ఆ 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం స్టే... ఎందుకంటే?

 

ములుగు జిల్లా మంగపేట మండలంలోని స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు తాత్కాలికంగా స్టే విధించింది. మండల పరిధిలోని 23 గ్రామాలను గిరిజన గ్రామాలుగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ గిరిజనేతరులు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 1950లో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఆ గ్రామాలు గిరిజన పరిధిలో లేవని వాదనలు వినిపించారు. 

అయితే 2013లో గిరిజన సంఘాలు హైకోర్టులో పిటిషన్ వేయగా, నిజాం ఆర్డర్ ఆధారంగా గిరిజన గ్రామాలుగా పరిగణించాలని ఆ కోర్టు తీర్పు ఇచ్చింది. రాష్ట్రపతి ఉత్తర్వులను పక్కన పెట్టి నిజాం ఆదేశాలను అనుసరించడం సరైంది కాదని గిరిజనేతరులు అభ్యంతరం తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న వేళ, తమ హక్కులను కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌ల ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ, ఎన్నికలపై స్టే విధించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu