గంట కొట్టిన బాలయ్య... తొలి దక్షిణాది నటుడిగా రికార్డు

 

 

నందమూరి నటసింహం బాలకృష్ణ మరో అరుదైన ఘనత సాధించారు.  ముంబయిలోని నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) బెల్‌ను మోగించిన తొలి దక్షిణాది నటుడిగా నిలిచారు. అధికారుల ఆహ్వానం మేరకు ఎన్‌ఎస్‌ఈని తాజాగా బాలకృష్ణ సందర్శించారు. ఆ సమయంలో వారి విజ్ఞప్తి మేరకు అక్కడ ఏర్పాటు చేసిన గంటను కూడా మోగించారు. అందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

నందమూరి ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే నటసింహం వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. ఇప్పుడు మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. దీంతో జై బాలయ్య అంటూ సోషల్​ మీడియాలో ఫ్యాన్స్​ తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరుస రికార్డులు అందుకోవడంతో బాలయ్య అభిమానులు సందడి చేస్తున్నారు.

ఈ అరుదైన అవకాశం లభించడంపై స్పందించిన బాలకృష్ణ, తన సంతోషాన్ని పంచుకున్నారు. "ముంబై స్టాక్ ఎక్స్చేంజ్‌లో చిరస్మరణీయ, మరపురాని ఘట్టమని పేర్కొన్నారు. బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ప్రతినిధులతో ముంబై పర్యటనలో భాగంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్‌ను ఆయన సందర్శించారు. ఆ సందర్భంలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అధికారులు చూపిన ఆత్మీయత, ఇచ్చిన గౌరవం నా హృదయాన్ని తాకింది. 

ప్రత్యేక ఆహ్వానం ఇచ్చి స్టాక్ ఎక్స్చేంజ్ బెల్ మోగించే అవకాశాన్ని ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. దక్షిణ భారతీయ నటుడిగా, హీరోగా ఈ వేదికపై బెల్ మోగించిన మొదటి వ్యక్తిగా నిలవడం నాకు గర్వకారణం మాత్రమే కాదు… ఇది నా తెలుగు ప్రజల ప్రేమ, ఆదరణ, ఆశీర్వాదాల ప్రతిఫలమని భావిస్తున్నాను తెలిపారు. ఈ క్షణం నాకు మరపురానిది. ఇది వ్యక్తిగత ఘనత కాదని.. మనందరి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని నమ్ముతున్నాను." అంటూ బాలకృష్ణ తన ఆనందాన్ని పంచుకున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu