నెల్లూరులో ప్రేమోన్మాది ఘాతకం
posted on Sep 13, 2025 1:00PM

నెల్లూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. కరెంట్ ఆఫీసు సెంటర్ వద్ద బీఫార్మసీ విద్యార్థిని మైధిలి ప్రియ దారుణ హత్యకు గురైంది. ఇటీవల బీఫార్మసీ ఫైనల్ ఇయర్ పూర్తిచేసింది మైధిలిప్రియ. ఆమెతో మాట్లాడాలని రూమ్‌కి పిలిచి, కత్తితో పొడిచి చంపేశాడు స్నేహితుడు నిఖిల్ అయితే, మైధిలిప్రియ ప్రేమకు నిరాకరించినందుకే నిందితుడు హతమార్చి ఉంటాడని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు.
బెంగళూరులో జాబ్ చేస్తున్న మృతురాలు మైధిలి ప్రియ.. సెప్టెంబర్ 6 పుట్టినరోజు కావడంతో.. మూడో తేదీ నెల్లూరుకు వచ్చింది మృతురాలు. మాట్లాడాలి రూమ్‌కి రమ్మంటు మైదిలికి ఫోన్ చేసిన నిఖిల్.. రూమ్ కి వెళ్లిన తర్వాత మైధిలిని ప్రేమోన్మాది కత్తితో పొడిచి చంపినట్లు తెలుస్తోంది.
మృతి చెందిన తరువాత.. మృతురాలి చెల్లి సాహితికి నిందితుడు ఫోన్ చేశాడు. సాహితీ స్పాట్ కి వెళ్ళగానే మెట్లపైనే మైథిలి ప్రియా మృతదేహం ఉంది.గొడవ జరిగింది, చంపేశానని సాహితికి నిందితుడు చెప్పినట్లు తెలుస్తోంది. యువతిని హత్యచేసిన అనంతరం పోలీసు స్టేషన్‌లో నిందితుడు లొంగిపోయాడు. నిందితుడు రాపూరు మండలం చుట్టుపాలెం, స్వాతి బి ఫార్మసీ కాలేజీలో ఇద్దరు క్లాస్మేట్స్.
మరోవైపు మైధిలిప్రియ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు జీజీహెచ్‌కి తరలించారు పోలీసులు. మైధిలిప్రియ మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రేమ పేరుతో వేధించి.. తన కుమార్తెను హత్య చేశాడని బోరును మృతురాలి తల్లి లక్ష్మి విలపిస్తున్నది. నిందితుడు నిఖిల్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.