మనస్తాపంతో జూనియర్ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం
posted on Sep 8, 2025 9:14PM

తనపై నిందలు వేస్తూ పై అధికారులకు ఫిర్యాదు చేయడంతో మనస్థాపం చెందిన జూనియర్ అసిస్టెంట్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకుంది. జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న లకావత్ కల్పన
నల్లబెల్లి తహసీల్దార్ కార్యాలయంలో గత పది సంవత్సరాలుగా జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న కల్పనను. అదే మండలం బిల్ నాయక్ తండాకు చెందిన చరణ్ సింగ్ అనే వ్యక్తి మనసికంగా వేధిస్తూ అధికారులకు తనపై తప్పుడు నిందలు వేస్తూ ఫిర్యాదు చేశాడని, తనను లైంగికంగా వేధిస్తున్నాడని మనస్థాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నారని సూసైడ్ నోట్‌లో పేర్కొంది.
తన చావుకు చరణ్ సింగ్ తో పాటు మాజీ ఎంపీటీసీ మోహన్ అధికారులు కూడా కారణమంటూ తెలిపింది . కల్పన పురుగుల మందు తాగిన విషయం గమనించిన అటెండర్ కేకలు వేయడంతో సహో ఉద్యోగులు వచ్చి అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను హుటాహుటిన నర్సంపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించి చికిత్స అందిస్తున్నారు.