రాష్ట్రపతి తెలంగాణ పర్యటన... మినిస్టర్ ఇన్ వైటింగ్‌గా మంత్రి సీతక్క
posted on Dec 12, 2025 3:45PM

శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో డిసెంబర్ 17 నుండి 22 వరకు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పర్యటకు మంత్రి సీతక్క ‘మినిస్టర్-ఇన్-వైటింగ్’గా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.. శీతాకాల విడిదిలో భాగంగా సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేయనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని సీఎస్ కె. రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పటిష్టమైన భద్రత, ట్రాఫిక్, బందోబస్తు ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ శాఖను ఆదేశించారు. అగ్నిమాపక సిబ్బంది, ఫైర్ టెండర్లు, ప్రత్యేక వైద్య బృందాలను నిరంతరం అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.