శునకంతో పార్లమెంట్‌కు వచ్చిన ఎంపీ రేణుకా చౌదరి
posted on Dec 1, 2025 2:42PM
.webp)
పార్లమెంట్ శీతకాల సమావేశాలు సందర్బంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి తన పెంపుడు కుక్కని తీసుకుని రాజ్యసభకు వెళ్లారు. అనుమతి లేకపోవడంతో పార్లమెంట్ సిబ్బంది వెనక్కి పంపారు. దీంతో అది కరిచే కుక్క కాదు, కరిచే వాళ్లంతా లోపల ఉన్నారంటూ రేణుకా చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పెంపుడు కుక్కను తీసుకురావడంపై బీజేపీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
"మూగ జీవిని మేము రక్షించాం. అది పెద్ద సమస్యగా, చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వానికి వేరే పని లేదా?" అని ఆమె నిలదీశారు. అంతేకాకుండా, "అసలైన కరిచే వాళ్లు పార్లమెంట్‌లోనే కూర్చున్నారు. వాళ్లే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ప్రతిరోజూ పార్లమెంట్‌లో కూర్చుని మమ్మల్ని కరిచే వాళ్ల గురించి మనం మాట్లాడం," అంటూ బీజేపీ ఎంపీలను ఉద్దేశించి రేణుకా చౌదరి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు