తరుముకొస్తున్న తుపాను.. ఆ మూడు జిల్లాల్లో రెడ్ అలర్ట్
posted on Oct 3, 2025 1:03AM
.webp)
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర కోస్తాంధ్ర వైపు వేగంగా కదులుతోంది. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో ఉత్తరాంధ్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలలో మెరుపు వరదలు సంభవించే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ప్రస్తుతం విశాఖపట్నానికి ఆగ్నేయంగా ఉన్న ఈ వాయుగుండం.. గురువారం (అక్టోబర్ 2) అర్దరాత్రి లేదా శుక్రవారం (అక్టోబర్ 3) ఉదయం గోపాల్ పూర్, పారాదీప్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఈ వాయుగండం ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మూడు జిల్లాలకూ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్న వాతావరణ శాఖ ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.