సవితి తండ్రి చేతిలో... బాలుడి దారుణ హత్య
posted on Dec 13, 2025 10:10AM

హైదరాబాద్ నగరంలోని చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచే సుకున్న ఓ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇరుగు పొరుగు పిల్లలతో జరిగిన చిన్నపాటి గొడవ చివరకు ఓ 10 సంవత్సరాల బాలుడి ప్రాణాలు తీసిన విషాదకర ఘటనగా మారింది. స్థానికుల కథనం ప్రకారం, షేక్ మొహమ్మద్ అజహర్ (10) అనే బాలుడు పరిసరాల్లోని పిల్లలతో ఆడుకుంటూ గొడవకు దిగాడు. ఈ క్రమంలో “మీ పిల్లలను ఇలాగే పెంచుతారా?” అంటూ ఎవరో వ్యాఖ్యానించడంతో బాలుడి తండ్రి (సవితి తండ్రి) తీవ్ర ఆగ్రహానికి లోన య్యాడు.
కోపంతో రెచ్చిపోయిన సవతి తండ్రి ఈ నెల 7వ తేదీన అజహర్‌ను రోడ్డుపైకి ఎత్తి బలంగా పడేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో బాలుడి తలకు తీవ్ర గాయాలు కాగా, అతడిని వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. ఇదిలా ఉండగా, మృతుడు అజహర్ కుటుంబ నేపథ్యంలో కూడా చర్చనీయాంశంగా మారింది.
అజహర్ తల్లి ,భర్త ఉండ గానే మరో వ్యక్తిని ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నది. మొదటి భర్తతో కలిగిన సంతానమే అజహర్... రెండో వివాహం చేసుకున్న తర్వాత బాలుడు తల్లి దగ్గర ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో రెండో భర్త చేతిలోనే బాలుడు హత్యకు గురయ్యాడన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న చాంద్రాయ ణగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.