డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు వైరల్ ఫీవర్

 

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ బారినపడ్డారు. జ్వరంతోనే సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు, అధికారులతో సమీక్షలు నిర్వహించారు. సోమవారం రాత్రి నుంచి జ్వరం తీవ్రత పెరిగింది. ఈ క్రమంలో వైద్యులు పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నారు. విశ్రాంతి అవసరమని సూచించారు. జ్వరంతో ఇబ్బందిపడుతూనే శాఖాపరమైన విషయాలపై అధికారులతో టెలీ కాన్ఫరెన్సులు నిర్వహించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా సెప్టెంబర్ 25న మూవీ థియేటర్లలో విడుదల కానుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu