రోహిత్ న్యూ లుక్.. ఇంత స్లిమ్ ఎలా అయ్యాడు?

రోహిత్ శ‌ర్మ‌ ఒకింత బొద్దుగా ఉంటాడు. ఒబెసిటీ అనలేం కానీ.. స్పోర్టింగ్ ఫిగర్ అయితే కాదని అంతా ఒప్పుకుంటారు. ఫిట్ నెస్ అనుమానమే అంటారు. అలాంటి రోహిత్ శర్మ ఒక్కసారిగా స్లిమ్ గా తయారయ్యాడు. బొద్దుగా, లావుగా ఉండే రోహిత్ శర్మ  ఉన్న‌ట్టుండి ఇంత స‌న్న‌గా ఎలా మారిపోయాడంటూ ఆయన ఫ్యాన్స్ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.  సియ‌ట్ క్రికెట్ అవార్డుల ఫంక్ష‌న్లో క‌రోహిత్ శర్మ    75 కిలోల‌ క‌రెంటు తీగ‌లా కనిపించాడు.  అదీ కేవలం రెండంటే రెండు నెలలలో. అలాగ‌ని ఆయ‌నేమీ అంద‌రిలా క‌డుపు మాడ్చుకోలేదు. ఏకంగా ఏడు పూట‌లా తింటూ త‌న ఫిట్ నెస్ సాధించిన‌ట్టు తెలుస్తోంది. అరే అంత‌లా రోహిత్ శ‌ర్మ ఏం తిన్నాడు? ఆ డైట్ ప్లాన్ మ‌న‌మూ ఒక ప‌ట్టు ప‌డ‌తాం అనుకునే వారు రోహిత్ శర్మ డైట్  ప్లానింగ్ పై ఒక లుక్ వేస్తే స‌రి. ఇంత‌కీ డైటేంటంటే..?
 
ఉద‌యం లేవ‌గానే ఆరు నాన‌బెట్టిన బాదంప‌ప్పులు, మొల‌కెత్తిన స‌లాడ్ ఆపై జ్యూస్ తాగ‌డం. ఇక తొమ్మిదిన్న‌ర‌కు బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా తాజా పండ్ల‌తో కూడిన‌ ఓట్ మిల్క్ తో పాటు ఒక గ్లాసు పాలతో స‌రిపెట్ట‌డం. ప‌ద‌కొండున్న‌ర‌కు పెరుగు, చిల్లా, కొబ్బ‌రి నీళ్లు, ప్రోబ‌యోట్రిన్స్. ఇదంతా మాణింగ్ సెష‌న్ డైట్.

ఇక మ‌ధ్యాహ్నం.. ఒక‌టిన్న‌ర‌కు వెజిట‌బుల్ క‌ర్రీస్, అన్నం, ప‌ప్పు, స‌లాడ్ ఎంచ‌క్కా లాగించేస్తాడు. ఆపై . సాయంత్రం 4. 30గంట‌ల‌కు డ్రై ఫ్రూట్స్ తీస్కుంటాడు. రాత్రి ఏడున్న‌ర‌కు కూర‌గాయ‌లు పులావ్ తింటారు, ఇక ప‌డుకునే ముందు గ్లాస్ పాలు ఇదీ రోహిత్ డైట్ అండ్ స్లిమ్ సీక్రెట్  ఇదే హిట్ మాన్ డైట్. మ‌రి మీరు కూడా ఒక ప‌ట్టు ప‌డ‌తారా?రోహిత్ లా హిట్ మాన్ అయిపోతారా? ట్రై చేయండి మ‌రి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu