మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు సుజాతక్క సరెండర్

 

మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల కల్పన ఎలియాస్​ సుజాతక్క తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. పశ్చిమ బెంగాల్‌లో 2011లో మృతి చెందిన అగ్రనేత కిషన్‌జీ భార్య సుజాతక్క, ఛత్తీస్‌గఢ్‌ సౌత్ సబ్ జోనల్ బ్యూరో ఇన్‌ఛార్జ్‌గా ఉన్నట్లు తెలుస్తుంది. ఆమెపై 106 కేసులు నమోదు కాగా, రూ.1 కోటి రివార్డు ఉంది.

మావోయిస్టు పార్టీ అగ్రనేత కిషన్​జీ భార్యనే సుజాతక్క. 1984లో కిషన్‌జీని ఆమె పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఛత్తీస్​గఢ్​ సౌత్​ సబ్​ జోనల్​ బ్యూరో ఇన్​ఛార్జిగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే సుజాతక్క 106 కేసుల్లో నిందితురాలిగా ఉన్నారు. ఆమె లొంగుబాటు గురించి మధ్యాహ్నం డీజీపీ జితేందర్​ మీడియాకు వివరాలను వెల్లడించనున్నారు. ఆమెతో పాటు మరికొందరు మావోయిస్టులు లొంగిపోయినట్లు సమాచారం.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu