ఉపాధి హామీ పథకం పేరు మార్పుకు కేంద్రం నిర్ణయం
posted on Dec 12, 2025 5:14PM
.webp)
కేంద్ర కేబినేట్ కీలక నిర్ణయం తీసుకుంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పునకు ఆమోదం తెలిపింది. ఇకపై పూజ్య బాపు గ్రామీణ్ రోజ్‌గార్ యోజనగా పేరు మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
అలాగే పనిదినాల సంఖ్యను 100 నుంచి 125కి పెంచింది. ఒక రోజుకు ఇచ్చే కనీస వేతనాన్ని రూ.240కి సవరించింది. యూపీఎ సర్కార్ ఎన్‌ఆర్‌ఈజీఏ’ పథకాన్ని 2006లో ప్రారంభించింది. జనాభా లెక్కలు-2027కు ఎన్డీయే సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశ చరిత్రలోనే తొలిసారిగా పూర్తి డిజిటల్ పద్ధతిలో చేపట్టనున్న ఈ బృహత్ కార్యక్రమానికి రూ.11,718.24 కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తూ ఆమోదముద్ర వేశారు.
‘కోల్ సేతు విండో’కు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. బొగ్గు గనుల రంగంలో సంస్కరణల కోసం నూతన పాలసీకి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కొబ్బరి కి మద్దతు ధర ప్రకటించిన కేంద్ర కేబినెట్.. 2026 సీజన్‌లో క్వింటాల్ మిల్లింగ్ కొబ్బరి కి క్వింటాల్‌కు రూ. 445 రూపాయలు. బాల్ కొబ్బరి క్వింటాలుకు 400 రూపాయలు మద్దతు ధర పెంచింది. మిల్లింగ్ కొబ్బరి క్వింటాలు ధర: 12,027 రూపాయలు, బాల్ కొబ్బరి ధర 12,500 ప్రకటించింది.