హైకోర్టును ఆశ్రయించిన ఐఏఎస్ స్మితా సబర్వాల్
posted on Sep 23, 2025 8:33PM

కాళేశ్వరం పీసీ ఘోష్ రిపోర్ట్ లో తన పేరును తొలగించాలని తెలంగాణ హై కోర్టు లో ఐఏఎస్ స్మితా సబర్వాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే స్మిత సబర్వాల్ చర్యలను.. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టులో పేర్కొ న్నారు. కాళేశ్వ రం నిర్మాణా లపై స్మితా సభర్వాల్ రివ్యూ చేసిందని కమిషన్ తెలపడమే కాకుండా బ్యారేజ్ లను సందర్శించిన పలు ఫోటోలను, సైతం రిపోర్ట్ లో పొందుపరిచింది. కొన్ని జిల్లాలు తిరిగి ఫీడ్‌బ్యాక్ ను ఎప్పటి కప్పుడు అప్పటి సీఎంకు స్మిత సభర్వాల్ చేరవేసిందని పీసీ ఘోష్ కమిషన్ తెలిపారు.
చీఫ్ మినిస్టర్ ఆఫీస్ స్పెషల్ సెక్రటరీ హోదాలో పలు సందర్భాల్లో స్మిత సభర్వాల్ మూడు బ్యారేజీలను సందర్శించింది. కాళేశ్వరం పై అడ్మినిస్ట్రేటివ్ అనుమతులు జారీ చేయడంలో స్మిత సభర్వాల్ కీలక పాత్ర పోషించింది. నిజా నిజాలను క్యాబినెట్ ముందు పెట్టనందుకు స్మిత సభర్వాల్ పై చర్యలు తీసుకో వాలని కమిషన్ రిపోర్ట్ లో పేర్కొ న్నారు. ఇదిలా ఉండగా మరోవైపు స్మితా సబర్వాల్ వివరణ ఇచ్చేందుకు తనకు 8b, 8c నోటీసులు ఇవ్వలేదని పిటిషన్ దాఖలు చేశారు. పీసీ గోష్ కమిషన్ రిపోర్టును క్వాష్ చేయాలని స్మితా సభర్వాల్ తెలంగాణ హైకోర్టును కోరారు.