ప్రజలు శాంతి మార్గాన్ని ఎంచుకోవాలి : ప్రధాని

 

 

మణిపూర్ పర్యటలో భాగంగా అల్లర్ల బాధితులను  ప్రధాని మోదీ పరామర్శించారు. భారీ వర్షం కారణంగా హెలికాప్టర్ అనుమతి లభించకపోవడంతో ప్రధాని ఇంఫాల్ నుంచి 65 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో ప్రయాణించి చురచంద్‌పూర్‌కు చేరుకున్నారు. అక్కడ పురావాస కేంద్రాలను సందర్మించి బాధితుల యోగక్షేమాలు తెలుసుకున్నారు. 

బైరబీ-సైరాంగ్ కొత్త రైల్వే లైన్‌ను ప్రధాని జాతికి అంకితం చేశారు. ఈ కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి రూ. 8,070 కోట్ల వ్యయం అయ్యింది. సవాళ్లతో కూడి కొండ ప్రాంతాల మీదుగా ఈ రైల్వే లైన్‌ను నిర్మించారు. ఈ రైల్వే లైన్‌ కింద 45 టన్నెల్స్, 55 ప్రధాన వంతెనలు, 88 చిన్న వంతెనలను కూడా నిర్మించారు. దీంతో పాటు మరికొన్ని ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభించారు ప్రధాని

 దేశ ప్రగతికి మణిపూర్‌ కీలక స్తంభమని, ధైర్యవంతులు, దృఢసంకల్పానికి ప్రతీక ఈనేల అని ప్రధాని అన్నారు. ఇక్కడి కొండలు వెలకట్టలేని ప్రకృతి వరప్రసాదమని, ప్రజల కఠోర పరిశ్రమకు సంకేతాలని కొనియాడారు. మణిపూర్ ప్రజల స్ఫూర్తికి సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. మణిపూర్‌లో నూతన ఉషోదయం ప్రారంభం కానుందని, ప్రజలు శాంతి మార్గాన్ని ఎంచుకున్నారని, వారికి కేంద్రం బాసటగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. 2023లో ఘర్షణల తర్వాత రెండేళ్లకు ప్రధాని రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu