నెల్లూరు, తిరుపతికి భారీ నుంచి అతి భారీ వర్షాలు
posted on Dec 1, 2025 11:54AM

బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను తీవ్ర వాయుగుండంగా బలహీన పడింది. ప్రస్తుతం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరీ తీరాలకు సమాంతరంగా కదులుతున్న ఈ తీవ్ర వాయుగుండం ఈ సాయంత్రానికి మరింత బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొం ది.
వాయుగుండంగా బలహీనపడినప్పటికీ, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు, తిరుపతి జిల్లాలలో పలు చోట్ల బారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక ఈ వాయుగుండం కారణంగా దక్షిణ కోస్తా తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మత్స్యకారులు సముద్రంపై వేటకు వెళ్లడం నిషేధమని పేర్కొంది. ఇలా ఉండగా భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రైతులు పంట నష్టం వాటిల్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారలు సూచించింది.