శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో అతిపెద్ద విమానం ల్యాండింగ్

 

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో అతిపెద్ద విమానం ల్యాండింగ్ అయింది... దానిని చూసిన ప్రయాణికులు ఒకెంత ఆశ్చర్యచకితుల య్యారు.. కండ్లప్ప గిచ్చి అలాగే చూస్తుండి పోయారు. అయ్య బాబోయ్ ఎంత పెద్ద విమానమో... చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు.. చూస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అంటూ ఎయిర్ పోర్ట్ లో ఉన్న ప్రయాణికులు దానిని చూసి తెగ సంబరపడిపోతూ ఫోటోలు, వీడియోలు తీస్తూ యమ బిజీగా  ఉన్నారు.అవునండి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో మరో మారు ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం ల్యాండింగ్ అయింది.

అంటోనోస్ ఎన్ 124... ప్రపంచంలోనే అతిపెద్ద విమానం లో ఇది ఒకటి...క్వాడ్ ఇంజన్ అంటే నాలుగు ఇంజన్లు ఉంటాయి.. మరియు 24 చక్రాలు ఉంటాయి. వింగ్ ప్రాంతాలు 6760 చదరపు అడుగులు ఉంటుంది.. ఖాళీ విమానం 1,81,000 కిలోల బరువు ఉంటుంది ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానాల్లో ఇది ఒకటి దీనిలో లాంగ్ ట్రక్కులు నేరుగా లోడింగ్ మరియు అన్లోడింగ్ కోసం రాంపులను సైతం ఉపయోగించి ప్రవేశించగలవు... గతంలో కూడా అతిపెద్ద విమానం శంషాబాద్ ఎయిర్పోర్ట్‌లో ల్యాండింగ్ అయింది. ఇప్పుడు మరో మారు అతిపెద్ద కార్గో విమానం ల్యాండింగ్ అవడంతో  ప్రయాణికుల ఆనందం అంతా ఇంతా కాదు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu