడు  పరారీలో ఉన్నాడు.పవిత్ర హత్య కేసులో పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడు ఉమాశంకర్ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. 

పరిసర ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ తో సహా సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తూ దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు.ఈ ఘటనతో బాపూజీ నగర్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక యువతి హత్యపై ప్రజలు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితుడిని త్వరగా పట్టుకో వాలని కోరుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu